ద్రౌపది నెల తప్పింది. నెలలు నిండిపోయాయి. ముత్తైదు వులు వచ్చారు. చేయవలసిన వేడుకను కన్నుల పండు గగా చేసారు. పురుడు పోసుకోడానికి పుట్టింటికి బయల్దేరు తోంది ద్రౌపది. చుట్టుపక్కల వాళ్ళిళ్ళకు వెళ్లి పుట్టింటికి వెళ్తున్నా నని చెప్పింది. ”క్షేమంగా వెళ్లి లాభంగా రావమ్మా” అని కొందరు, ”శుభంగా వెళ్లి పండంటి పిల్లాడుతో రామ్మా” అని మరికొందరు దీవించారు. వాతావరణం చాలా సందడిగా ఉంది. అంద రూ ద్రౌపదికి వీడ్కోలు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు.
అత్తగారు కుంతీదేవి దగ్గరకు ద్రౌపది వచ్చింది. అత్త గారికి నమస్కరించింది. కుంతీదేవి నిండు మనసుతో ద్రౌపది తల మీద చేయివేసి మనస్పూర్తిగా దీవించింది. కుంతీదేవి దీవెన విన్న ద్రౌపది ఆశ్చర్యపోయింది. కుంతీ దేవి ఆ రకంగా ఎందుకు దీవించిందో ఎంత ఆలోచిం చినా అంతుచిక్కలేదు. ఆమె దీవెన వెనుక దాగున్న అంత రార్ధం తెలియక, ఏం చేయాలో పాలుపోక, ఏదీ తేల్చు కోలేక పోయింది ద్రౌపది. చివరకు అత్త కుంతీదేవినే అడ గాలనే నిర్ణయానికి వచ్చిన ద్రౌపది కుంతీదేవిని యిలా అడిగింది.
”అత్తా! నువ్వేమో క్షత్రియ కాంతవు. క్షత్రియ మాత వు. ధర్మం తెలిసిన దానివి. లౌకికం బాగా ఉన్న దానివి. విజ్ఞత కలిగిన దానివి. క్షత్రియ మాత తన వంశం వీరులు, ధీరులు, శూరులతో తుల తూగాలని, అభివృద్ధి చెందా లని ఆశిస్తుంది. కోరుకుంటుంది. దేవుళ్ళను ప్రార్ధిస్తుంది. పరాక్రమవంతులైన కుమారులు, మనుమలు కలగాలని కలలు కంటుంది. వీరాధివీరులైన మనుమలు కలగాలని కోడలిని దీవిస్తుంది. అందుకు విరుద్ధంగా మీరు నన్ను దీవించారు. ఆ రకంగా మీరెందుకు దీవించారు? అలా దీవించడానికి కారణం ఏమిటి? ఆ దీవెన వెనుక ఉన్న మర్మం ఏంటి? ఆ దీవెనలో దాగున్న ర#హస్యం ఏమిటి?” అని ప్రశ్నించింది. తన సందేహాన్ని నివృత్తి చేయమని అత్తగారిని అడిగింది.
ద్రౌపది ప్రశ్న విన్న కుంతీదేవి నివ్వెరపోయింది. నిర్లి ప్తంగా నవ్వింది. ”నీకు స#హజమైన కలగవలసిన సందే #హమే కలిగింది. నీకే కాదు ఎవరికైనా కలిగే సందే#హమే యిది. నిజానికి క్షత్రియ మాత నువ్వు చెప్పినట్లే కోడలిని దీవించాలి. తన వంశం వీరులతో ధీరులతో మహా పరాక్రమ వంతులతో నిండిపోవాలని కోరుకోవాలి. వీరత్వం, ధీరత్వం, మహా శూరత్వం గల మనుమలను ప్రసాదించాలనే దేవుణ్ణి ప్రార్ధించాలి. అలాంటి మనుమలు కలగాలని నోములు, వ్రతాలు, పూజలు, పుణ్యకా ర్యాలు చేయాలి. అయితే అందుకు విరుద్ధంగా నేను నిన్ను దీవించాను. ఎందుకో తెలు సా?” అని కుంతీదేవి కారణం చెబుతోంది. ద్రౌపది శ్రద్ధ³గా వింటోంది.
”ఆ రకంగా ఆనవాయితీకి విరుద్ధంగా నేను దీవించడానికి కారణం ఉందమ్మా! నా కొడుకులు అయిదుగురూ మహా పరాక్రమవంతులు. ఒక్కొక్కరూ ఒక్కో విద్యలో నిష్ణాతులు. అరివీర భయంకరులు. క్షత్రియ విద్యలు అన్నింటిలోను ఆరితేరిన వారు. అయితే వాళ్ళేమి బావుకున్నా రు? పుట్టినప్పటి నుంచి అష్టకష్టాలు పడ్డారు. భరించలేని ఎన్నో వేదన లను అనుభవించారు. అవమానాలను ఎన్నింటినో జీవితంలో అడుగ డుగునా అనుభవించారు. పరాభవాల పాలయ్యారు. ఎప్పుడూ ఏ రక మైన సుఖానికి సౌఖ్యానికి నోచుకోలేదు.” కుంతీదేవి చెబుతున్న విష యాలను ద్రౌపది ఆసక్తిగా వింటోంది.
కుంతీదేవి చెప్పటం ఇంకా కొనసాగించింది.. ”ఎంతటి ధీమంతు లైనా, శక్తివంతులైనా, అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నా, అన్ని రకాల అర్హతలు ఉన్నా చాలదమ్మా. ”అదృష్టం” అనేది ఉండాలమ్మా! అదృష్టం అనేది లేకపోతే పైన చెప్పుకున్నవి ఎన్ని ఉన్నా, అవన్నీ నిరర్ధకమై పోతా యి. ఏది ఉన్నా లేకపోయినా ”అదృష్టం” అనేది ఒక్కటి ఉంటే, పైన చెప్పుకున్నవన్నీ వాటంతట అవే సమకూరు తాయి. సమస్తమైన సంపదలూ సర్వసుఖాలు ప్రాప్తిస్తాయి. అందుకనే ”మహా అదృష్టవంతు డైన పుత్రుడు కలగాల”ని దీవించాను. ఇదీ నా దీవెన వెనుక ఉన్న నా అంతరంగం. నా అభి మతం.” అని తన దీవెన వెనుక దాగున్న అసలు కారణం వివరించింది కుంతీదేవి. ద్రౌపది సంభ్రమానికి లోనయ్యిం ది. అత్త మనసులోని అంతర్మధనం అర్ధమైంది. అత్తగారి ఆలోచనా విధానానికి, విచక్షణతో కూడిన ఆలోచనకి అత్త గారిని మనసులోనే మెచ్చుకుంది. కుంతీదేవి వైపు ఆరాధనా భావంతో చూసింది. సందే#హం నివృత్తి అయినందుకు ద్రౌపది మనసు తేలిక పడింది.
దృష్టం కానిది అదృష్టం. కనిపించని ఏదో దైవశక్తి, దివ్యశక్తి అందించే శుభఫలమే అదృ ష్టం. ఏదో దివ్యశక్తి మన వెంట నడుస్తూ, మన కు తోడుగా నిలుస్తూ, మనల్ని అడుగడుగునా అణువణువునా ఆదుకునే అదృశ్య పరమా ద్భుత శక్తే అదృష్టం!
అదృష్టం ఒకటి ఉంటే చాలు. జీవితానికి కావలసిన తక్కినవన్నీ వాటంతటవే కలిసి వస్తా యి. జీవితం ఆనందమయం అవుతుంది. అద్భుతాల తేజోమయమవుతుంది. జీవితం పుణ్యవంతమవుతుంది. దివ్యవంతమవుతుం ది. ధన్యవంతమవుతుంది. అలా అని మనం మన యత్నం ప్రయత్నం మానకూడదు. సదా సర్వదా మన ప్రయత్నం మనం చేస్తుండాలి. చేస్తూ నే ఉండాలి. అప్పుడు ఇహానికి, పరానికి రెండింటికీ అవసరమైనవన్నీ లభిస్తాయి. సిద్ధిస్తాయి.
– రమాప్రసాద్ ఆదిభట్ల
93480 06669
కుంతీదేవి దీవెన
Advertisement
తాజా వార్తలు
Advertisement