ఈ రోజు శ్రీకృష్ణాష్టమి. ఈ శుభ సందర్భం లో ఒక గొప్ప ఋషిని తలుచుకుందాం. గొప్ప ఋషులలో అష్టావక్ర మహర్షి ఒకరు. అతడు తల్లి కడుపులో ఉండగానే ఎన్నెన్నో శాస్త్రాలను అలవోకగా నేర్చుకున్న మహా జ్ఞాని. జనక మహారాజుకు యజ్ఞవలుకుడికి ఈయన గురువు. అష్టావక్రుడు కడుపులో ఉండగానే అష్ట వంకరలతో పుడతావనే శాపాన్ని పొందాడు. ఆ శాపాన్ని ఇచ్చింది కూడా ఎవరోకాదు. అతని తండ్రి ఏకపాదుడే. అలాంటి మహర్షికి ఆతను పోయాక స్వయానా శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేసాడంటే అతని జన్మమే ఎంత గొప్పదో మనకి తెలుస్తుంది కదా. వివరాలలోకి వెళితే- పూర్వకా లమున ఏకపాదుడనే గొప్ప తపస్వి ఉండేవారు. ఆయన భార్య పేరు సుజాత. అతను వేద వేదాం గాలు తెలిసినవాడు కావటంవల్ల ఎంతోమంది శిష్యులు అతని దగ్గర వేదాలు నేర్చుకుంటూ ఉండేవారు. కొంతకాలానికి గర్భవతి అయింది సుజాత. కడుపులో ఉన్న పిల్లవాడు అన్ని వేదా లు తెలిసినవాడు. అతను ఎప్పుడు చూసినా తండ్రి తన శిష్యులకు చెప్పే శాస్త్రాలను కూడా వింటూ ఉండేవాడు. ఒకరోజు తండ్రి శిష్యులకు చెప్పే అభ్యాసంలో తప్పుల గురించి తండ్రికి చెబుతాడు. అంతేకాకుండా ఎలా చెప్పాలో కూ డా వివరిస్తాడు. అంతేకాదు విరామం లేకుండా అంతంతసేపు శిష్యులకి వేదాలు చెప్పకూడదు అని కూడా వివరిస్తాడు. తనకు పుట్టబోయే పు త్రుడు మహిమాన్వితుడని సంతోషిస్తాయి. కానీ ఇంకా పుట్టకుండానే తన తప్పులను ఎంచిన కు మారుడు పుట్టాక ఇంకా ఎన్ని తప్పులు ఎంచు తాడో అని కోపగించి ‘అష్ట వంకరల’తో పుట్ట మని శపిస్తాడు. ఇంట్లో కావలసిన పదార్థాలు లేకపోవటంతో ఒకరోజు సుజాత ఏకపాదుడిని జనకరాజు దగ్గరికి వెళ్ళి కావలసినవి అడిగి తెమ్మని చెపుతుంది. ఏకపాదుడు జనకుడి దగ్గ రికి వెళ్లే సమయానికి అక్కడ వరుణికి కొడుకైన నంది ఉంటాడు. నంది నాతో వాదించి గెలిస్తే నీ కు ఏది కావాలన్నా ఇస్తాను. ఓడిపోతే మాత్రం జలదిగ్బంధం చేస్తానని అంటాడు. ఏకపాదుడు నందితో వాదించి ఓడిపోయి బందీ అయిపోతా డు. కొన్నాళ్లకు సుజాత అష్టావక్రుడికి జన్మని స్తుంది. అరుణి అనే గురువు గారి దగ్గర విద్యా భ్యాసం చేసినాడు. ఇతను పెద్దవాడయ్యాక తన తండ్రి గురించి తెలుసుకొని అష్టావక్రుడు జనకు ని కొలువుకి వెళ్ళి నందిని ఓడించి తన తండ్రిని విడిపించుకుని వస్తాడు. ఆ ఆనందంలో తండ్రి అతనికి అందంగా మారేలా వరమిస్తాడు. అలా అందంగా మారిన అష్టావక్రుడు ఓ మహర్షి కూ తురు సుపర్భను వివా#హం చేసుకుంటాడు. అష్టా వక్రుడి పిల్లలు పుట్టాక తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్లిపోతాడు. అతని దగ్గరికి రంభ మొదలైన అప్సరసలు వచ్చి నాట్యం చేస్తారు. వారి నాట్యం చూసిన అష్టావక్రుడు ఏమి వరం కావాలో కోరుకోమంటాడు.అందుకు వాళ్లు విష్ణు మూర్తి పొందాలన్న తమ కోరిక తీరేలా చూడ మని అడుగుతారు.అందుకు అష్టావక్రుడు ద్వాప ర యుగంలో విష్ణుమూర్తి కృష్ణావతారం ఎత్తిన ప్పుడు మీ కోరిక తీరుతుంది అని వరమిస్తాడు. అప్సరసలే ద్వాపరయుగంలో పుట్టిన గోపికలు.
అష్టావక్ర మ#హర్షి చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఒక రోజు బృందావనంలో ఉన్న కృష్ణుడిని చేరుకొని నమస్కరించి ఆయన పా దాల దగ్గరే ప్రాణాలు విడిచారు. అతనికి సాక్షాత్ శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేస్తాడు. ఇలా జన మును విడిచిన అష్టావక్రుడు గోలోకానికి వెళ్ళి మోక్షాన్ని పొందుతాడు. భగవత సంహత చది వితే పరమ పురుషుడయిన శ్రీకృష్ణ భగవానుని మీద భక్తి జనిస్తుంది. మానవుల శోక, మోహ, భయములను పోగొడుతుంది.
– కొలనుపాక కుమారస్వామి
9963720669