కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగానే తరలివచ్చారు. అయితే గత పది రోజులుగా భారీగా రద్దీ కొనసాగింది. బుధవారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉందని టీటీడీ అధికారులు అంటున్నారు. మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు. దీంతో భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. స్వామివారి దర్శనం కోసం కేవలం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 22,423 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 9,679 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.