Saturday, September 21, 2024

శ్రీకృష్ణ తన్మయానందతత్త్వం

సమస్యలకు, సవాళ్లకు భయప డి పారిపోకూడదు. చివరివ రకు విజయం మనదేనన్న భా వంతో పోరాడాలి. ధర్మం మని షి సాటి మనిషితో, సృష్టితో సుఖం గా జీవించమని చెబుతుంది. మనిషికి కేవలం ధార్మిక స్థలం లోనే ఎల్లప్పుడూ శాంతి లభి స్తుంది. ధర్మం మనిషిలోని సంఘర్షణలను నాశనం చేస్తుం ది. అప్పుడప్పుడు ధర్మం విస్మరించే సమయం వస్తుంది. సంఘర్షణలతో, ఈర్ష్యలతో, ఆక్రోశ, క్రోధం, వైరాలతో కరుణను మరచిపోతుంటాడు. అప్పు డు వాస్తవిక జ్ఞానాన్ని తెలియచెప్పడానికి పరమాత్ముడు అవతారమెత్తక తప్పదు.
స్వధర్మం, ఏది పరధర్మం, ఎక్క డ ఎవరిని శిక్షించాలి, ఎవరిని రక్షించాలి, అసలు మనిషి విజ యాన్ని ఎలా కైవసం చేసుకో వాలి ఇవన్నీ మనకు కృష్ణా వతారంలో కనపడతా యి. చెరసాలలో కఠిన శిల ల మీద జన్మించి, మన పుట్టుక మన ఉన్నతికి అవ రోధం కాదు అనే సందేశాన్ని మనకు అందించాడు.
శ్రీకృష్ణుడ్ని దేవుడిగా భావించ డానికి ప్రధాన కారణం ఆయనలోని స్థిత ప్రజ్ఞత. ఎటువంటి పరిస్థితికైనా చెలించకుండా ఉండే గుణం శ్రీకృష్ణుడిలో చాలా ఎక్కువగా ఉంది. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మోముపై చిరునవ్వు చెదరదు. ఆయన చేతిలోని పిల్లనగ్రోవి ఆలాపనలో ఎలాంటి మార్పురాలేదు. వేలాది రాజుల సమక్షంలో తనను అగ్రపీఠంపై కూర్చోబెట్టినప్పుడూ, తన కళ్లముం దు ద్వారకాపట్టణం సముద్రంలో క్రుంగిపోతున్నప్పు డూ అదే చిరునవ్వు.
శ్రీకృష్ణుడు మహావిష్ణువు అవతారమే, దేవతాంశ ఉండవచ్చు. ఐతే, ఆయన మానవునిగా పుట్టాడు. మాన వునిగానే పెరిగాడు. అందరిలా కష్టసుఖాలు అనుభవిం చాడు. బోయవాడి బాణందెబ్బకు కన్నుమూశాడు.
శ్రీకృష్ణుడ్ని దేవునిగా మార్చింది ఆయన చిరునవ్వే. జీవితాంతం వరకు నవ్వుతూ బతకాలన్నదే ఆయన తత్వం. అదే మానవాళికి నిత్యమార్గదర్శనం. గజేంద్రు ణ్ని రక్షించినప్పుడు, ద్రౌపదిని ఆదుకునే ప్రయ త్నం చేసినప్పుడు, కుచేలుడిని ఆదరించి న ప్పుడు, ఆయా సందర్భాల్లో ప్రవ ర్తించిన కారణాలను వెలుతు రులో నలుపురంగు కని పించేటంత స్పష్టంగా తన తత్వంగా తె లిపాడు.
కృపారసం చల్లడమంటే అదే. దాంతో ఎవరికి వారే తమకు కృష్ణుడు వశమైపోయాడని మురిసిపోయేవా రు. ఆయనేమో వారి అమాయకత్వానికి నవ్వుకునేవా డు. ఆ మోహానికి గురికానిది రుక్మిణి ఒక్కతే. అందుకే ఆమె అంటే అంత ప్రేమ కృష్ణుడికి!
శ్రీకృష్ణుని జీవితం పూలపాన్పు కాదు. పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచీ జీవన్మరణ సమస్యే. మేనమామ కం సుడు ఈ పిల్లాడ్ని వధించాలని ఎన్నో వ్యూహాలు పన్నా డు. పూతనను పంపాడు, శక టాసురుణ్ణి పంపించాడు. బకాసురుడు, వృషభాసు రులను ఉసిగొలిపాడు. ఈ రక్కసి మూకతో పోరాడ తేనేగాని విజయం కృష్ణుడి కి దక్కలేదు. ఏదో ఒక మ#హ మ చూపో, లేదా మంత్రం జపించో రాక్షస వధ చేయలేదు. ఆయనలోని దైవశక్తిని ఈ కార్యాలకు ఉపయోగించలేదు. మానవశక్తినే నమ్ము కుని పోరాడి విజయం సాధించాడు. చిరునవ్వుతోనే సవాళ్లను స్వాగతించాడు. ఆత్మబలంతోనే అంతిమ విజ యం తనదనిపించుకున్నాడు. సమస్య తలెత్తినప్పుడూ అదే నవ్వు. గెలిచిన తర్వాత కూడా అంతే చిరునవ్వు. ఇదే శ్రీకృష్ణ తత్వం. ఇది శ్రీకృష్ణ తన్మయానంద తత్వం.
కృష్ణ తత్వానికి బలం చేకూర్చే మరో అంశం యము న. ఆ నది నీరు నలుపు. ఆయనకు ఇష్టమైన విహార ప్రదే శం యమునాతీరం, కర్మలకు, కృత్యాలకు, సరదా, సం దడి లాంటి అన్ని చర్యలకు ప్రత్యక్ష సాక్షి యమున. అలాంటి యమున సా#హచర్యం కృష్ణతత్వాన్ని చక్కగా బోధిస్తుంది. శ్రీకృష్ణుడికి ఇష్టమైన మరో విషయం నెమలి పించం ధరించడం. దాన్ని ధరించడంలోని అంతరా ర్థం, అంతర్యం పరిశీలిస్తే- శ్రీకృష్ణతత్వం మరికొంత అర్థం అవుతుంది. నెమలి పింఛం ప్రకృతిలో కనిపించే ఏడు రంగుల సమాహారం. అంటే అన్ని రంగులూ అం దులో ఇమిడి ఉంటాయి. ఆకాశం విశ్వమంతా ఆవరిం చి ఉన్నా, పగలు నీలం రంగులో, రాత్రుళ్లు శ్యామ వర్ణం లో, సూర్యోదయానికి ఒక రంగు, అస్తమయానికి మరొ క రంగు, మండుటెండలో మరొక రంగు! అన్ని రంగు లూ ఒక సమాహారంగా దర్శనమిచ్చేది నెమలి పించం లోనే. నెమలి పింఛం కాలానికి ప్రతీక. నేను కాలస్వరూ పుణ్ని అని తెలపడం ఇందుకు దృష్టాంతం!
అమలిన ప్రేమ ఎలా ఉండాలో రాధామాధవ త త్వం తెలుపుతుంది. యుద్ధం అనివార్యమని తెలిసినా కౌరవ పాండవుల మధ్య సయోధ్య కదిలించే నేపధ్యం లో, ఆ పరమాత్మలో నేటికి ఆదర్శంగా తీసుకోగలిగే ఒ క ఆదర్శప్రాయుడైన రాయబారిని మనం చూస్తాం.
ఇవన్నీ ఒక ఎత్తయితే కురుక్షేత్ర సంగ్రామంలో అర్జు నుడికి చేసిన గీతోపదేశం మానవాళికి ఒక గొప్ప వరం. కర్తవ్య నిర్వ#హణలో భీరువై పారిపోక, విజయం ఎలా సా ధించాలో చెప్పిన ఓ విశ్వగురువు ఆ శ్రీ కృష్ణ పరమాత్మ. అనంత సాగరం లాంటి కృష్ణ తత్వం గురించి తెలుసుకో వడమంటే, ఎడారిలో ఇసు క రేణువులు లెక్కపెట్టటం వంటిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement