Thursday, November 21, 2024

క్షమయా ధరిత్రి…

మహాభారత యుద్ధములో సర్వనాశనం అయిన దుర్యోధనుడిని సంతృప్తి పరచడా నికి అశ్వత్థామ అతి కిరాతకంగా పాండవుల పుత్రులైన ఉపపాండవులను నిద్రిస్తుండగా వధించా డు. పసిపాపలైన బాలకులను నెత్తుటి మడుగులో చూసిన పాండవులు, ద్రౌపదీదేవి దు:ఖానికి అంతు లేదు.
తన పుత్రులందరినీ పోగొట్టుకుని విలపిస్తున్న ద్రౌపదిని ఓదారుస్తూ అర్జునుడు. ”ఇంత దారుణ మైన పనిచేసిన ఆ అశ్వత్థామను నీ వద్దకు లాక్కు వస్తాను” అంటూ పారిపోతున్న ఆ ద్రౌణి వెనకాలబడ్డాడు అర్జునుడు. శ్రీ కృష్ణార్జునుల రథము సమీపిస్తుండటం చూసిన అశ్వత్థామ ప్రాణరక్షణ కోసం బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప అన్యమేదీ తనను కాపాడ జాలదు అనుకుని రథ మాపి శుచి అయ్యి ఆచమించి మంత్ర ప్రయోగము చేశాడు. ప్రళయకాల రుద్రునిలా సమీపించే ఆ బ్రహ్మాస్త్రాన్ని చూసి శ్రీకృష్ణుడు ప్రతి బ్రహ్మాస్త్ర ప్రయో గం చేయమని ఆజ్ఞాపించాడు.
అర్జునుడు కూడా శుచి అయ్యి ఆచ మించి పరమాత్మకు ప్రదక్షిణము చేసి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ రెండు అస్త్రాలు సూర్యాగ్నుల వలె ప్రజ్వరిల్లాయి. వాటి ప్రభావము చతుర్దశ భువనాలను దహంపగలదని తెలిసిన శ్రీ కృష్ణుడు ఆ అస్త్రాలను ఉపసంహరించమన్నాడు. అర్జునుడు శాస్త్రకోవిదుడు ఆ రెండు బ్రహ్మాస్త్రాల నూ ఉపసంహరించి, అశ్వత్థామను బంధించి ద్రౌ పదీదేవి ముందుకు తెచ్చి పడేశాడు.
అయిదుగురు చిన్న పిల్లల ప్రాణాలు తీసిన ఆ అశ్వత్థామ ద్రౌపది ముందు సిగ్గుతో తల ఎత్త లేకపో యాడు. పరాన్ముఖుడైన గురు పుత్రునికి నమస్కరిం చి సుగుణవతియైన ద్రౌపదీదేవి.
”నాయనా! మీ తండ్రిగారైన ద్రోణాచార్యుల వారి వద్ద మా మగవారు విద్యాభ్యాసం చేశారు. పుత్రరూపములో ఉన్న ద్రోణుడవు నీవు. మాకు గురుతుల్యుడవైన నీవు ఇలా నీ శిష్యనందనులను దారుణముగా వధించడం ధర్మమా!?
హాని కలిగించినా ఎదుర్కోలేని పసివాళ్ళను, నీకెన్నడూ అపకారము చేయని, అందాలు చిందే పాపలను నిదురించి ఉండగా చంపటానికి నీకు చేతు లలా వచ్చాయి? ఓ గురుపుత్రా! ఇక్కడ నేను నా పు త్రులకై ఏడుస్తున్నట్లే అక్కడ నీ తల్లి కృపి నీకోసం ఎంతగా విలపిస్తున్నదో. అర్జునుడు బంధించి తీసు కుపోయాడన్న వార్త వినగానే ఎంత పరితాపమును చెందినదో కదా” అని శ్రీకృష్ణార్జునుల వైపు చూసి ”ద్రోణాచార్యుల వారు స్వర్గస్థులైనా ఇతని మీదే ఆశలు పెట్టుకుని జీవిస్తున్నది ఆ సాధ్వి కృపి. నాలాగే పిల్లవాడి కోసం ఎంతో బాధపడుతూ ఉంటుంది. గురుపుత్రుడైన ఈ అశ్వత్థామను వదిలి వేయండి! గురుపుత్రుని వధించుట ధర్మము కాదు” అంది.
ఈ ప్రకారం ద్రౌపదీదేవి ధర్మ సమ్మతంగా దాక్షిణ్య సహతంగా, నిష్కపటంగా నిష్పక్షపాతం గా, న్యాయంగా ప్రశంసనీయముగా పలికింది. పాం చాలి మాటలు విని ధర్మనందనుడు ఎంతో సంతో షించాడు. భగవంతుడైన శ్రీ కృష్ణుడు ఆమెను ఎంత గానో పొగిడాడు. అక్కడ ఉన్న అందరూ ఆమె మాటలను సమర్థించారు. కానీ భీమసేనుడు ”కన్న కొడుకులను క్రూరముగా చంపినవాడు కళ్ళముం దున్నా కోపం తెచ్చుకోకుండా విడవమంటుందే మిటి? స్వాభావికముగా దయ ఉన్నవాడే బ్రా#హ్మణు డు, కానీ ఇలా ఘోరకృత్యం చేసిన ఈ అశ్వత్థామ క్షమార్హుడు కాదు” అంటూ ఆ అశ్వత్థామ పైకి దూకాడు. తొందరలో ఏం చేస్తాడో అని ఆ గురుపు త్రునికి అడ్డంగా నిలబడింది ద్రౌపది.
శ్రీకృష్ణుడు భీమసేనుడిని ద్రౌపదిని వారించి ఇలా ధర్మబోధ చేశాడు. ”శిశుఘాతకుడూ కిరాతకు డూ అయిన ఈ అశ్వత్థామ ముమ్మాటికీ చంపద గినవాడే. కానీ గురుపుత్రుడు పైగా విప్రుడు అయినం దువల్ల వీనిని చంపకుండా శిక్షించాలి. ఒక వీరుడికి తలగొరగటం చావుతో సమానం. ఈతని శిరోజాలు ఖండించి అవమానించి పంపుదాం” అన్నాడు.
అప్పుడు విశ్వమంతా కొనియాడ తగ్గవాడూ వీరాధి వీరుడూ అయిన అర్జునుడు, ఆ అశ్వత్థామ శిరోజాలు ఖండించి అతని శిరస్సుమీదనున్న దివ్య (జ్ఞాన) మణిని తీసుకుని అవమానించి బయటికి గెంటివేశాడు. అనంతరం చనిపోయిన బంధువులు అందరికీ ద#హన సంస్కారాలు చేసి గంగాతీరంలో పొంగిపొరలే దు:ఖాన్ని దిగమ్రింగుకుని మరణిం చిన వారికి తిలోదకాలిచ్చారు పాండవులు.
ద్రౌపది పుట్టెడు పుత్రశోకంలో వున్నా భూ దేవంత ఓర్పుతో క్షమాభిక్ష పెట్టింది కాబట్టే స్త్రీని ‘క్షమయా ధరిత్రి!’ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement