Wednesday, November 20, 2024

శీతాకాలం నేపథ్యంలో కేదార్‌నాథ్‌ పుణ్యక్షేత్రం మూసివేత

డెహ్రాడూన్‌: ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా శీతాకాలం నేపథ్యంలో కేదార్‌నాథ్‌ పుణ్యక్షేత్రాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తరాఖండ్‌లోని ఛార్‌థామ్‌ యాత్రలో భాగమైన కేదార్‌నాథ్‌ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని మూసివేశారు. బాబా కేదార్‌ ఆలయ ద్వారాలకు ఇవాళ ఉదయం 8.30 నిమిషాలకు తాళం వేసేశారు. చుట్టు మంచుకొండలు మధ్యలో ఆలయం, పర్వత శిఖరాన ఉన్న ఆలయం శీతాకాలంలో మంచుతో నిండిపోతుంది. ఇప్పటికే మంచు వర్షం సైతం కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తమై ఆలయాన్ని మూసివేసినట్లు తెలిపారు. దీపావళి పండుగ తర్వాత సాధారణంగా కేదార్‌ క్షేత్రాన్ని మూసివేస్తారు. మళ్లీ ఎండాకాలం ప్రారంభంలో ఆలయాన్ని తెరుస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement