Tuesday, November 26, 2024

లింగార్చన-ఫలితాలు

భక్తసులభుడు… బోళాశంకరుడు అయిన ఆ పరమేశ్వరుని భక్తితో అర్చిస్తే వరాలను ప్రసాదిస్తాడు. కోరిన కోర్కెలు తీరుస్తాడు. అయితే ప్రతి సమస్యకు ఒక్కొక్క విధంగా శివుడిని పూజిస్తే ఆ సమస్య సత్వరమే తీరుతుందని చెబుతున్నాయి మన ఇతిహాసాలు.
– సమస్యల పరిష్కారానికి ధనప్రాప్తికి శివపూజలో తామరపత్రాలను ఉపయోగించాలి. ధనప్రాప్తి కలుగుతుంది. ధనం నిలవడానికి బిల్వపత్రాలతో పూజించాలి.
ముక్తి, మోక్షానికి దర్భలతో శివార్చన చేయాలి.
కోరికలు నెరవేరడానికి, దీర్ఘాయుష్షుకు గరికతో పూజించాలి.
సంతానం, సౌభాగ్యానికి ఉమ్మెత్త పూలతో అర్చన చేయాలి.
వస్తు, వాహనాలకు మల్లెపువ్వుతో లింగాన్ని అర్చన చేయాలి.
సుఖ, సంతోష సంపదకు నూకలు లేని బియ్యంతో చేయాలి.
వంశాభివృద్ధి, పేరు ప్రతిష్టలకై ఆవునేతితో శివార్చన చేయాలి.
రోగనివారణ కోసం తేనెతో శివార్చన చేయాలి.
సంపూర్ణ ఆనందానికి చెరుకుసరసంతో అభిషేకం, అర్చన చేయాలి.
భోగం, మోక్షం రెండూ కావాల్సిన వారు తులసి దళాలతో పరమశివుని అర్చన చేయాలి.
అధికార బాధలు తొలగిపోవాలంటే జిల్లేడు పూలతో అర్చన చేయాలి.
విద్యాబుద్ధులు కలగాలంటే తెల్ల తామరతో శివార్చన చేయాలి.
శ్రీఘ్ర వివాహం కోసం మందార పూలతో అర్చన చేయాలి.
ప్రేమ వివాహం కోసం మందార పూలతో అర్చన చేయాలి.
రోగబాధలు తొలగి పోవాలంటే తుమ్మ పూలతో అర్చన చేయాలి.
ప్రాణ సంకటం నుంచి బయటకు రావాలంటే నువ్వులనూనె తో శివార్చన చేయాలి.
గో, బ్రాహ్మణ హత్య పాపాలు తొలగి పోవాలంటే స్వర్ణ పుష్పాలతో అభిషేకం చేయాలి
ఉద్యోగ ప్రాప్తి కోసం అన్నం, బెల్లంతో అభిషేకం చేయాలి
వ్యాపార వృద్ధికి గన్నేరు పూలతో అర్చన చేయాలి.
గ్రహ బాధలు తొలగి పోవాలంటే నవరత్నాలతో అర్చన చేయాలి. వరిపిండి , పసుపు కలిపి న పిండితో సింహద్వారం పైన ఓం ను లిఖించాలి. గృహంలో సుఖశాంతులు లభిస్తాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement