Wednesday, November 20, 2024

కేతకి పుష్పం- గోవును పరమేశ్వరుడు ఎందుకు శపించాడు

”శాంతం పద్మాసనస్థం– శశిధర మకుటం – పంచవక్త్రం- త్రినేత్రం|
శూలం, వ్రజంచ, ఖడ్గం, పరశు, మభయదం, దక్షిణాంగేవపాంతం|
నాగం, పాశంచ, ఘంటాం, వరదకరయుత మంబికాం వామభాగే|
నానాలంకారయుక్తాం- స్ఫటికమణినిభం పార్వతీశంనమామి||”
”శాంతాకారుడు, పద్మాసనుడూ, చంద్రకళాధరుడూ, పంచముఖుడూ, త్రినేత్రుడూ, శూల- వజ్ర- ఖడ్గ- పరశు- అభయహస్తుడూ, నాగ, పాశ, ఘంట, వరద వామహస్తుడైన అర్థ నారీశ్వరుడూ, నానాలంకార శోభితుడూ, దివ్యస్ఫటిక మణిప్రకాశమానుడైన పార్వతీ మనోహరునకు ప్రణామం!!” అంటూ ఆ సేతు హిమాచలమే కాక, విశ్వజనాళితో పాటు- సకల దేవతా కోటి, మహర్షులూ- ఆ పరమేశ్వరుణ్ణి వేనోళ్ళ స్తుతిస్తారు. పుణ్యభూమి, కర్మ భూమి, వేదభూమి మనది.
లోక కళ్యాణార్థమై పరమేశ్వరుడు మాఘ బహుళ చతుర్ధశి అర్థరాత్రి సమయాన పాతా ళం నుండి భూమి, ఆకాశాలను కలుపుతూ కోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తూ ఓంకార నాదం ప్రతిధ్వనించగా మహా అగ్నిజ్వాలలు వెదజల్లుతూ గొప్ప మహాలింగం ఆవిర్భవిం చాడు. అదే ‘మహాగ్ని తేజోలింగం’. దాని ఆది- అంత్యాలను కనుక్కోవాలని బ్రహ్మ, విష్ణు వులు భావించారు.
వెంటనే ముందుగా బ్రహ్మ ఆ తేజోలింగం అంత్య భాగం చూడాలని హంసవాహనంపై ఆకాశానికి ఊర్ధ్వంగా దాని మొదలు కనుగొనాలని, వరాహరూపంలో శ్రీమహావిష్ణువు నేల ను త్రవ్వుకుంటూ భూగర్భంలోకి వెళ్ళి, ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించి విఫలులయ్యా రు. కాని ఇంతలో బ్రహ్మ మాత్రం ‘మహాతేజోలింగం’ నుండి జారి భూమి పైకి రాలిపడుతు న్న ఒక మొగలిరేకును చూసి, ”నీవు ఎక్కడి నుండి వస్తున్నావని” అడిగాడు. తాను ఆ మహా తేజోలింగం శిరోభాగం నుండి జారిపడి కొన్ని వేల సంవత్సరాలుగా ప్రయాణించినా ఇంకా భూమిపైకి చేరలేక, అది చేరేందుకై ప్రయత్నిస్తున్నానని బ్రహ్మతో పలికింది. అంతలోనే అక్క డికి ఒక ఆవు కూడా వచ్చింది. అయితే ఆ మహాలింగం శిరోభాగం చూచి రావలెనన్న తన ప్రయత్నమగుటచే నిరాశ చెందిన బ్రహ్మ తానే విష్ణువు కంటే అధికుడనిపించుకోవాలని భావించి ఒక కొత్త ఆలోచన చేసాడు. వెంటనే బ్రహ్మ మొగలిరేకుతో తాను శివలింగం శిరోభా గాన్ని తాకి వస్తున్నట్టు దొంగ సాక్ష్యం చెప్పమని మొగలిరేకును, ఆ గోవును ప్రార్థించగా అవి అందుకు అంగీకరించాయి. వెంటనే బ్రహ్మ ఆ మహాలింగం స్థావరానికి తిరిగి వెళ్ళగా, అ ప్పటికే అక్కడికి చేరిన విష్ణువు తాను ఆ మహాలింగం అంత్య భాగాన్ని చూడలేదని బ్రహ్మతో చెప్పాడు.
అంతలోనే పరమేశ్వరుడు పంచముఖాలతో కోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తూ, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ప్రత్యక్షమై తన ”ఆద్యనంత మహాతేజోరూపాన్ని దర్శించారా?” అని బ్రహ్మ విష్ణుమూర్తులను అడిగాడు. విష్ణువు ఆ మహా తేజోలింగం అంత్య భాగాన్ని కను క్కోలేకపోయానని యథార్థం పలికి స్తుతి చేయగా శివుడు ఆనందించి వాని సత్యనిష్ఠకు ప్రస న్నుడయ్యాడు. కాని బ్రహ్మ పంచముఖాలతో ప్రత్యక్షమైన పరమేశ్వరునితో తాను మహా తేజోలింగ శిరోభాగాన్ని చూసాననీ, అందుకు బలంగా మొగలిపూవు అది నిజమేనని సాక్ష్యం చెప్పగా, గోవు మాత్రం చూచినట్లుగా తల ఊపినా తన తోకను అడ్డంగా ఊపుతూ ”అది అబ ద్ధమన్నట్లుగా” శివునకు సూచించింది.
అప్పుడు పరమేశ్వరుడు దివ్యదృష్టితో బ్రహ్మ మోసాన్ని గ్రహించి భీకర రౌద్రాకారం దాల్చి కత్తిలాంటి తన చిటికెన వ్రేలితో శివనింద చేసిన బ్రహ్మ యొక్క ఊర్ధ్వంగా ఉన్న ”ఐదవ తలను” ఖండించాడు. నాటి నుండి బ్రహ్మ ‘చతుర్ముఖుడిగా’ ప్రసిద్ధిగాంచాడు.
అయితే కేతకీ పుష్పం (మొగలిపూవు)- దొంగ సాక్ష్యం చెప్పినందుకు కోపగించిన శివుడు ”నీకు శివారాధనలో- పూజకు అర్హత లేదు” అని శపించాడు. మొగలిరేకు తన తప్పు- క్షమించమని ప్రార్థించగా- శివుడు శాంతించి ”మహాశివరాత్రినాడు మాత్రం నా శీర్షాన్ని- అలంకరించెదవుగాక!- దీనిచే నన్ను సంవత్సరమంతా మిగిలిన పూలు పొందే పూజార్హత పొందిన ఫలాన్ని నీవు పొందగలవు” అని మొగలిపూవును అనుగ్రహించాడు భోళాశంక రుడైన శివుడు.
ఆ తర్వాత ఆవు కూడా తన దోషాన్ని మన్నించమని శివుణ్ణి ప్రార్థించింది. అంతట శివు డు ప్రసన్నుడై ”నీవు తలతో అబద్ధమాడినా, తోక ద్వారా నిజాన్ని పలికావు. కనుక నీ ముఖం కాకుండా నీ తోకకే ముందుగా పూజార్హత ఉండగలదు” అని ఆవును అనుగ్రహించాడు. విష్ణువు- బ్రహ్మ సకల దేవతలతో కూడి పార్వతీసమేతుడైన పరమే శ్వరుణ్ణి పూజించి స్తుతించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement