వైదిక సంప్రదాయానుసారం పిల్లలు ప్రతి దినం తల్లిదండ్రులకు, గురువుకు నమస్కరించాలి. ఆ తీరులోనే శ్రీకృష్ణ- బలరాములు తమ తండ్రి అయిన వసుదేవుడికి, ఆయన భార్యలకు నమస్కరించేవారు. ఒక నాడు కురుక్షేత్రంలో క్రతువు నిర్వహించి వచ్చిన కృష్ణ బలరాములు తమకు నమస్కరించుటకురాగా, పుత్ర ప్రేమ తో వారి ఔన్నత్యాన్ని వసుదేవుడు ప్రస్తావించాడు.
”కృష్ణా! నీవు సచ్చిదానంద విగ్రహుడవు. దేవదేవుడవు. నాయనా! బలరామా! నీవు సాక్షాత్తు యోగ శక్తులకు ఆధా ర భూతుడవు. సంకర్షణుడవు. వీరిరువురును సనాతన పురుషులని నాకిప్పుడు బోధపడినది. ఈ దృశ్యమాన జగత్తుకు, దానికి కారణభూతుడైన మహావిష్ణువుకు అతీతులు. సకల సృష్టికీ నీవే అధినేతవు. సృష్టి అంత నీ లీలావినోదము కొరకే సృజించబడినది. నీ అనుమతి, సం కల్పం లేకుండ ఏ పని చేయజాలరు. మూలశక్తి నీ నుండే ఉత్పన్నమైనది.
సకల జీవులబుద్ది వివేచనాశక్తి, జీవుల సునిశిత జ్ఞాపకశక్తి అన్ని నీవే. దేవా! మాయా శక్తి నీవే ప్రభూ. నీవు శరణాగత రక్షకుడవు. సాధు జనుల యోగ క్షేమాలను విచారించువాడవు. కావున నేను నీ చరణార విందములను ఆశ్ర యించుచున్నాను. ఐహిక బంధాలనుండి నీ చరణారవిందములే మోక్షమును ప్రసాదింపగలవు. నీ విభావమును కీర్తించుట ఒక్కటే నా కర్తవ్యమని శ్రీకృ ష్ణుని ప్రశంసించాడు ఆ తరువాత శ్రీకృష్ణుడు వసుదేవుడుతో ”జనకా! నీ వెన్ని చెప్పిన మేము నీ పుత్రులమే! మా గురించి నీవు పలికినదంత ఆధ్యా త్మిక విజ్ఞానం. అంతా వాస్తవమే అని నేను ధృవపరచుచున్నాను.”
కృష్ణుడు వసుదేవునితో తనకుగల పితృ, పుత్ర సంబంధాన్ని విస్మరింప దలచలేదు. వసుదేవునకు తాను శాశ్వత పుత్రుడనని, ఆయన తనకు శాశ్వత జనకుడని అంగీకరించెను.అనంతరం ఆధ్యాత్మికంగా జీవులందరి ఏకత్వాన్ని గూర్చి, శ్రీకృష్ణుడు తన తండ్రికి ఈవిధంగా చెప్పాడు.
”జనకా! నేను, నా సోదరుడు, ద్వారకానగర పౌరులు, సమస్తమైన ఈ జగత్తంతా నీవు వివరించినట్లే ఉంది. సర్వ వసుదేవుడు ఒక మహా భాగవతుని దృష్టిలో దర్శిం చాలని శ్రీకృష్ణుడు కోరాడు. మహాభాగవతుడు ప్రథమ శ్రేణికి చెందిన భక్తుడు. జీవులందరు దేవదేవుని అంశలు. దేవదేవుడు ప్రతి జీవి హృదయంలో నిలిచి వుంటాడు. ప్రతి జీవి ఆధ్యాత్మిక రూపమైన ప్రకృతి కలయిక, ప్రకృ తి గుణములచేత అతడు ప్రభావితుడగును. తన ఆత్మ దేవదేవునితో సమాన ధర్మమును కలిగివున్నదన్న సంగ తిని విస్మరించి, దేహాత్మ భావనచే అతడు ఆచ్చాదితుడ గును, భిన్నమైన దేహ లక్షణాలు కలిగియుండుటచే ఒక వ్యక్తి, మరొకని కంటే భిన్నుడని భావిస్తాము. పిమ్మట కృష్ణుడు పంచ భూతాల ఆధారంగా ఒక చక్కని దృష్టాంతాన్ని చూపినాడు. పంచభూతములైన ఆకాశం- వాయు వు- అగ్ని- జలము- భూమి ఈ భౌతిక జగత్తులో ఒక కుండలో, కొండలో, చెట్లలో అన్నింటిలో చేరివున్నవి. పరిమాణములు వేరువేరు అయినావానిలో చేరియున్న అంశములు ఒక్కటే. అలాగే శ్రీకృష్ణుడు మొదలుకొని విష్ణుతత్వ ము, లక్షలాది విష్ణురూపాల వరకు బ్రహ్మ మొదలుకొని పిపీలికం వరకు అం దరు ఒకే ఆధ్యాత్మిక లక్షణాలు కలిగియున్నారు. కొందరి పరిణామం ఎక్కు వ. కొందరికి తక్కువ. కాని గుణాల విషయంలో అందరూ సమానమే అం టూ శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జీవితదర్శనం వివరింపగా, వసుదేవుడు ఆనంద పారవశ్యముతో మౌనముగా వుండిపోయాడు.
– పివి సీతారామమూర్తి, 9490386015
వసుదేవునికి శ్రీకృష్ణుడి ఆత్మబోధ
Advertisement
తాజా వార్తలు
Advertisement