శ్లో|| పుష్పామూలే వసేద్రహ్మ మధ్యేచ కేశవ:
పుష్పాగ్రేచ మహాదేవ: సర్వదేవా: స్థితాదలే||
పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్ప మధ్యమంలో కేశ వుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివశిస్తుంటారు. పుష్పదళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి. ఇక మన పురాణాల లో ఒక్కొక్క దేవతకు ఇష్టమైన పువ్వులను గురించి కూడా ప్రస్తా వించబడింది. శివునికి మాత్రం మారేడు పత్రి చాలంటారు. ఈ విషయాన్నే శ్రీనాథ మహాకవి వర్ణించాడు. శివుని శిరమున కాసిన్ని నీళ్ళుజల్లి – పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు|
కామధేను వతడింట గాడిపసర
మల్ల సురశాఖి వానింట మల్లెచెట్టు|
శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా ఉం టుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లెచెట్టుగా ఉంటుంది. అం తటి దయాసముద్రుడు శివుడు. శివధర్మ సంగ్ర#హం, శివ ర#హస్య ఖండం, లింగ పురాణం, కార్తీక మాహాత్మ్యం గ్రంథాలు శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఇలా చెబుతున్నాయి.
శివుని పుష్పాలతో పూజిస్తే, పది అశ్వమేధ యాగాలు చేసిన ఫ లం లభిస్తుంది. శివుని పూజకు ఉపయోగించే పువ్వులు వాడిపోయి నవిగా, కీటకాదులతో కొరకబడినవిగా ఉండేవి పనికిరావు. అలాగే ఇతరుల పూదోటలో పూచిన పువ్వులను దొంగతనంగా తీసుకువ చ్చి పూజిస్తే ఫలితం కనిపించదు. ఇంకా పాపం కలుగుతుంది. శివ పూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉం టుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, అశోకపువ్వు, జమ్మి, మందారం, గులాబి, ఉత్తరేణి, జాజి, సంపెంగ, పొన్న, తుమ్మి, మే డి, మల్లె, మోదుగ, నీలిపూలు, కుంకుమపూవు వంటి మొదలగు పువ్వులు పూజకు ప్రశస్తమైనవి, ఈ విషయాన్ని స్వామివారే ఉమాదేవికి చెప్పినట్లు పురాణ వాక్కు.
అదేవిధంగా శివుని ఏయే మాసాలలో ఏ పూలతో పూజిస్తే ఏయే ఫలితం ఉంటుందన్న విషయం కూడా చెప్పబడింది. చైత్రమా సంలో శంకరుని నృత్యగీతాలతో సేవి స్తూ, దర్భపువ్వులతో పూజిస్తే బంగా రం వృద్ధి చెందుతుంది. వైశాఖ మాసంలో శివుని నేతితో అభిషేకి స్తూ తెల్లని మందారాలతో పూ జిస్తే అశ్వమేథ ఫలం, జ్యేష్ఠ మాసంలో పెరుగుతో అభిషేకి స్తూ తామరపువ్వులతో పూజిస్తే పరమగతి కలుగుతుంది. ఆషా ఢమాసంలో కృష్ణ చతుర్ధశినా డు స్నానం చేసి శివునికి గుగ్గిలం తో ధూపం వేసి తొడిమలతో కూడి న పుష్పాలతో పూజిస్తే బ్ర#హ్మలోకం పరమపదం, శ్రావణమాసంలో ఒంటి పూట భోజనం చేస్తూ గన్నేరుపూలతో శివుని పూజిస్తే వేయి గోదానముల ఫలం లభి స్తుంది. భాద్రపద మాసంలో శివుని ఉత్తరేణి పూల తో పూజిస్తే హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్య పదానికి, ఆశ్వయుజమాసంలో పరమశివుని జిల్లేడు పూలతో పూజిస్తే మయూర ధ్వజంతో కూడిన విమానం లో దివ్యపదానికి చేరుతారు. కార్తీక మాసంలో శివుని పా లతో అభిషేకించి జాజిపూలతో పూజిస్తే శివపదాన్ని దర్శించుకుం టారు. మార్గశిర మాసంలో శివుని పొగడపూలతో పూజిస్తే, ముల్లో కాలను దాటి తామున్నచోటికే తిరిగి రాగలరు. పుష్యమాసంలో శివుని ఉమ్మెత్త పూలతో పూజిస్తే పరమ పదాన్ని పొందగలరు. మా ఘమాసంలో శివదేవుని బిల్వదళాలతో అర్చించిన వారు, లేత సూ ర్యుడు, చంద్రుడున్న విమానంలో పరమ పదానికి వెళతారు. ఫా ల్గుణమాసంలో శివుని సుగంధజలంతో అభిషేకించి తుమ్మిపూల తో పూజిస్తే ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుంది.
శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజ ఒక్కొక్క ఫలితం కలు గుతుంది. శివుని రోజు జిల్లేడుపూలతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు. శివపూజకు సంబం ధించినంత వరకు వేయి జిల్లేడుపూల కంటే ఒక గన్నేరుపువ్వు ఉత్త మం. వేయి గన్నేరుపూల కంటే ఒక మారేడు దళం, వేయి మారేడు దళాల కంటే ఒక తామరపువ్వు, వేయి తామరపూల కంటే ఒక పొగ డపువ్వు, వేయి పొగడపూల కంటే ఒక ఉమ్మెత్తపువ్వు, వేయి ఉమ్మె త్తపూల కంటే ఒక ములకపూవు, వేయి ములకపూల కంటే ఒక తు మ్మిపూవు, వేయి తుమ్మిపూల కంటే ఒక ఉత్తరేణుపువ్వు, వేయి ఉత్త రేణుపూల కంటే ఒక దర్భపూవు, వేయి దర్భపూల కంటే ఒక జమ్మి పూవు శ్రేష్ఠం. వేయి జమ్మిపూల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. పరమశివునికి పొగడ పూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడ పువ్వుతో అర్చించే భక్తుడు వేయి గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఒక నెలపాటు పొగడపూలతో పూజిస్తే స్వర్గసుఖా లను, రెండు నెలలు పూజిస్తే యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందు తారు. మూడునెలలు పొగడపూలతో అర్చించినవారికి బ్ర#హ్మ లోకప్రాప్తి. నాలుగు నెలలు పూజిస్తే కార్యసిద్ధి. ఐదు నెలలు పూజి స్తే యోగసిద్ధి. ఆరు నెలలు పూజిస్తే రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.
లింగపురాణం ఆ స్వామికి ఇష్టమైన మరిన్ని పత్రాలను గురిం చిన వివరాలను అందిస్తోంది. జమ్మి, మారేడు, గుంటగలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, కానుగు, నేలఉసిరి, మా చీపత్రి, నల్లఉమ్మెత్త, తామరాకు, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పూజ లో ఉపయోగించవచ్చు. అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, పత్రిని ఉపయోగించవచ్చు. ఉమ్మెత్త, కడిమి పువ్వులను శివునికి రాత్రి వేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజిపూలతో మూడవ జామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు. అయితే కోరికననుసరించి శివునికి పువ్వులను సమర్పించవచ్చు. ఉదా#హరణకు ధనం కావాలనుకున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖ శాంతుల కోసం నల్లకలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరల తో పూజించాలి. బిల్వదళ పూజ దారిద్య్రాన్ని తొలగిస్తుంది.
శివపూజకు పనికిరాని పువ్వులున్నాయి. మొగిలి, సన్నజాజి, మాధవి, అడవిమల్లి, దిరిసిన, మంకెన పువ్వులు శివార్చనకు పని కిరావు. బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, దాసాని, ఎర్ర మద్ది, మందార, విషముష్టి, అడవి మొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసిన, వెలగ, గురివింద శివపూజకు అనర్హం. పది సుగంధపుష్పాలతో పూజిస్తే, శత స#హస్ర మాలలతో పూజిం చిన అనంత పుణ్యం.
ప్రీతికర పుష్పార్చనలు!
Advertisement
తాజా వార్తలు
Advertisement