Saturday, November 16, 2024

అద్భుతం…శివుడి లీలలు!

ఓం నమ:శివాయ” అని భక్తితో కొలిచి చెంబుడు నీళ్ళు పోసినా… త్రిదళా న్ని సమర్పించినా భక్త జనకోటిని రక్షించేవాడు ఆ బోళాశంకరుడు. మన భరత ఖండంలో ఆ పరమశివుడు స్వయంభువుగా వెలిసిన అనేక శివాలయాలు వున్నాయి. అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఆ ఆలయాల అద్భుతాలు శాస్త్రవేత్తల కు కూడా అర్థంకాలేదు… అంతుచిక్కలేదు. నే టికీ ఆ పార్వతీనాథుని అద్భుతాలను ఈ క్రింది శివాలయాలలో అందరూ చూడవచ్చు.
మహానందిలోని శివలింగ అడుగు నుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి సస్యశ్యామలం అవుతుంది. బయట ఉండే కో నేరులో గుండుసూది వేసినా కనపడుతుంది.
ఎంత చలికాలంలో అయినా కూడా కోనేరులో నీరు గోరువెచ్చగా ఉంటుంది.
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కం దుకూరు కనిగిరి మధ్య) కె.అగ్రహారంలోని కా శీవిశ్వేశ్వర దేవాలయంలో శివలింగం క్రింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.
ఆదిలాబాద్‌ జిల్లాలో శ్రీ బుగ్గా రామేశ్వరా లయం వుంది. ఈ ఆలయంలో శివలింగం నుండి నీరు ఊరుతూ ఉంటుంది.
కరీంనగర్‌ జిల్లా కాళ్వేరము దేవాలయం లో నంది ఉత్తరాయణంలో ఉత్తర ముఖంగా ను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు
అలంపూర్‌ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాంకులతోనైనా అభిషేకం చెయ్యండి, కానీ ఆ నీరు ఎటుపోతుందో ఎవ్వరికీ అంతు చి క్కదు.
వరంగల్‌ జిల్లా వెయ్యిస్తంభాల గుడి, ఇక్కడ సంగీత స్తంభాలు గలవు. ఇక్కడ నందిని మీ టితే కంచు శబ్దం వస్తుంది.
ద్రాక్షారామం ఈ శివలింగం పై ఉదయం సాయంత్రం సూర్య కిరణాలు పడతాయి. ఎ క్కడో లోపలకు వుండే గర్భాలయంలోని పర మేశ్వరునిపై సూర్య కిరణాలు ఎలా పడతా యనేది అంతుచిక్కని అద్భుతం.
భీమవరంలో సోమేశ్వరస్వామి కొలువై వు న్నాడు. ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్ల గా, పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు.
కోటప్పకొండ ఎటుచూసినా మూడు శిఖరా లు కనిపిస్తాయి, ఇక్కడికి కాకులు అసలు రావు.
గుంటూరు జిల్లా చేజర్ల ఇక్కడ స్వామి పేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లు పోస్తే శవం కుళ్లిన వాసన వస్తుంది. ఉత్తర భాగంలో నీరు పోస్తే అవి ఎక్క డికి పోతాయో ఎవరికీ తెలీదు.
బైరవకోనలోకి అసలు కాకులు రావు. అలా గే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి అసలు రాదు.
యాగంటిలో వున్న నంది రోజురోజుకు పె రుగుతూ ఉంటాడు
శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహ అని చెప్తారు.తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయ న మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికాదేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివు డు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉం టుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్‌, కర్నూల్‌, విజయవాడ స్టేషన్లు రికార్డు కూడా చేశాయి.
కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది. ఆరు నెలలు ఈ దేవాలయం నీటిలో మునిగి ఉం టుంది. ఆరు నెలలు బయటకు కనిపిస్తుంది.
శ్రీకాళహస్తిలో వాయురూపములో శివలిం గం ఉంటుంది.
అమరనాథేశ్వరుడు ఎలా ఏర్పడతాడో అం తుబట్టదు. అమరనాథ్‌లో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో స్వయంగా మంచు శివలిం గం ఏర్పడుతుంది.
కర్ణాటకలో శివగంగ వుంది. ఇక్కడ శివలిం గంపై నెయ్యి వుంచితే వెన్న అవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగా జలం ఉద్భవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు.
మహారాష్ట్రలో కోపినేశ్వర్‌ అనే దేవాలయం లో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరు గుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.
తమిళనాడు తిరు నాగేశ్వరము ఆలయం వుంది. ఇక్కడ స్వామివారికి పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి.
చైనాలో కిన్నెర కైలాసము ఇక్కడ ఉన్న శివ లింగము ఉదయం తెల్లగా, మధ్యా#హ్నం పసు పుగా, సాయంత్రం తెలుపుగా, రాత్రి నీలంగా మారతాడు.
ఆ లోకేశ్వరుడి అద్భుతాలు అనంతం. ఇలాంటి ఆలయాలు ఎన్నో ఎన్నెన్నో వున్నా యి. నేటికీ ఈ అద్బుత దృశ్యాలను ఆయా దేవాలయాలలో చూసి తరించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement