Saturday, November 23, 2024

కుటుంబ గీత

చాలా యుగాల నుండి విశ్వవ్యాప్తంగా భారతీయ సంస్కృతి- ఆచార వ్యవహా రాలు- సనాతన ధర్మం మన్ననలు పొందుతున్నదంటే, కారణం ”భారతీయ కుటుంబ వ్యవస్థ ఇదే మూలాధారం. జీవనాడి. అవతార పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి వారు కూడా కుటుంబ వ్యవస్థ నుండి వచ్చిన వారే. అయితే కాల క్రమేణా కుటుంబ వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయింది. కారణాలు ఏవైనా ఇప్పుడు ఏకీకృత కుటుంబ వ్యవస్థలో జీవిస్తున్నాం. కుటుంబం అంటే ఏమిటో మనకందరికీ తెలుసు. కాబట్టి నిర్వచనం అవ సరం లేదు. కుటుంబం నుండే మనిషి జ్ఞానాన్ని, వివేకాన్ని, రక్షణ పొందుతున్నాడు. కుటుంబమే బంధాలకు—అనుబంధాలకు ఆలంబన. మనిషికి సుఖ- దు:ఖాలలో పాలుపంచుకోవడానికి కుటుంబం చాలా దోహదపడుతుంది. కుటుంబంలో భార్యా భర్తల సంబంధం చాలా ముఖ్యం. వారి ప్రవర్తన ఆధారంగానే పిల్లలు ఎదుగుతారు. మంచి ఉన్నతభావాలు, ఆశయాలు కలిగే విధంగా పెంపకం ఉండాలంటే… దంప తులు మధ్య సత్సంబంధాలు, అనురాగం, ఒకరిపై ఒకరికి నమ్మకం ముఖ్యం.


”సంతుష్టో భార్యయా- భర్తా భార్త్రా భార్యాత థైవచ
యస్మినేవకువే నిత్య కళ్యాణం తత్ర వైథ్రువమ్‌!!”
అంటే భర్త భార్య అవసరాలను తీరుస్తూ—సంతుష్ఠ పరిస్తే- భార్య భర్త అభి రుచులు అర్థం చేసుకొంటూ అనుగుణంగా అన్యోన్యంగా జీవిస్తూంటే—ఆ కుటుంబం ఎప్పుడూ ”శుభ” ఫలితాలు పొందడమేకాక, వృద్ధిలోకి వస్తుంది” అని మనుశాస్త్రం తెలియపరుస్తోంది. ”ఇల్లే ఇలలో స్వర్గం అంటుంటారు. కాని నేటి పరిస్థితులలో ఇంటి కంటే గుడి పది లం” అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నేటి యువత ప్రేమ వివాహాలు, మతాంతర వివాహాలు, మోహావేశంలో ”సహజీవనం” పేరిట నచ్చినన్నాళ్ళు జీవించడం, తరు వాత ఎవరిదారి వారిదే అన్నట్లు ఉంటే కుటుంబ వ్యవస్థ ఆశయం, సాంప్రదాయాలు, సంస్కృతికి తిలోదకాలు ఇచ్చినట్లే. కుటుంబ వ్యవస్థ నుండే సమాజం వృద్ధి పొం దడమే కాకుండా, చైతన్యం వస్తుంది. ఎప్పుడు?
మంచి ఉన్నత భావాలు, ఆశయాలు, లక్ష్యాలు కుటుంబం నుండి పొందితేనే. లేకపోతే సమాజం విలువలను కోల్పోతుంది. రామకృష్ణ మిషన్‌ ఒకప్పటి అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ స్వామి రంగనాధానంద మాటల్లో- ”సర్వత్రా జయం ఇచ్ఛేత్‌, పుత్రాత్‌ ఇచ్ఛేత్‌ పరాజయం” అంటోంది సనాతన ధర్మం. ప్రతీ విషయంలోనూ జయమే కోరుకొం టాం. కాని బిడ్డల చేతిలో పరాజయం చెందినా చింతించం ఇంత విశాలంగా పిల్లల్ని పెంచితే, భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. తల్లితండ్రులు వారికి మన వారసత్వాన్ని, సంస్కృతిని నిరంతరం గుర్తు చేస్తూ ఉండాలి. భౌతికపరమై న అంశాలపై తాపత్రయం లేకుండా- జ్ఞాన తృష్ణ వైపు నడిపించాలి. అగ్గిపుల్లలో ప్రజ్వ లన దాగి ఉన్నట్లు వారిలో అనంతమైన శక్తి నిగూఢంగా ఉందని వారికి స్పష్టం చేయా లి.” అని ఉపదేశించారు. నేటి కుటుంబ వ్యవస్థలో ఏం జరుగుతోంది?
నేటి కుటుంబ వ్యవస్థలో జవాబు పోయింది. నిర్లక్ష్యము, అగౌరవం చోటు చేసు కున్నాయి. బంధానికి అనుబంధానికి తిలోదకాలు ఇస్తే, స్వార్థం, అ#హంకారం శాసి స్తున్నాయి. నైతిక విలువలను పెట్టెలో భద్రంగా ఉంచితే, నిర్భయం, దురలవాట్లు వెలుగు చూ స్తున్నాయి. ధర్మం, సత్యం అనే రెండు మార్గాలను మూసేస్తే, అధర్మం, అరాచకం, అసత్యం, మనకు ఆప్తులవుతున్నాయి.
ఇలా ఆలోచిస్తూ, మననం చేసుకుంటూ పోతే, సమాజం అంటేనే భయపడతాం. అయితే మనం ఏమి చేయాలి?
మన కర్తవ్యం: ముందుగా కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. అంటే ముందుగా వారివారి బాధ్యతలు గుర్తుంచుకొని ప్రవర్తించాలి. ఏ వ్యసనాలకు బానిసైనా, అవి పిల్లల ప్రవర్తనలపై ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మెలగాలి.
పిల్లల మనస్తత్వాన్ని ఎరిగి వాటికి అనుగుణంగా, ప్రేమతో ఆప్యాయంగా, చూసే తల్లి తండ్రులు ఒక కోవకు చెందినవారు. దీనివల్ల పిల్లలలో ఆత్మస్థైర్యం, విశ్వాసం, నమ్మకం వస్తాయి. బాధ్యత గల పౌరులుగా, నైతికతతో ఎదుగుతారు.
పిల్లలు తల్లితండ్రులు పట్ల సంపూర్ణ విధేయత, భయభక్తులతో ఉండాలని, నిర్బం ధం చేస్తూ, నియంతృత్వ విధానంతో పెంచుతారు. దీనివల్ల పిల్లలలో అసహనం, నటించడం వంటి చెడు లక్షణాలతో ఎదుగుతారు. ఇది రెండో రకం.
ఇక మూడో రకం తల్లితండ్రులు పిల్లలకు ఏది మంచో? ఏది చెడో? స్పూర్తిని కలి గించి, నిర్ణయాలు పిల్లలకే వదిలేస్తారు. ఇటువంటి పిల్లలు తాము స్వతహాగా ఆలో చన, డిసిషన్‌ నిర్ణయం, బాధ్యతతో మంచి పౌరులుగా ఎదుగుతారు.
పిల్లల శారీరక, మానసిక, సామర్థ్యాలలో తేడాలు ఉంటాయి. వారివారి, సామర్థ్యం దృష్టిలో పెట్టుకొని చదువు, క్రీడలు, వంటి పైవారికి ఉన్న అభిరుచి ఆధారంగా ప్రోత్సహించాలి. పక్కింటి, ఎదురింటి పిల్లల సామర్థ్యాలతో పోల్చి వారిలో నూన్యతా భావా న్ని కలిగించవద్ధు. ఆత్మ స్థైర్యం ప్రోత్సహించాలి.
వారిలో నైతికతను పెంచేందుకు వీలుగా, భక్తి, శ్రద్ధ, కలిగేటట్లుగా, వారికి కథలు, జీవిత చరిత్రలు చెపుతూ ఉండాలి.
సామాజిక శాస్త్రవేత్తలు ప్రకారం కుటుంబం ఆరు రకాలైన కార్యాలు నిర్వ#హం చ వలసి ఉంటుంది. అవి-
జీవైక కార్యం: సమాజం, కుటుంబ పెద్దలు ఆమోదించిన క్రమ పద్ధతిలో, (వివా#హం అనే బంధం) స్త్రీ పురుష మధ్య ఉండే శారీరక సంబంధం కొనసాగించడం.
ఆర్థిక కార్యం: కుటుంబ పోషణకు ఇద్దరూ సంపాదిస్తున్నా కుటుంబ ఆర్థిక కలా పాలు ఆ ఇల్లాలే చూసి, ఆదాయానికి తగ్గట్టు, ఖర్చు చేస్తూ, భావి అవసరాలకు అంచనా వేయగల సామర్థ్యం మహిళకే ఉంటుంది.
ఆచార, ఆధ్యాత్మిక కార్యాలు: కుటుంబ పెద్దలు నుండి అనుసృతంగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ కుటుంబ సంక్షేమం నిమిత్తం ఆధ్యాత్మిక జ్ఞానం సభ్యుల మధ్య ప్రోత్సహించడం.
విద్య, సాంస్కృతిక కార్యాలు: పిల్లల అభిరుచులకు అనుగుణంగా, విద్యావంతు లుగా, తీర్చిదిద్ది, వారిలోని ప్రతిభ ఆధారంగా ప్రోత్సహించడం.
సామాజిక కార్యాలు: ఇరుగు- పొరుగు , సమాజంలో ఇతరులతో సత్సంబంధా లు కలిగి, స్నేహం పెంచుకోవడం.
భిన్న మనస్తత్వాలు: భిన్న అభిరుచులు, ఉద్వేగ భావనలు ఉంటాయి. పరిమితికి లోబడి అనురాగం, ఆప్యాయంగా ఉండడం. కుటుంబ సభ్యులకు కావలసిన నైతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, మానసిక శక్తి, వంటివి కుటుంబం నుండే పొందుతారు.
ఈ వ్యాసానికి గీత అని పేరు ఎందుకు అంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మానవ జీవన వికాసానికి కావలసిన కర్మ, ధ్యాన, జ్ఞాన, భక్తి మార్గాలు అర్జునుడుకు భోధించి, తన కర్తవ్యాన్ని గుర్తు చేసారు. ప్రస్థుత సమాజం కూడా విషాద యోగంలో ఉంది అని చెప్పక తప్పదు. మనం అవలంబిస్తున్న కర్మలను పున: పరిశీలన చేసుకుని, తద్వారా మనం మన కుటుంబ వ్యవస్థ ను సరిచేసుకోగలిగితే, అంతకుమించి న మానసిక ఆనందం ఇంకేమీ ఉండదు. అందుకే గీత అని నామకరణం చేసాను.

– అనంతాత్మకుల రంగారావు
7989462679

Advertisement

తాజా వార్తలు

Advertisement