శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం అయిన శ్రీకృష్ణుడు జన్మదినం. కృష్ణాష్టమిగా… జన్మాష్టమిగా మనం జరుపుకుంటున్నాం. శ్రీకృష్ణుడు శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణమాసం బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో దేవకీ వసుదేవుల అష్టమ గర్భంలో చెరసాలలో అర్థరాత్రి జన్మించాడు. శ్రీకృష్ణావతారం సార్వజనీనం… సత్యప్రామానికం… పరిపూర్ణం. నేడు జన్మాష్టమి సందర్భంగా… ఆ అమదానంద అవతారదీప్తి అవతార తత్వంలోని సమున్నత విలువల సమాహారం….
శ్రీకృష్ణుడు కర్మయోగి. ధర్మయోగి. జ్ఞానయోగి. ఒక దానిని మిగిలిన రెండింటితో సమన్వయ చేస్తూ, తన అవతార సందేశాన్ని లోకానికి అందించిన జ్ఞానమూర్తి. శ్రీకృష్ణుడి అవతార తత్త్వంలో సమున్నతమైన విలువలు అడుగడుగునా కనిపిస్తాయి. అందుకే శ్రీ కృష్ణావతారం సార్వజనీ నకమై, సత్యప్రామాణికమై, పరిపూర్ణావతారంగా నిలిచిపోయింది. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి శ్రీకృష్ణుడు. ప్రతి క్షణం ధర్మానికి అండగా ఉంటూ ధర్మాన్ని గెలిపించాడు. శరణాగత వత్సలుడు అయ్యాడు. ప్రేమైకమూర్తిగా నిలిచాడు. అందుకే యుగయుగాల పాటు శ్రీకృష్ణుని కథ నిలిచిపోయింది. చెరసాల అంటే చీకటి ప్రదేశం. మనిషి చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానా నికి ప్రతీక. ఇక అష్టమ గర్భం, అష్టమి తిథి. అష్టమ సంఖ్య అనేది అష్టాంగ యోగాన చివరిదైన సమాధి స్థితి. సాధకుడు యీ స్థితిలోనే భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతాడు. శ్రీకృష్ణ జననమే యిక్కడ భగవత్ సాక్షాత్కా రం. శ్రీకృష్ణుని జననం తర్వాతే వసుదేవునికి సంకెళ్లు విడిపోయాయి. చీరలను దోచుకుని గోపికల దేహ చింతలను తీర్చాడు. చీరలిచ్చి నిండు సభలో ద్రౌపది గౌరవాన్ని కాపాడిన లీలా మానుషధారి శ్రీకృష్ణుడు.
గోపాలుడనగా గోవులను పాలించినవాడు. గో సంరక్షకుడు అని అర్థం.
ఇక్కడ గోవులు అంటే జీవులు. జీవుల సంరక్షకుడే శ్రీకృష్ణుడు.
కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో వానరులే, ద్వాపరంలో గోపి కలు. కృతయుగంలో ఋషులకు దర్శన భాగ్యమే కలిగింది. త్రేతాయుగం లో వానరులకు సంభాషణా భాగ్యం, ద్వాపరయుగంలో దర్శన, స్పర్శన, సంభాషణా భాగ్యాలను పొందిన ధన్యజీవులు గోపికలు. సర్వత్రా భగవం తుని లీలా విభూతిని దర్శించడమే కర్తవ్యమని నిరూపించారు గోపికలు.
శ్రీకృష్ణుడు దొంగిలించినది వెన్నకాదు. గోపికల హృదయాలలోని పవి త్రమైన ప్రేమ. గోపికలు మధించినది పెరుగుకాదు.వాళ్ళ మనసుల్ని కృష్ణ నామస్మరణతో మధించి, భగవదనుగ్రహం అనే వెన్న పొందారు. జీవుల భౌతిక ఆవరణలను ఛేదించి, అశాశ్వతమైన రాగద్వేషాలలో చిక్కుకున్న జీవులకు ముక్తిని ప్రసాదించడమే పాలు/ పెరుగు కుండలను పగులగొట్టడం. పెరుగుతో తడుపుకున్న పాదముద్రల ఆధారంగానే కృష్ణుణ్ణి గోపికలు పట్టుకోగలిగారు. అంటే భగవంతుని పాదాలు పట్టుకుంటే, భగవ దనుగ్రహం తప్పక దొరుకుతుందనేది విశేషార్ధం. కృష్ణుణ్ణి రోలుకి యశోద బంధించినప్పుడు, కట్టినతాడు రెండు కొసలలో ఒకటి బ్రహ్మ నిష్ట. రెండోది ధర్మనిష్ట అని చెబుతారు. అమ్మ ప్రేమ పాశా నికి, వాత్సల్యానికి తనంత తానుగా కట్టుబడిపోయేడు శ్రీకృష్ణుడు. ఇక కాళీయ మర్దనం. మడుగు సంసారానికి ప్రతీక. కాళీయుడు విషయ వాంఛా పూరితుడైన మానవునికి చిహ్నం. కాళీయుని శిరసుపై శ్రీకృష్ణుడు తాండవం చేయగానే విషమంతా బయటకువచ్చింది. కాబట్టి సంసారమనే మడుగులో మమకారాలనే లోతైన బురదలో, విషయ వాంఛలతో కూరుకు పోయే మానవులను ఉద్ధరించడమే కాళీయ మర్దనం.
గోవర్ధనగిరి ఎత్తడం వెనుకా ఓకథ ఉంది. రామావతారంలో వారధి కట్టే టప్పుడు, ఓ వానరుడు ఓ పర్వతాన్ని, సేతు నిర్మాణం పూర్తైపోతున్న సమ యంలో తీసుకువస్తాడు. ”నేను రామకార్యానికి ఉపయోగపడలేకపోయా నని” బాధపడుతుంది ఆ పర్వతం. ”వచ్చే అవతారంలో నిన్ను ఉద్ధరిస్తాన ని” పర్వతానికి మాటయిస్తాడు శ్రీరాముడు. ఆ పర్వతమే గోవర్ధనగిరి.
నిజమైన హితుడు, స్నేహితుడు భగవంతుడు ఒక్కడే అనే సత్యాన్ని చెప్పే దే కుచేలుని చరిత్ర. ప్రకృతి పురుషుల కలయికను తెలిపే తత్త్వబోధనే రుక్మి ణీ కళ్యాణం. రుక్మిణి జీవాత్మ. శ్రీకృష్ణుడు పరమాత్మ. జీవాత్మ పరమాత్మ ను చేరాలనే తపనే రుక్మిణీ కళ్యాణం. గోపాలునిగా గోసేవ చేయడం, రాజసూయ యాగ సమయంలో, ఋత్వి క్కుల పాదాలు కడగటం, యుద్ధం అనంతరం ప్రతిరోజూ అర్జునిని సారధి గా అశ్వాలకు సేవ చేయటంలాంటివి, మానవాకారంలో భగవంతుడు సర్వ జీవులకు సేవచేసే నిమిత్తమై అవతరిస్తాడనే సత్యానికి నిదర్శనాలు.శ్రీకృష్ణుడు హృదయాలనే భూముల్ని సాగు చేసేవాడు, ఆటపాటలతో సర్వులను ఆకర్షించేవాడు. కృష్ణావతార ప్రధాన లక్ష్యం ప్రబోధ.
సాధు రక్షణ- దుష్ట శిక్షణ (పరిత్రాణాయ సాధూనాం)
భక్త రక్షణ (అనన్యా శ్చిన్తయన్తో మాం)
శరణాగత రక్షణ (సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం) అనే మూడు ప్రతిన లను అవతార లక్ష్యంగా చేసుకున్నాడు. తానాచరించిన తర్వాతే బోధలు చేసాడు. శ్రీకృష్ణుడు చేసిన ప్రతి కార్యం వెనుక బలీయమైన కారణం ఉం టుంది. తార్కికతతో కూడిన తాత్త్వికత ఉంటుంది. గీతార్ధసారమిచ్చి గీతలె న్నొమార్చిన పరిపూర్ణ ప్రేమైకమూర్తి శ్రీకృష్ణుడు.
– రమాప్రసాద్ ఆదిభట్ల 93480 06669