Friday, September 20, 2024

సూర్యుని గమనంలాంటిదేమనిషి జీవితం!

వాన రాకడ, ప్రాణం పోకడ ఎవ్వరూ చెప్పలేరని లోకో క్తి ప్రసిద్ధమైనది ఉంది. దట్టంగా మబ్బులు పట్టి ఉంటాయి. చుట్టూ చీకట్లు కమ్మి, ఉరుములు మెరుపులతో ఇక కొన్ని క్షణాలు మాత్రమే, కుండపోతగా వర్షంపడబోతోందని తలు స్తాం. అంతలోనే సన్నగా గాలి తెర మొదలౌతుంది. చూ స్తూండగానే గాలి దుమా రం పెద్దదై సుడులు తిరిగి దుమ్మెత్తిపోసి, ఆకాశానికి లేస్తుంది. చెట్ల కొమ్మలు అటూ ఇటూ విరిగి పడిపోయేంతగా ఊగుతాయి. భూమి పై ఇది జరుగుతూండగా, ఆకాశంలో దట్టంగా పట్టివున్న మబ్బులు ఒకటొకటిగా విడిపోవడం మొదలు పెడతాయి. చూస్తూండగానే మేఘాల మధ్య ఎడం పెరుగు తుంది. వెలుగు కిరణా లు మళ్ళీ భూమి మీది ప్రసరించడం ప్రారంభమౌతుంది. కమ్ముకుని ఉన్న చీకటి కళ్ళముందరే విచ్చుకోవడం మొదలౌతుంది.
మేఘం పలాయనం చిత్తగిస్తుంది. రేగిన దుమ్ము నెమ్మదిగా మళ్ళీ నేల వైపు కు తిరుగుతుంది. వాన రాకుండానే వెలిసిపోయినట్లై, ఇంతలోనే ఇంత మార్పు, అంతా చిత్రంగా ఉందే! అనిపిస్తుంది. నవ్వు తెప్పిస్తుంది. అలాంటిదే, అప్పుడే భోజనం చేసి వచ్చి కుర్చీలో కూర్చుంటాడు ఒక వ్యక్తి. చేతిలో ఆ రోజుటి దినపత్రిక ముఖానికి అడ్డంగా ఉంటుంది. పేపరు చదువుకుంటున్నాడులే! అనుకుంటూ ఉంటుంది మొత్తం కుటుంబం అంతా. ఆ తరువాత ఎప్పటికో, మనిషిలో చలనం లేకపోతే సందే#హం వచ్చి, కదిపితే, కదలిక ఉండదు. మరణం సంభవించిందని తెలుస్తుంది. అంత నిశ్శబ్దంగా ఎలా సాధ్యమైంది? అని అంత దు:ఖంలోనూ ఆశ్చర్యపోవడం ఆ కుటుంబంలోని వ్యక్తుల వంతౌతుం ది. అలా… మరణంబున కిది నిమిత్తంబని నిరూపింప రాదు అనిపించాడు శుక్రాచార్యుని చేత మార్కండేయ మ#హర్షి, ఒకానొక సందర్భంలో దేవతలతో యుద్ధంలో పారిపోతు న్న రాక్షస వీరులను ఉద్దేశించి, తాను రచించిన మార్కం డేయ పురాణము గ్రంథంలో.
ఉ|| కొందఱు తీవ్ర శస్త్రహతి, గొందఱు
దుస్తర రోగబాధలన్‌
గొందఱు నీరు ద్రావునెడఁ, గొందఱు
భోజన కార్యవేళలన్‌
గొందఱు యోగముక్తులయి, కొందఱు
నిష్ఠ తపంబొనర్చుచున్‌
గొందఱు కాంతల న్గవయు కోర్కులఁ జత్తురనేక భంగులన్‌.
(మారన మార్కండేయ పురాణము ప్రథమాశ్వాసం, 55వ పద్యం)
కొందరు యుద్దంలో కత్తిపోటుకు మరణిస్తారు, కొందరు ఇంట్లోనే ఉండి అమితంగా బాధించే రోగం వలన మరణం పొందుతారు. కొందరు అనూహ్యం గా దాహం తీర్చుకుంటూ మృత్యువు పాలవుతారు, కొందరు భోజనం చేయబో తూనో, చేస్తూనో కాలం చెల్లి హఠాత్తుగా తనువు చాలిస్తారు. కొందరు యోగం ద్వా రా ముక్తిని సాధించుకుంటారు. కొందరు నిష్ఠగా తపస్సులో ఉంటూనే కైవల్యం సిద్ధించుకుంటారు. ఇలా మరణానికి ఒక వేళ అని, ఒక విధమని ఉండదు.
కం|| దైవంబు చక్కఁజూచిన
నేవిధమునఁ గీడు వొంద దెయ్యెడనున్నన్‌
దైవంబు తప్పఁ జూచిన
నేవిధమున మేలు వొంద దెయ్యెడ నున్నన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement