Tuesday, November 19, 2024

కరుణాంతరంగిణి శ్రీ కంచికామాక్షీదేవి

శ్రీకామాక్షీ పరదేవత కాంచీ నగర ప్రాంతమును సస్యశ్యామలం చేయుచూ, ఆ చల్లని తల్లి దయ తో కూడిన చూపులతో మూగబోయిన మనస్సు కలవా రికైనను మహాకవిత్వమును, ఆధ్యాత్మిక చింతనను ప్ర సాదించి, మోహ తిమిరమును నశింపజేసిన కరుణా సాగరి. వరదాయిని.
శ్రీ మూక శంకరేంద్రులు కంచి కామకోటి పీఠము నకు 20వ పీఠాధిపతిగానున్నారు. మూక కవి జన్మత: మూగవారు. బాల్యం నుండి కంచి కామాక్షి అమ్మవారి ని ఆరాధిస్తూ, సేవించేవారు. చిన్నతనంలో ఒక పర్యా యం అమ్మవారి విగ్రహమును తదేకంగా చూస్తున్న వేళ, పెదవులు కదలడం చూసినారు. వెంటనే ఆయన విగ్రహం పెదవులను కదపగా, వారి నోటి నుండి ఆశువు గా, అమృతధారగా వెలువడిన స్తోత్ర రాజమే ”మూక పంచశతి, స్తోత్రమాల.”
ఆనాటి కంచి పీఠాధిపతి విద్యా ఘనస్వామికి మూ క శంకరులకు జరిగిన ఘటన తెలిసింది. వారి తల్లిదం డ్రుల అనుమతితో వీరికి సన్యాసాశ్రమ దీక్షను యిప్పించారట.
మూక శంకరులు కామాక్షీదేవి అనుగ్రహంతో ఐదు శతకముల కూర్పుగా, ఆర్యా శతకము- పాదారవింద శతకము- స్తుతి శతకము- కటాక్ష శతకము- మం దస్మిత శతకము రచించారు. వీరికి ధ్యానములో గోచరించిన విషయములే మూకపంచశతి. అమ్మవాక్కులే మూక శంకరులలో ప్రవేశించి అమృతధారగా వెలువడినది. అన్ని శతకములలో కామాక్షీ అమ్మవారి వైభవములే, ఇది పారా యణ గ్రంథమై ఫలశ్రుతిగా కంచికామాక్షీ దయతో జ్ఞానసిద్ధి- కవితాశక్తి లభిస్తా యని ఆర్యోక్తి. కామాక్షీదేవి పట్ల భక్తి భావనా బలంతో రచించిన స్తోత్రం.
ఇంక అమ్మవారి వైభవ విషయాలు అమృత తుల్యములు. సప్త మోక్షపుర ములలో కాంచీ నగరము అతి ముఖ్యమైనది.
కంచి గొప్ప ఉపాసనా భూమి. ఏకామ్రేశ్వరుని రాణి కామాక్షి. ఆ జనని దివ్య సౌందర్యరాశి. ఆమె హస్తములలో ధనుస్సు- బాణము- అంకుశము- పాశము లను ధరించినది. సకల జగతికీ మాతృస్థానము గాన ఆమె కొంచెం వంగినట్లు ఉంటుంది. కైవల్యానందమునకు జన్మస్థానము కామాక్షీ పరదేవతయే. తన భక్తు లు మనసారా చింతించుట వలన వారి కోర్కెలు తీర్చే చింతామణి. అమ్మ పట్ల భక్తి – చిదానందభూతి లభించుట వలన చైతన్య సుధా ధారా స్వరూపిణియై విరా జిల్లుచున్నది.
కాంచీపురములో కామారియైన శివుని మోహంపజేయుచున్నది. తన కడ గంటి చూపులతో శివుని మోహ, ప్రేమ- పాశబద్ధునిగా గావించినది. మూక శంక రులు ఆర్యాశతకంలో-
”ఐశ్వర్య మిందు మౌలే- రైకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతమ్‌
ఐందవ కిశోర శేఖరమై దమ్పర్యం- చకాస్తిని గమానామ్‌”
అంటూ ఐశ్వర్యము గలవాడే ఈశ్వరుడు. అమ్మయే చంద్రశేఖరుని ఐశ్వర్య ము గాన, అమ్మవారి వలననే శంకరునికి ఈశత్వము కల్గినది. బ్రహ్మాండమంత యూ అమ్మయే గదా!
వాగ్రూపిణియైన కామాక్షీ పరదేవత కాంచీనగరములో వేదముల తాత్ప ర్యముగా, జీవైశ్యర్య ఐక్య జ్ఞాన హితువుగా, బాలేందు మౌళిగా ప్రకాశించుచున్న దని మూక కవి భావన. పవిత్ర కంపా నదీతీర నివాసిని, చైతన్య స్వరూపిణి.. వేదములకే వందనీయురాలు. జీవుల యందుండు ద్వైధీ భావము దు:ఖమునకు హతువు.
ఉపాసనతో సాధకుడు. చేరుకొనే అద్వైత సిద్ధియే ఆనందసిద్ధి. అమ్మ ఆరా ధనతోనే చిదానంద స్థితిని పొందగలరు. ఏకామ్రేశ్వరునికి అధీనురాలుగా శోభి ల్లుచున్న యీ పరాంబిక.
శివుని కాముని చేయదలచిన కంతుడు అనగా మన్మధుడు శివుని ఫాల నేత్రా గ్నికి బూడిద అయినాడు. అట్టి కామునకు అమ్మవారి కనుచూపులే జన్మ స్థానము లైనవి. కామాక్షి సృష్టి సంకల్ప భావముతో స్మాత్మరూపుడైన శివుని చూచి కామేశ్వ nరాంకస్థ అయినది. ఆమెకు భిన్నముగా మరేదీ లేదు. ఆ తల్లి విలాస- విహారములే తన మదిలో సదానిల్చియుండాలని మూక కవి అంతరంగ భావన.
ఆమ్ర వృక్షము యొక్క మూలము వాసముగా గల ఆదిపురుషుడు పరమే శ్వరుడు. తనరామను, స్వాత్మరూపిణి కామాక్షిని దర్శించినాడు. ఆ పరాత్పరిని తన హృదియందే నిల్పుకొన్నాడు శివుడు. పంచాశత్పీఠ రూపిణి అయినది ఆ సర్వేశ్వరి. శ్రేష్టులైన యోగులకు మాత్రమే దర్శనీయమైనది. ‘అరుణా, కరుణా త రంగితాక్షి’ అయినది కామాక్షీ పరదేవత.
”కంచిలో కామాక్షీదేని శివునికై తపస్సు చేసినది. మామిడి చెట్టు మూల మున సైకతలింగమును ప్రతిష్టించినది. ఆ వేళ, నది ఆమెను పరీక్షింపదలచి ఉవ్వెత్తుగా ప్రవహంచినది. కామాక్షి ఆ నీటికి అడ్డుపడి సైకత లింగమును రక్షించుకొనుటకు కౌగలించుకొన్నది. ఆ లింగముపై ఆ గుర్తులు ఏర్పడినవి. నేటికీ ఆ చిహ్నములను ఆ లింగముపై వీక్షించవచ్చును. అలాంటి శంకరునితో గూడిన ఆ దేవిని కాంచీనగరములోని ఒక అద్భుతంగా దర్శించినట్లు కవి స్తోత్రం చేసినాడు. అష్ట ప్రకృతులు కలిసిన ఒక స్త్రీ రూపము ధరించినది. పరమశివునికై తపమాచరించిన, నిశ్చలముగా వెలుగొందుతున్న కామాక్షీ పరదేవతా రూప మే. అసమాన సౌందర్యముతో కంపానదీ తీరమున విహరిస్తూ శివుని సమ్మోహ పరచుచూ పులకితుని గావించుచున్నది. జగతికే జననీజనకులైన పార్వతీపరమే శ్వరుల సంయోగము, ప్రకృతికి ఆత్మకు ఏర్పడిన సంయోగము. అది సృష్టి హతువు. విద్యాస్వరూపిణి- వేదమయి- నాదమయి- మంత్రమయి ఆ జనని కామాక్షీదేవి. జీవునిలో శివునిలో అంతటా వున్న చైతన్యశక్తి. ఈ రీతిగా భక్తితో నమస్కరించు వారికి గురు రూపిణిగా బ్రహ్మ జ్ఞానమును కలిగించి ముక్తిని ప్రసాదించే కామాక్షీ పరదేవత సాంబశివునికి ఆనందకారకురాలైనది.” అంటూ మూక కవీంద్రులు రచించిన ఆర్యా శతకం ద్వా రా సమాజానికి ఆధ్యాత్మికశక్తి ప్రసరింపజేసిన కవి, భక్తులు- యోగులకు ధ్యాన యోగమును, ఫలసిద్ధిని కలుగజేయుట ఆ పరదేవత కామాక్షీదేవియేయని, ఆమె ఆరాధనతో శాంతి సుభాలు లభిస్తాయని ఘంటాపథంగా తెల్పిన ధన్యజీవి,
శ్రీ మూక కవీంద్రులు గోదావరీ తీరంలో శివైక్యం చెందినట్లు, సిద్ధిని పొంది నట్లు చరిత్రలో వుంది.
” ఓం శ్రీకామాక్షీ పర దేవతాయైనమ:”

– పి.వి. సీతారామమూర్తి
9490386015

Advertisement

తాజా వార్తలు

Advertisement