Wednesday, November 20, 2024

కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారంకొత్తకొండ వీరభద్ర్రస్వామి

ఉత్తర తెలంగాణా జిల్లాలో భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ది చెందిన వీరభద్రస్వామి ఆలయం జాతరకి సిద్ధం అయినది. నేటి (జనవరి 10) నుంచి ఈ వీరభద్ర స్వా మికి జాతర నిర్వహిస్తారు.
ఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి ఒక ప్రత్యేకత ఉం ది. ఇక్కడ వెలసిన స్వామివారు విగ్రహ రూపంలో కాకుండా అ అర్చామూర్తిగా కోరమీసాలతో వెలసి భక్తులకు దర్శనమి స్తున్నారు.
కోర మీసాలస్వామిగా చరిత్ర కెక్కిన ఈ ఆలయం విశి ష్టత గురించి అందరు తెలుసుకోవలసిందే. కొత్తకొండ వీర భద్రస్వామి ఆలయం #హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మం డలంలోని కొత్తకొండ గ్రామంలో ఉన్న ఆలయం.
క్రీ.శ. 1600వ సంవత్సరం కాలంలో వంట చెరుకు కోసం కొంతమంది కుమ్మరులు ఎడ్లబండ్లతో కొండపైకి వెళ్లా రు. వంట చెరుకు దొరికిన తరువాత తీసుకుని వచ్చిన చూస్తే తాము పెట్టినచోట ఎడ్లు మాయమయ్యాయి. తిరిగి తమ నివాస ప్రాంతానికి వెళ్లడానికి చీకటి పడిపోవడంతో ఆ కుమ్మ రులు ఆ కొండపైనే సేద తీరారు. రాత్రి అక్కడే పడుకు న్నారు. ఆ రాత్రి వారికి వీరభద్రుడు కలలో కనిపించి తాను కొండపై వున్న ఒక గుహలో కొలువై వున్నానని, తనను గుట్టపై నుంచి కిందికి తీసుకెళ్లి ఆలయం నిర్మించి, దానిలో ప్రతిష్టించ మని చెప్పారు. ఇలా చేస్తే మీ ఎడ్లు తిరిగి దక్కుతాయని చెప్పి మాయమయ్యాడు.
స్వామివారు కలలో కనిపించి చెప్పిన విధంగానే ఆ కుమ్మరులు గుహలోకి వెళ్లి స్వామివారి విగ్రహాన్ని కిందకు తీసుకువస్తున్న నేపథ్యంలో స్వామివారి కాలు విరిగిందని స్థానికులు తెలుపుతుంటారు. సంతానం లేనివారు స్వామివారికి కోర మీసాలను సమర్పిస్తామని మొక్కుకుంటే వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆలయంలో స్వామివారికి మొక్కు లు మొక్కిన వెంటనే ఆ మొక్కు నెరవేరాలని కోడె దూడలను సమర్పించడం మరొక ఆచారంగా వుంది. కోడె ను కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చేసిన పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.
కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం రాళ్ళ మధ్య నిర్మించబడింది. ఇలాంటి శిలామయమైన ప్ర దేశంలో కూడా ఐదు కొలనులు నిత్యం నీటితో నిండి ఉండటం వీరభద్రస్వామి మ#హత్యమే అని గ్రామ ప్రజలు చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరము జనవరి నెలలో సంక్రాంతి ముందురోజు ఇక్కడ జాతర జరుగుతుంది.
ఈ జాతర ప్రధాన ఆకర్షణ సంక్రాంతి రోజున ప్రజలు ఎద్దుల బండ్లలో వచ్చి మొక్కులు సమర్పిస్తారు. ప్రతి సంవ త్సరం పుష్య బహుళ పంచమినాడు 10 రోజులపాటు స్వామి వారి కళ్యాణోత్సవం జరుగుతుంది. నేడు శ్రీ వీరభద్ర స్వామి కల్యాణంతో బ్రహ్మోత్సవాలతో ప్రారంభమవుతూ వుంది. 11న త్రిశూల పూజ, 12న వాస్తు పూజ, 13న లక్ష బిల్వార్చన, 14న భోగి పండుగ రోజున చండీహోమం, వేద పారాయ ణం, 15న బండ్లు తిరుగుట (జాతర), శత రుద్రాభిషేకం, ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ పూజ, 16న నాగవెల్లి, వసంతో త్సవం, 17న త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలు అనంత రం స్వామివారి గ్రామ పర్యటన జాతరలో ముఖ్య ఘట్టాలు గా ఉంటాయి. ప్రతి సంక్రాంతి జాతర సందర్భంగా భక్తులు తమకున్న గండాలు తీరాలని గండదీపం, వీరభ ద్రునికి వెండి, బంగారంతో చేసిన కోర మీసాలు సమర్పిస్తే కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం. వీరశైవులు ఖడ్గా లు ధరించి ప్రభలు వీరభద్రపల్లెరం చేస్తారు. స్వామి వారిని వైశ్యులు వారి ఇలవేల్పుగా పూజిస్తారు. ప్రతి ఒక్కరు వీరభద్ర స్వామిని దర్శించుకుని వారి ఆశీర్వాదం తీసుకుంటారు.
జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వా మి వారిని దర్శించుకుంటారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుండి కాక సిద్దిపేట, #హుస్నాబాద్‌, కరీంనగర్‌, జగిత్యా ల, పెద్దపల్లి, హుజురాబాద్‌, జమ్మికుంట, హదరాబా ద్‌ల నుండి భక్తులు వేలాదిగ వచ్చి దర్శనం చేసుకుంటా రు. వివిధ గ్రామాల నుండి ఎడ్ల బండి మీద కూడా ఇప్పటికి జాతరకి వస్తూ వుంటారు. వివిధ ఆర్టీసీ డిపోల నుండి బస్సులు భక్తులను జాతరకు తరలిస్తూ వుంటారు.
జాతరకు వచ్చే భక్తులకు ఆలయ కమిటీ, దేవా దాయ శాఖ అన్ని వసతులు కల్పించినది. వైద్యం, మంచినీటి సౌకర్యం, ఆర్టీసి తదితర ఏర్పాట్లలో ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశా ఖ కట్టుదిట్టమయిన చర్యలు తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement