Tuesday, November 12, 2024

గీతాసారం.. (ఆడియోతో ..)

అధ్యాయం 6, శ్లోకం 44

44
పూర్వాభ్యాసేన తేనైవ
హ్రియతే హ్యవశోపి స: |
జిజ్ఞాసురపి యోగస్య
శబ్ధబ్రహ్మాతివర్తతే ||

తాత్పర్యము : పూర్వజన్మపు దివ్యచైతన్య కారణముగా అతడు కోరకనే అప్రయత్నముగా యోగము వైపుకు ఆకర్షితుడగును. జిజ్ఞాసువైన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మనియమములకు సదా అతీతుడై యుండును.

భాష్యము : ఉన్నత స్థితికి చేరిన యోగులు శాస్త్రాలలో చెప్పిన నానా విధాల తంతులకు స్వస్తి చెప్పి, యోగ నియమాలపట్ల ఆకర్షితులగుదురు. అవి పరిపూర్ణ స్థితియైన కృష్ణచైతన్యమునకు దారి తీయును. శ్రీమధ్భాగవతములో (3.33.7)ఈ విషయమే ధ్రువీకరించబడినది. శునకపు మాంసము తిను కుటుంబములో పుట్టినప్పటికీ ఎవరైతే భగవన్నామమును ఉచ్ఛరించుదురో వారు ఆధ్యాత్మిక జీవితములో ఎంతో పురోగతి చెందినవారనబడుదురు. వారు శాస్త్రాలలో తెలియజేయబడిన నానారకాల పుణ్యస్నానాల ను, తపస్సులను, శాస్త్రఅధ్యాయనాన్ని, యజ్ఞాలను నిర్వహించనట్లే లెక్క. దీనికి ఉదహరణ హరిదాస ఠాకూరు. ఆయన మహమ్మదీయ కుటుంబములో పుట్టినప్పటికీ శ్రీచైతన్య మహప్రభువు ఆయనను నామచార్యగా స్వీకరించిరి ఆయన ప్రతిరోజూ క్రమము తప్పకుండా మూడు లక్షల నామాలను చేసేవారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement