Saturday, November 23, 2024

ఆశ్రిత రక్షకుడు కుక్కుటేశ్వరుడు

ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పవిత్రమైన గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ దివ్య క్షేత్రాల కూడలిగా వుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం అష్టా దశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠం అయిన పురూహూతికా అమ్మవారి నిలయం. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. అమ్మ వారి పేరు మీదనే ఈ ఊరికి పిఠాపురం అన్న పేరు వచ్చిం ది. ఈ క్షేత్రం శ్రీ రాజరాజేశ్వరీ సహిత కుక్కుటేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి. పరమేశ్వరుడు కుక్కుటేశ్వర లింగ రూపంలో అం టే కోడి రూపంలో ఉద్భవించారు. కుక్కుటేశ్వర దేవాల యం కోనేరు (పాదగయ)కు ముందు తూర్పుముఖంగా ఉంటుంది. గుడికి ఎదురుగా ఏకశిల నంది విగ్రహం అతి పెద్దగా శ్రీశైల నందిని పోలి ఉంటుంది. కుక్కుటేశ్వర లిం గం తెల్లగా గర్భాలయంలో కొలువై భక్తులకు ఆశ్రిత రక్షకుడైనాడు. ఈ ఆలయానికి నైరుతిలో గురుదత్తాత్రే యుడు, ఉత్తర భాగంలో పురూహితికా అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఇంకా అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి.
గయాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి త్రిమూర్తులు ఓ పథకం వేస్తారు. దాని ప్రకారం గయాసు రుడు తెల్లవారక మునుపే మేల్కొనాలి. అతన్ని లేపడానికి

పరమశివుడు ‘కోడి’ రూపాన్ని ధరించి కూస్తాడు. తెల్లవారందనుకొని మేల్కొన్న గయాసురుడిని సంహరిస్తాడు. ఆ రాక్షసుడి కోరిక మేరకు స్వామి లింగ రూపంలో అక్క డే వెలిశాడు. అందుకే ఇక్కడి స్వామిని ‘కుక్కుటేశ్వ రుడు’గా ఆరాధిస్తున్నారు.
సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారికి విగ్రహా న్ని ప్రతిష్ఠించి శ్రీ చక్రం ఏర్పాటుచేశారు. అమ్మవారికి ఒకపక్క కుమారస్వామి, మరోపక్క గణపతి స్వామి వుంటారు. ఈ అమ్మవారిని పూజిస్తే సంతానం కలుగుతుం దని భక్త్తుల విశ్వాసం.
శ్రీపాద వల్లభ దత్త క్షేత్రం

శ్రీ గురుదత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారం అయిన ‘శ్రీపాద శ్రీ వల్లభ’ స్వామి ఈ క్షేత్రంలోనే జన్మించారు. ఆయన జన్మిం చిన గృహం ఇప్పుడు ”శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం”.
ఈ క్షేత్రంలో కొలువై వున్న పురుహూ తికాదేవి, కుక్కుటేశ్వరస్వామి, గురు దత్తాత్రేయుల విగ్ర హం, మహాగణపతి విగ్రహం, కాల భైరవస్వామి విగ్ర హాలు ఎంతో తేజో వంతంగా ఉం

టాయి. నిజంగా ఆ మూర్తులుమనల్ని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. గతించిన పెద్దలకు ఈ క్షేత్రంలో పితృతర్ప ణాలు, పిండప్రదానాలు చేసుకుంటే వాళ్ళు ఉత్తమలోకా లకు వెళతారని నమ్మకం. అందుకే దీన్ని చిన్న గయ, శ్రీ పాద గయ అంటారు.

శ్రీ బాల వేంకటేశ్వరస్వామి

- Advertisement -

పిఠాపురంలో వందల ఏళ్ళ నాటి శ్రీ బాల వేంక టేశ్వర స్వామి దేవాలయం వుంది. ఆ ఆలయాన్ని తిరుమ ల తిరుపతి దేవస్థానం పునరుద్ధరించి అత్యంత వైభవంగా విశాలంగా నిర్మించారు. దాదాపు రెండు ఎకరాల విశాల ప్రదేశంలో ఎంతో రమణీయంగా శ్రీ పద్మావతీ గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని పున: ప్రతిష్టించి ఐదు సంవత్సరాలు అవుతోంది. మూడు అడుగులు ఉండే పురా తన విగ్రహాల్ని అలాగే ఉంచి ఆరడుగుల శ్రీ వేంకటేశ్వర స్వామి వారితో పాటు శ్రీ పద్మావతి, గోదాదేవి అమ్మవార్ల విగ్రహాలను పున: ప్రతిష్టించారు. తిరుమలలో స్వామి వారికి ఉండేవిధంగా అన్ని వసతుల్ని, నైవేద్య ప్రసాదాల కు వంటశాల, కోనేరు, తిరుమలలో మాడవీధుల్లాగా ఆలయం చుట్టూ తిరువీధి ఉత్సవం జరుపుకునేందుకు వీలుగా విశాలమైన ప్రదేశం ఏర్పాటు చేశారు.
స్వామివారి మూల మూర్తిని ప్రతిష్టించిన ప్రధాన మందిరానికి ముందు ఓ పెద్ద గది, దానికి ఉత్తర, దక్షిణ ముఖంగా రెండు వైపులా పెద్ద ద్వారాలు , దానికంటే ముం దు సిం#హ ద్వారా మండపం, ఇరుప్రక్కల జయ విజయు లు. ఆలయంలో కాలుపెడుతూనే ఓ అలౌకికమైన ఆధ్యా త్మిక అనుభూతికి లోనవుతాము. ఎత్తైన గోపురం, పైన ఉత్త ర ముఖంగా విమాన వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తారు. స్వామివారి ప్రధాన ఆలయానికి బయట ఇరువైపులా శ్రీ పద్మావతి అమ్మవారు, గోదాదేవిలా మందిరాలు నిర్మిం చారు. ఈ వేంకటేశ్వరస్వామి వారిని దర్శిం చి ఆలయం చుట్టూ నలభై ఒక్క రోజులు ప్రదక్షిణ చేస్తే భక్తుల అభీష్టం నెరవేరుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement