13. లచ్చి పెనిమిటి! వేల్పుల రాజ! నృహరి!
యాగముల పెద్ద! మధువైరి! జగతి రూప!
కేశవ! జనార్దనా! దేవ! నాశరహిత!
ఓయి నరసింహ! నాకు చేయూత నీవె.
14. ఒక్క చేతను చక్రంబు నొక్కచేత
శంఖ మొక చేత సిరిదాల్చి సౌమ్య దృష్టి
అభయముద్రను నొక చేత శుభములిడెడు
ఓయి నరసింహ! నాకు చేయూత నీవె.
15. నా వివేకపు ధనమెల్ల నపహరింప
ఇంద్రియములను దొంగల నిడుము వడితి
చిమ్మచీకటి పెనుగోతి జిక్కి వగచి
ఓయి నరసింహ! నాకు చేయూత నీవె.
16. వ్యాస ప్రహ్లాద నారద భాగవతులు
పుండరీక పరాశరులండగోర
వారి హృదయాన నివసించి వారినేలు
ఓయి నరసింహ నాకు చేయూత నీవె.
17. నారసింహుని చరణాల నర్పణముగ
ఆదిశంకరుడు రచించె నమల భక్తి
దీని జడివిన సుమతులు దివ్యపథము
నంది శ్రీహరి కరుణను పొందగలరు
18. అమిత మహిమా సుసంపన్నమైన స్తోత్ర
మనువదించితి తెలుగులో వినయ సరళి
దత్తశర్మను; నరసింహ భక్తిపరుడ
తప్పులున్నను క్షమియించు డొప్పులుగను
తెలుగు అనువాదము :
పాణ్యం దత్తశర్మ, 9550214912