బాల్యంలో ఉమ్మడి కుటుంబాల్లో తండ్రులు, పినతండ్రులు కూడా తమ బిడ్డలను ఏడ్పు మాన్పించేందుకు ”జోజో …రామయ్య వంటి తండ్రి, సీతమ్మ వంటి తల్లి లక్ష్మణుడను నేనుండగా…” అంటూ పాడే జోలపాటలో సంస్కారం, లాలిత్యం, ఓదార్పు, అభయం… ఇలా ఎంతో నీతితో కూడిన జోలపాటకు బిడ్డ తెలిసీ తెలియని వయ సులో కూడా సుఖంగా తండ్రో, చినతండ్రో పొట్ట మీద పడుకుని నిద్రలోకి జారుకున్న మధు ర క్షణాలు మన అందరకు తెలుసు. అవే వయసు వచ్చాక జ్ఞానం, సంస్కారం, నీతి పరుల పట్ల గౌరవం కల్పించే ఒక ఉపదేశం. నిర్భయత్వానికి, పరుల పట్ల చూపే గౌరవ భావానికి ప్రతీకగా లక్ష్మణ స్వామిని పేర్కొంటారు. ఉదాహరణకు రామాయణంలో ఒక అంశాన్ని పరిశీలిద్దాం.
తన తపస్సుతో అసాధారణ శక్తులు పొందిన రావణబ్రహ్మ ఆ శక్తులను లోక కళ్యాణం కోసంకాక తన వినాశనానికి వినియోగించుకున్నాడు. పరమ సాధ్వి, సాక్షాత్తు శ్రీరామ చంద్రుని సతీమణి అయిన సీతాదేవిని తన మాయాజాలంతో అప#హరించుకుపోయాడు.
సీతాదేవి జాడను శ్రీరాముడు వెతుకుతూ ఉన్న సమయంలో అడవిలో సీతాదేవి తన జాడ రామునికి తెలిసేందుకు అనవాలుగా విసిరిన నగల మూట దొరికిన వానరులు దాన్ని శ్రీరామునికి ఇవ్వగా ఆ మూటను విప్పి చూసిన శ్రీరాముడు సతీ వియోగంలో కన్నీటి కుండలై మసకతో ఉన్న కళ్ళతో తాను సరిగా గుర్తుపట్టలేక, ఆ నగలను లక్ష్మణుడికి చూపించి ”ఇవి మీ వదిన కేయూరాలేగదా! లక్ష్మణా ఒక్కసారి నువ్వు కూడా వాటిని చూసి గురుతు పట్టగలవేమో ప్రయత్నించు” అంటాడు.
అప్పుడు లక్ష్మణస్వామి తన అన్న శ్రీరామచంద్రునితో….
”నాహం జానామి కేయూరే
నాహం జానామి కుండలె!
నూపురే త్వభి జానామి
నిత్యం పాదాభివందనాత్!!”
అంటాడు సలక్షణంగా పెరిగిన లక్ష్మణ స్వామి.
దీనర్థం ఏమిటంటే… ”ఓ అన్నా! వదినగారు భుజానికి పెట్టుకునే కేయూరాలుగానీ, చెవులకు పెట్టుకునే కుండలాలుగానీ నేనెరుగను!! కానీ ఆవిడ పాదాలకు పెట్టుకునే నూపురాలను మాత్రం గుర్తుపట్టగలను. ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్యం నమస్కారం చేస్తాను కాబట్టి”.. అంటాడు కన్నీటి పర్యంతమై! నిత్యం కళ్లెదుటే ఉన్న తల్లిలాంటి స్వంత వదినను కన్నులెత్తి చూడని సంస్కారం.!! అది.
అసలు ఆడవారి ముఖంలో ముఖంపెట్టి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకు మాట్లా డాలి ఎవరైనా, అది చాలా తప్పు. మరి ఈవిధమైన శీలసంపద లక్ష్మణుడికి ఎక్కడనుండి వచ్చింది, అంటే… తల్లి సుమిత్రాదేవి పెంపకం.!!
రాముడితో అడవికి వెళ్ళేటప్పుడు ఆ మహాతల్లి కొడుకుకు ఏమని చెపుతోందో తెలుసా.!!
”రామం దశరథం విద్ధిం
మాం విద్ధి జనకాత్మజాం.!
అయొధ్యాం అటవీం విద్ధి
గచ్చ తాత యధాసుఖం!!
రాముణ్ణి దశరథుడనుకో, సీతను నన్న నుకో… అడవిని అయోధ్య అనుకో… హాయిగా వెళ్ళిరా నాన్నా!! అని లక్ష్మణునికి తెలుపు తుంది.
ఇంత సంస్కారమున్న తల్లి పెంచింది కాబట్టే లక్ష్మణుడు అంత శీలవంతుడయ్యా డు. చీర తొలగి మత్తులో ఉన్న తారతో మాట్లా డవలసి వచ్చినప్పుడు కూడా తలవంచుకుని మాట్లాడిన అద్భుéత శీలసౌందర్యం లక్ష్మణస్వామిది. అంతటి నిగ్ర#హం, క్రమశిక్షణ, సం స్కారం వాత్సల్యం నేర్చుకుంది తల్లి నేర్పినవే!
కనుక మన పిల్లాడి చేతిలో ఒక సెల్‌ఫోన్ పెట్టేస్తే వాడిమానాన వాడు ఆడుకుంటాడు మన పనులు ఆగకుండా చేసుకోవచ్చనే తల్లి దండ్రులంటే నీతి, సంస్కారం, వినయ విధే యతలు కాదుకదా వాడి జీవితాన్ని చేజేతు లారా నాశనం చేసినట్లే!
కనుక సంవత్సరాల తరబడి వచ్చే సీరి యళ్ల నుండి ముందు తల్లులు బయటకు వచ్చి రామాయణ పురాణ గాథలు, నీతితో కూడిన సినిమాలు, బొమ్మలతో వున్న రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి పుస్తకాలు పిల్లలకు అందించి పిల్లలకు లక్ష్మణుడు అంత కాకున్నా ఒక ప్రయోజకు డిగా క్రమశిక్షణతో పెంచవలసిన బాధ్యత తల్లి దండ్రులదే! ముఖ్యంగా తల్లులదే!
- చలాది పూర్ణచంద్రరావు
9491545699