Tuesday, November 26, 2024

గీతాసారం.. (ఆడియోతో ..)

అధ్యాయం 6, శ్లోకం 45
ప్రయత్నాద్యతమానస్తు
యోగీ సంశుద్ధకిల్బిష: |
అనేకజన్మసంసిద్ధ:
తతో యాతి పరాం గతిమ్‌ ||

తాత్పర్యము :సమస్త కల్మషముల నుండి శుద్ధిపడి యోగి మరింత పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినప్పుడు బహుజన్మల అభ్యాసము పిదప పూర్ణత్వమును పొంది, అం త్యమున పరమగతిని పొందును.

భాష్యము : ఈ విధముగా ధార్మికుల, ధనికుల, పుణ్యాత్ముల కుటుంబాలలో జన్మించినవారు సానుకూల పరిస్థితులను సద్విన్యోగపరచుకొని యోగభ్యాసమును దృఢ చిత్తముతో కొనసాగించుదురు. అలా వారు పూర్తిగా హృదయములోని కల్మషాల నుండి విముక్తి పొంది పరిపక్వ స్థితియైన క ృష్ణచైతన్యము నందు స్థిరులగుదురు. భగవద్గీత(7.28)నందు తెలియజేసినట్లు”ఎవరైతే పాపములనుండీ పూర్తిగా ప్రక్షాళన చెందుదురో, వారు ద్వంద్వాలకు అతీతముగా దృఢ చిత్తముతో భగవత్సేవలో ముందుకు కొనసాగుదురు.”

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement