Friday, November 22, 2024

నామం చేద్దాం…నామిని చేరుదాం!

భగవంతుడు సర్వజ్ఞుడు. సర్వాంతర్యామి. భగవంతుడు ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఉంటాడు అంటారు. అన్నీ దేవుడే, అంతా దేవుడే, అన్నిచోట్లా దేవుడే, అన్నింటా దేవుడే అని అంటారు. ఇందు గలడందు లేడను సందేహమ్ము వలదు చక్రి సర్వోప గతుండు, ఎందెందు వెదకి చూసిన అందందే గలడు అని అంటారు. ఇలా దేవుని గురించి వింటుంటే అంతా అయోమ యం అనిపిస్తుంది. గందరగోళం అనిపిస్తుంది. అంతా తెలిసి నట్టే ఉంటుంది. తెలిసినకొలది, తెలుస్తున్న కొలది తెలుసుకో వలసింది చాలా ఉందని తెలుస్తూ ఉంటుంది.
ఇంతకీ దేవుడు ఎక్కడుంటాడు? మందిరంలోనా? మసీ దు లోనా? చర్చిలోనా? ఇతర మతాల ప్రార్ధనా స్థలాలలోనా?
దేవుడు ఎక్కడుంటాడు? కాశీ లోనా? ప్రయాగ లోనా? రామేశ్వరం లోనా? తిరుపతి, షిరిడీ, శబరిమల, శ్రీశైలం, అన్నవరం, జెరూసలేం, మక్కాలోనా? ఎక్కడ? ఎక్కడ దేవు డుంటాడు? ఏది దేవుని చిరునామా.
ఓసారి నారద మహర్షికి ఈ సందేహమే వచ్చింది. రావ డమే తరువాయి శ్రీ మన్నారాయణుడి దగ్గరకు వెళ్ళి ”స్వామీ! మీరు ఎక్కడ ఉంటారు? మీ చిరునామా చెప్పం డి?” అని అడిగారు నారద మహర్షి. ”యత్ర మద్భక్త గాయన్తి తత్ర తిష్టామి నారదా!” ఎక్కడ నా భక్తులు నా నామాన్ని గానం చేస్తుంటారో, అక్కడ నేను తిష్ట వేసుకుని ఉంటాను” అనేది శ్రీ మహావిష్ణువు సమాధానం.
అవును. నామం ఎక్కడో నామి అక్కడ. భజన ఎక్కడో భగవంతుడు అక్కడ. గానం ఎక్కడో గానలోలుడు అక్కడ. ప్రార్ధన ఎక్కడో పరమాత్ముడు అక్కడ. స్మరణ ఎక్కడో సర్వే శ్వరుడు అక్కడ. ఇదీ దేవుని చిరునామా.
దేవుడు ఎక్కడ ఉంటాడు? అనే ప్రశ్నకు సమాధానాన్ని మరో విధంగా చూద్దాం. దేవుడు నమ్మినవాడి మనసులోను, నమ్మని వాడి మాటలోను ఉంటాడు. నమ్మిన వాడి మనసు లో దేవుడుంటాడనే దానికి ఉదాహరణ భక్తప్రహ్లాదుడయితే, నమ్మని వాడి మాటలో దేవుడుంటాడు అనే దానికి, ప్రహ్లాదుని తండ్రి హరణ్యకశిపుడి ఉదంతమే ఉదాహరణ. హరి లేడు, హరి లేడు అని పదేపదే చెప్పిన హరణ్యకశిపుని మాటలోనే హరి ఉన్నాడు కదా!
ఇప్పుడు యింకో రకంగా దేవుడు ఉండే ప్రదేశం గురించి ఆలోచన చేద్దాం. .

దేవుడు లేడు అనే దాన్లోనే, దేవుడు ఇక్కడ ఉన్నాడు అని వచ్చింది! ఇది భాషా చమక్కుగాను చమత్కారంగాను అనిపించవచ్చు. కనిపించవచ్చు. అయితే నిగూఢమైన భగవత్‌ తత్వాన్ని ఆధునికంగా ఆలోచనాత్మకంగా, ఆసక్తి కరంగా చెప్పే పరమ సత్యం యిది. కాబట్టి దేవుని గురించి వాదాలు, వాదనలు, వివాదాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, అయోమయం, గందరగోళం, అస్పష్టత అనవసరం. నామం చేద్దాం. నామిని చేరుదాం. భక్తి ప్రపత్తులతో భగవంతుణ్ణి ప్రస న్నం చేసుకుందాం. భగవంతుణ్ణి అందుకుందాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement