Friday, September 20, 2024

గీతాసారం

ఆధ్యాయం 6, శ్లోకం 42

అథవా యోగినామేవ
కులే భవతి ధీమతామ్‌ |
ఏతద్ధి దుర్లభతరం
లోకే జన్మ యదీదృశమ్‌ ||

తాత్పర్యము : లేదా (దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మటయు కృతకృత్యుడు కానిచో) అతడు జ్ఞానవంతులైన యోగుల ఇంట జన్మము నొందును. కాని ఈ జగములో అట్టి జన్మము నిశ్చయముగా అరుదుగా ఉండును.

భాష్యము : యోగుల కుటుంబాలలో గాని, ఆధ్యాత్మిక జీవితాన్ని పాటిస్తున్నటువంటి వారి కుటుంబాలలో గాని జన్మించుట చాలా మహత్తరమైనది. ఎందువలనంటే అటువంటి కుటుంబాలలో బాల్యము నుండే ఆధ్యాత్మిక జీవితము పట్ల ఆసక్తి కలిగే అవకాశము ఉంటుంది. భారత దేశములో సరైన శిక్షణా, ఆధ్యాత్మిక విద్యాబోధన కరువవటం చేత కొన్ని కుటుంబాలు, సంప్రదాయాలు కుంటు పడినా, ఇంకా కొన్ని చోట్ల ఈ సదవకాశాలు పెక్కుగానే ఉన్నాయి. ఈ విధముగా కొన్ని ఆచార్యుల కుటుంబాలు తరతరాలకు ఈ అవకాశమును కొనసాగిస్తూ ఉన్నాయి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement