Wednesday, November 20, 2024

యజ్ఞతత్త్వానికి నిదర్శనం కార్తీక దీపారాధన!

మన సంస్కృతిలో ప్రతీ తెలుగు మాసానికి ఒక విశిష్టత ఉంది. ఈ నెలలో దీపావళి అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం అయింది. ఈ మాసం చాలా విశిష్టమైనది. ఈ మాసం ”హరిహరాదులు ఇద్దరికీ ప్రీతి అని స్కాంద పురాణం చెబుతోంది. కార్తీక మాసంలో సోమవారం నాడు కాని, పౌర్ణమి, ఏకాదశి, ఇలా ప్రాధాన్యత గల రోజులలో ”కేదారేశ్వర వ్రతాన్ని” ఆచరిస్తూంటారు.
పూర్వం సూర్య వంశానికి చెందిన రాజు పురంజయుడు తన చెడు వ్యసనాలు వల్ల, అహం వల్ల రాజ్యబ్రష్ఠుడై, అడవులలో తిరుగుతూ ఉండగా, వశిష్ఠ మ#హర్షి, మరికొంతమం ది మ#హర్షులు చూసి, రాజును గుర్తించి, విషయం తెలుసుకొని తమ ఆశ్రమానికి తీసుకువెళ్ళి, ఆ రాజు పురంజయుడు చేత. కార్తీక మాసంలో అడవిలో ఆశ్రమానికి దగ్గరగా ఉన్న శివలిం గం వద్ద దీపారాధన చేయించి, ప్రతీ సోమవారం
ఏకభుక్తంతో శివారాధన, పౌర్ణమినాడు కేదారేశ్వర వ్రతము చేయించారు. తరువాత కొద్ది రోజులకు తన మంత్రులు, సైన్యాధ్యక్షుడు, మరికొందరు ప్రముఖులు రాజు వద్దకు వచ్చి తీసుకెళ్లి మళ్ళీ పట్టాభిషిక్తుడను చేసారు. అప్పటినుండి భక్తితో ఉంటూ, ప్రతీ కార్తీక మాసం లో ఈ వ్రతాన్ని ఆచరించమని ప్రచారం చేశారు. ఆయన జీవించినంత కాలం ఈ విధంగా కార్తీక మాసంలో సోమవారం వ్రతం, కేదారేశ్వర వ్రతం చేయడం వల్ల అంతిమంగా మోక్షా న్ని పొందినట్లుగా పురాణ కథనం.

దీపారాధన విశిష్టత

”దీపం జ్యోతి పరబ్ర#హ్మ దీపం జ్యోతి జనార్దన
దీపేన #హరతే పాపం సంధ్యా దీపం నమోస్తుతే!”

అంటూ కార్తీక మాసంలో మనం సాధారణంగా ప్రతీరోజూ సాయంత్రం సంధ్యవేళలో గుమ్మానికి అటుఇటు దీపాలు వెలిగించి ఉంచుతాము. దీనివల్ల మనలోని అజ్ఞానాన్ని తరిమి, మంచి ఆలోచనలతో, లక్ష్మీ ప్రసన్నత కలగాలని చేస్తుంటాము.
కార్తీకమాసంలో దీపారాధన ”యజ్ఞతత్త్వానికి” నిదర్శనం వెలుగొందుచున్న శిఖరం పరమేశ్వర రూపంగా, తలచి మనలో జ్ఞాన జ్యోతి వెలగాలని కోరుకొంటాము.
దీప కాంతి ఆత్మ జీవాత్మల కలయిక వెలుగు రూపమే! ఎందుకంటే ప్రమిద మన శరీరం అయితే, నూనె ప్రాణం. వెలిగే ఒత్తులు ఆత్మ, జీవాత్మ, జీవాగ్నితో ప్రకాశిస్తున్నాయి. దీపపు జ్యోతి పరబ్ర#హ్మ స్వరూపం. అగ్ని పురాణంలో అగ్ని దేవుడు పరమేశ్వరుడుని స్తుతించారు. దీపారాధనలో విజయ సాఫల్యత ఉంది. అందుకే ప్రతీ నిత్యం దేవునికి దీపారాధన చేయడం. శుభకార్యాలలో మంగళహారతి ఇవ్వడంలో కూడా దృష్టి దోషాలు తొలగిపోతాయని. విజయసిద్ధి కొరకు రణరంగానికి వెళ్ళే రాజులకు విజయ తిలకం దిద్ది, విజయం సిద్ధించాలని హారతి ఇచ్చేవారు.

దీపారాధనలో తీసుకోవలసిన జాగ్రత్తలు

”దీప:” అంటే వెలుగుతూ అందరికీ వెలుగు నిచ్చేది అని. వెలిగించిన దీపం నేల మీద పెట్టకూడదు. భూమి, సర్పాలకు వేడి సెగ తగలకూడదు. భరించలేవు. అందుకే దీపం కొంత ఎత్తులో వెలిగించాలి. నేలమీద పెడితే ”తామ్ర తాపం” అనే నరకంలోకి పడిపోతారు.
దీపపు కుందెలు స్థంభాల ఆకృతిలో ఉన్నవి మంచిది.
బంగారు కుందె బ#హు శ్రేష్ఠం. తరువాత రజిత, లేదా పంచలోహాలతో చేసిన కుందె
లు. లేదా మట్టి కుందెలు దీపారాధనకు శ్రేష్ఠం.
ఈ కార్తీక మాసంలో చాలామంది ఉసిరికాయలోనూ, కొబ్బరి చిప్పలోనూ దీపా
రాధన చేస్తారు. ఆ దీపాలను కూడా దానం చేస్తారు. దానం చేయడం వల్ల వారి
పాపాలు భస్మీపటలం అయిపోతాయి.
365 ఒత్తులు ముందుగానే నేతిలో నానబెట్టి సోమవారం కాని, క్షీరాబ్ది ద్వాదశి
నాడు కాని, ఏకాదశి వంటి మంచి రోజులలో శివాలయం ప్రాంగణంలో దీపారా
ధన చేయాలి. దీనివల్ల ఏ ఒక్క రోజు దీపం వెలిగించని దోషం లేకుండా చేస్తుంది.

- Advertisement -

దీపదానం విశిష్టత

కార్తీక మాసంలో దీపదానం చేస్తూంటారు. దానమంటేనే ఒక పవిత్ర కార్యం. దానం వల్ల దానకర్తల ఆయుష్‌ పెరిగి పుణ్య లోకప్రాప్తి కలుగుతుంది. అంతేకాక అజ్ఞానంతో ఉన్నవా రికి జ్ఞానం పొందాలన్నా, మూఢత్వం లేదా తెలివితక్కువ తనంతో ఉన్నా, అటువంటి వారిచే దీపదానం చేయిస్తే జ్ఞాన సంపద సిద్ధిస్తుంది అని కార్తీక పురాణం చెబుతోంది. మూఢత్వంతో ఉన్న పుత్రుడును చూసి తల్లిదండ్రులు మానసికంగా బాధపడేవారు. ఒకసారి ఒక మహర్షి వారు ఉన్న ప్రదేశానికి వచ్చినప్పుడు, వారు తమ కొడుకు మూఢత్వం పోయే మార్గం ఉపదే శించమని కోరగా, ఆయన ”ఆ బాలుడు చేత కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు ఉపవాసదీక్ష చేయించి, ఆయా రోజుల్లో
”దీపదానం” చేయించగా, క్రమక్రమంగా అతను చైతన్యం పొంది జ్ఞానవంతుడు అయ్యాడు. దీపదానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒక ఒత్తి దీపారాధన చేసి దానం చేయ డం ద్వారా తేజస్సు సద్బుద్ధి సిద్ధిస్తాయి.
నాలుగు ఒత్తులతో దీప దానం చేస్తే మహారాజ యోగం.
మూడు ఒత్తులు దీపదానం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, రెండు ఒత్తులతో దానం చేస్తే పాపాలు పోతాయి. ధైర్యం వస్తుందని అగ్నిపురాణం విశదీకరిస్తోంది.
దీపదానం వైష్ణవాలయాల్లో చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం పొంది, సకల రోగ శాంతి, సుఖశాంతులు లభిస్తాయి. అదే శివాలయంలో చేస్తే సిరి సంపదలతో బాటు, విద్యాభి వృద్ధి, సత్ససంతాన ప్రాప్తి కలుగుతుంది.
కాబట్టి మనం కార్తీక మాసంలో విష్ణు ఆలయంలోను, శివాలయంలోను దీపారాధన చేసి, హరిహరులను ఆరాధిద్దాము. జీవన సాఫల్యతకు నాంది పలుకుదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement