Friday, November 22, 2024

దుర్యోధనుడి చెరలో శ్రీకృష్ణుడి తనయుడు!

దృతరాష్ట్రుడు, గాంధారిల జ్యేష్ఠ పుత్రుడు అయిన దుర్యోధనునకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు లక్ష్మణ. ఆమెకు వివా#హం చేయాలని నిర్ణయించారు. కృష్ణ పరమాత్మ కుమారుడయిన సాంబుడు దుర్యోధనుని కుమార్తె అయిన లక్ష్మణను తీసుకుని ద్వా రకానగరం వైపుకి బయలుదేరాడు. ఆ సమాచారం తెలిసిన దుర్యోధనుడు మీరందరూ వెళ్లి అతనిని ప్రతిఘటించండి అని తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్లి సాంబుడిని ప్రతిఘ టించారు. కౌరవ సైన్యానికి సాంబుడికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. సైన్యం సాంబుడి ధనుస్సు విరిచేసి అశ్వములను కూలద్రోసి ఆయన సారధిని నిర్జించి సాంబుడిని, సాంబుడు తీసుకుపోతున్న లక్ష్మణను బంధించి తీసుకువచ్చి దుర్యోధనునకు అందజేశారు. ఆయన వాళ్ళిద్దరిని బంధించాడు. ఈ వార్త ద్వారకా నగరమునకు చేరింది. వెంటనే శ్రీకృష్ణ భగవానుడు సర్వ సైన్యములతో దుర్యోధ నుని మీదికి యుద్ధానికి బయలుదేరుతున్నా డు. బలరాముడు సోదరుడిని అడ్డుకు న్నాడు. ఎందుకంటే బలరాము డికి కౌరవులంటే కొంచెం పక్షపా తం ఉంది.
అందుకని ఇలా అన్నాడు.
”దుర్యోధనుడు నా శిష్యుడు. ఈమాత్రం దానికి యుద్ధానికి వెళ్ళనవసరం లేదు. నేను వెళతాను. దుర్యోధనునకు నాలుగు మంచి మాటలు చెప్పి ఒప్పించి లక్ష్మణను మన కోడలి గా తీసుకువస్తాను” అని చెప్పి పెద్దలతో కలిసి బయలుదేరి వెళతాడు. ఊరిలోకి ప్రవేశించ కుండా ఊరిబయట ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేశారు. బలరాముడు మహా బల వంతుడు. బలరాముడితోపాటు ఉద్ధవుడు వచ్చాడు. బలరాముడు ఉద్ధవుడిని దుర్యోధ నుని వద్దకు రాయబారిగా పంపాడు. ఉద్ధవుడు వెళ్లి – ”మీ అందరిచేత పూజింపబడవలసిన వాడయిన బలరాముడు పెద్దలయిన వారితో ఇవాళ ఈ పట్టణమునకు విచ్చేసి హస్తినాపు రమునకు దూరంగా ఉం డే ఒక ఉద్యానవనంలో విడిది చేసి ఉన్నాడు. కాబ ట్టి మీరు వెళ్ళి
ఆయ నను సేవించవ లసినది” అని చెప్పాడు. బలరాముడు వచ్చా డు అని తెలియగానే దుర్యోధనుడు కౌరవ పెద్దలను తీసు కొని బలరాముడు విడిది చేసిన ఉద్యానవన మునకు వెళ్ళాడు. బలరామునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సేవిం చాడు. బలరాముడిని పొగిడాడు. అపుడు బలరాముడు
”నా తమ్ముడైన శ్రీకృష్ణుని కుమా రు డు సాంబుడు నీ కుమార్తె అయిన లక్ష్మణ ను చేపట్టాలని ప్రయత్నం చేస్తుం టే నీవు వానిని బంధించావని తెలి సింది. అందుకని నీవు నా తమ్ముని కుమారుని, కోడలిని విడిచిపెట్టి నాతో పంపవలసింది” అన్నాడు. వెంటనే దుర్యోధనుడు ”ఏమి చెప్పా వయ్యా బలరామా! కాలగతిని చూ స్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేమెక్కడ! యాదవులయిన మీరెక్కడ! మీరు పశు వులను తోలుకునే వారు మీకు రాజ్యాధికారం లేదు. మీకు మా పిల్ల కావలసి వచ్చిందా! నీ మాటలు వింటుంటే నాకు ఏమనిపిస్తోందో తెలుసా? కాళ్ళకి తొడుక్కోవలసిన చెప్పులు తల కెక్కాలని కోరుకుంటే ఎలా ఉంటుందో నువ్వు కోరిన కోరిక అలా ఉంది. యయాతి శాపం చేత అసలు యాదవులయిన మీకు రాజ్యాధికారం చేసే అధికారం లేదు. కానీ మీరు రాజులు ధరించే ఛత్ర చామరాదులు అన్నీ ధరిస్తున్నారు. రాజభోగములనన్నిటిని అనుభవిస్తున్నా రు. ఇంతటి గౌరవమును పొందారు. కృష్ణుడిని చూసి మిమ్ములను చూసి ఎవరూ గౌరవించ లేదు. కౌరవులతో మీకు సంబంధం ఉంది కాబట్టి మీరు దుర్యోధనుడి గురువుగారు అని మిమ్మల్ని గౌరవిస్తున్నారు. రానురాను ఆ గౌరవమును పక్కన పెట్టి మాతోనే వియ్యమందాలని కోరిక పుట్టిందే మీకు! కాబట్టి ఇది జరిగే పని కాదు. మీ హద్దులో మీరు ఉండడం మంచిది” అని చెప్పి దుర్యోధనుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బలరాముడు చెప్పే సమాధానం చెప్పడానికి అవకాశం కూడా ఇవ్వ లేదు. అపుడు బలరాముడు అక్కడ ఉన్న కౌరవ పెద్దలతో ”దుర్యోధనుని మాట తీరు మీరు చూశారు కదా! ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగిందో చెప్తాను వినండి- ఏ కృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చి నరకాసురుని వధించాలని అనుకున్నప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారో, దేవేంద్రుడంతటి వాడు కూడా ఈవేళ భూలోకంలో తిరుగుతున్న కృష్ణుడంటే సాక్షాత్తు శ్రీమన్నా రాయణుడే అని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నాడో, ఏ పరమేశ్వరుని మందిరం కల్ప వృక్షముల తోటయో, అక్కడకు వచ్చిన వారి కోరిక తీరకపోవడం అనేది ఉండదో, ఏ మహా త్ముడి కనుసైగ చేత అందరి కోరికలు తీరతాయో, ఏ పరమేశ్వరుని పాద యుగళిని ప్రతి నిత్యము సేవించాలని లక్ష్మీదేవి తాపత్రయపడుతుందో, నిరంతరమూ సేవి స్తుందో, ఏ పరమేశ్వరుని అంశభూతముగా చతుర్ముఖ బ్రహ్మ వంటి వారము జన్మించా మో, అట్టి పరమేశ్వరుడు దుష్ట సంహారకుడయిన శ్రీకృష్ణ పరమాత్మ గొప్పతనం చేత ఇవ్వా ళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకా నగరమును ఏలగలుగుతున్నాడు. అది పరమ యథార్థము. కానీ ఇవాళ దుర్యోధనుడు మాకు కృష్ణుని వలన వైభవం రాలేదని అంటున్నా డు. ఇంతటి దుర్మార్గంగా మాట్లాడే వానికి తగిన బుద్ధి చెప్పి తీరాలి.” అన్నాడు.
వెంటనే లేచి గంగానది ఒడ్డుకు వెళ్లి ”ఈ హస్తినాపురము నంతటిని నాగలితో పట్టి లాగి తీసుకువెళ్ళి గంగానదిలో కలిపివేస్తాను” అని తన నాగలిని హస్తినాపుర నేల లోపలికం టా గుచ్చి లాగాడు. సముద్రములో పడవ తరంగములకు పైకి తేలినట్లు ఎన్నో రాజసౌధము లతో ఉండే హస్తినాపురము అలా పైకి లేచింది. దానిని గంగానదిలోకి లాగేస్తున్నాడు. అంత: పురము కదిలింది. దుర్యోధనుడు ”ఏమి జరిగింది” అని అడిగాడు. ”నీవు అన్న మాటలకి బలరాముడు హస్తినాపురిని నాగలికి తగిలించి గంగలో కలుపుతున్నాడు” అని చెప్పారు. వెంటనే భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వంటి పెద్దలందరినీ తీసుకుని దుర్యోధనుడు బల రాముని వద్దకు పరుగుపరుగున వచ్చాడు.
దుర్యోధనుడు బలరాముని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. ”నా తప్పులను మన్నించండి” అని ప్రార్థించాడు. దాంతో బలరాముడి కోపం చల్లారింది. బలరాముడికి అనేకమైన కానుకలను యిచ్చి లక్షణను సాంబుడిని రథము ఎక్కించి పంపించాడు.
అప్పటినుంచి ఇప్పటివరకు హస్తినాపురం దక్షి ణం వైపు ఎత్తుగా, ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement