”శివేతి ద్యక్షరం నామ వ్యాహరిష్యంతి యేజనా:
తేషాం స్వర్గశ్చ మోక్షశ్చ భవిష్యతి నచాన్యథా!”
శివ’ అనే రెండక్షరాలను, అర్థాలను తెలుసుకొ ని ఎవరైతే జపిస్తారో, వారికి స్వర్గం (భౌతిక సంపత్తులు) లేదా మోక్షం (మరు జన్మలేని స్థితి) కలు గుతుందని, అది తప్ప మరోమార్గం లేదని ‘స్కాంద పురాణం’లోని మహేశ్వర ఖండం చెబుతున్నది.
ఈ శివుడినే శంభుడనీ, శంకరుడని, రుద్రుడనీ పిలుస్తారు. మంగళత్వాన్ని ఇచ్చేవాడు కాబట్టి శంభు డు. సమస్త సుఖాలను, వాటిని అనుభవించే శక్తి సామ ర్థ్యాలను ఇచ్చేవాడు కాబట్టి శంకరుడు. ‘రుతం ద్రావ యతీతి రుద్ర:’. సంసార దు:ఖాన్ని నశింపజేసేవాడు రుద్రుడు. అంతేకాదు, ‘రతిం వేదనా ద శ్రుతిం బ్రహ్మణే దదాతి ఇతి రుద్ర:’ అని కూడా అన్నారు.
ఒకసారి సోమకుడనే రాక్షసుడు బ్రహ్మ వద్ద నుం చి వేదాలను దొంగిలించాడట. అప్పుడు నాలుగు వేదా లనూ తిరిగి సస్వరంగా బ్రహ్మకు ఉపదేశించినవాడు రుద్రుడు. ఆయన గురించిన ఒక సూక్తం ‘వేదసూక్తాల’ లో ఉన్నది. దానినే ‘రుద్రసూక్తం’ అంటారు. దీని ప్రకా రం ‘ప్రపంచం నిండా వ్యాపించి ఉన్నది రుద్రతత్త్వమే’.
”యాతే రుద్ర శివా తనూ రఘోరా2 పాపనాశినీ!
తయా న స్తనువాశంతమయా గిరిశన్తాభి చాకశీహ!”
‘రుద్రసూక్తం’లోని మంత్రం ఇది.
‘ఓ శంకరా! నీ ఆది స్వరూపం శుభకరమైంది. ఆనందాన్ని అనుగ్రహించేది. నీ స్వరూపాన్ని భావించి నంతనే పుణ్యభావనలు మనసులో ఆవిష్కృతమవుతా యి. గిరిలో అంటే శబ్దంలో లీనమైనవాడివి. గిరి అంటే పర్వతంపై ఆదియోగిగా ప్రకటితమైనవాడివీ అయిన హ రుద్రా! సౌమ్యమూర్తివై మమ్మల్ని కటాక్షించు. అల్ప ప్రాణి నుంచి విశ్వమయత గలిగిన దేవతల వరకూ కాలమూ రుద్రస్వరూపమే’ అంటున్నది ఈ సూక్తం.
కార్యావిష్కరణ రుద్రతత్త్వమే. కార్యావిష్కరణకు అవసరమైన సామర్థ్యమూ రుద్రతత్త్వమే. రుద్రుడు సక ల సౌభాగ్యాలు ప్రసాదించేవాడు. అలాగే, ప్రళయాన్నీ సృష్టించేవాడు. సౌభాగ్యమూ, ప్రళయమూ వేరుగా కని పించినా ఒక నాణేనికి అవి రెండూ రెండు ముఖాలు. అవే మంచి చెడులు. అవి సాపేక్షికాలు మాత్రమే. పరిణా మపు గతిలో దేనిభాగం దానిదే. ఒక కార్యాన్ని నిర్వహించాలనే ఆలోచన, సాధించాలనే తపన, దానికి అవసర మైన ప్రేరణ, ఎలా సాధించాలో తెలిపే జ్ఞానం, నిర్వహించే సామర్థ్యం, నిర్వహణా విధానం, సంబంధిత వికాసం, ఎదురయ్యే అడ్డంకులూ, వాటిని తొలిగించు కునే పద్ధతి, కార్యావిష్కరణ వల్ల వచ్చే ఫలితమూ, ఆ ఫలితాన్ని అనుభవించే జీవుడూ అన్నీ రుద్రుడే’ అంటు న్నది ‘రుద్రసూక్తం’. వ్యక్తి మనుగడ వివిధ స్థాయిలలో భగవదర్పితంగా ఆత్మ సమర్పణ చేయడమే శివుడిని ఆరాధించడం. ప్రతి వానిలో, ప్రతిరూపంలో, అన్ని చోట్ల, అన్ని సమయాలలో శంకరుని భావించి దర్శించి ఆనందించడమే శివుని ఉపాసన. ప్రవహించే నీరు, పర్వ తాదులు, చెట్లు చేమలు, జంతువులు, బుద్ధి జీవుడిననే అహంకారాన్ని ప్రదర్శించే మనిషి. అన్నీ ఆ శంకరుని స్వ రూపాలే. సృష్టిలో కనిపించే అన్ని భావోద్వేగాలు, అన్ని ఆకర్షణ- వికర్ష ణలు ఆ రుద్రుని స్వభావాలేనని భావించి ఆరాధించేవా నిని కాపాడేదీ ఆ శంకరుడే.
ఎవరిలోనైతే సకల జీవులకు మేలు చేయాలనే కో రిక ఉంటుందో, పేదలను, దీనులను, నిస్సహాయులను ప్రేమాభిమానాలతో ఆదరిస్తూ, అందరిలో ఆ పరమే శ్వరుని చూసే మనసు ఉంటుందో ఆ వ్యక్తి పరమేశ్వరు నికి ‘అభిమానపాత్రుడు’ అవుతాడు. ఈ ప్రక్రియలో అ లాంటి వారి మనసు విస్తరిస్తుంది. అవగాహన అనంత మవుతుంది. ఆలోచన పరివ్యాప్తమవుతుంది. పరిధి అంతటా నిండి ఆద్యంతాలు కనబడవు. వారికి ఎక్కడ చూసినా కేంద్రబిందువే కనిపిస్తుంది. అటువంటి గొప్ప వ్యక్తి ఏ పని చేసినా తన విధులు సమర్థవంతంగా నిర్వహించగలుగుతాడు. వారిలోని ప్రజ్ఞ అద్భుతంగా వికసి స్తుంది. అభ్యాసంలో అవగాహన పెరుగుతుంది. సకల విషయాలూ బోధపడతాయి. కనుక, అంతటి రుద్రుడు మనందరినీ క్షణక్షణమూ కాపాడుగాక.