Friday, November 22, 2024

కెనడా కాల్గరీ సాయిబాబా మందిరంలో కార్తీక దీపోత్సవం

శ్రీ అనఘా దత్త సొసైటీ వారి ఆధ్వర్యంలో కెనడా కాల్గరీ సాయిబాబా మందిరంలో కార్తీక దీప వేడుకలు ఘనంగా జరిగాయి. భగవన్నామస్మరణ కీర్తనలతో, ధూప, దీప నైవే ద్యా లతో అత్యంత వైభవంగా జరిగిన ప్రత్యేక పూజ లలో వందలాదిమంది భక్తులు పాల్గొన్నారు. దేదీప్య మానంగా వెలిగిన వెయ్యికి పైగా దీపాల కాంతు లు చూపరులకు కనువిందు చేశాయి. మందిరంలో వున్న ఉత్సవ మూర్తులకు అభిషేకా లతో ప్రారంభమయ్యాయి కార్తీక పౌర్ణమి వేడు కలు. మందిరమంతా భగవన్నామస్మరణలు, పూజలు, హారతులతో కూడిన ఆధ్యాత్మిక వాతావ రణం…ప్రత్యేకంగా అలంకరించిన ప్రాంగణం ఉత్సవ సౌరభవంతో అలరారింది. మధ్యాహ్న హారతి, రుద్ర హోమం, సత్యనారాయణ వ్రతం
పూజల్లో అనేక మంది పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పండిట్‌ రాజ కుమార్‌శర్మగారి విశేషానుభవంతో దేవ, దేవి అలం కారాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించ బడింది. పండిట్‌ రాజకుమార్‌శర్మ గారు కార్తీక దీప విశేషాన్ని భక్తులకు వివరించారు. పౌర్ణమి ఉత్సవాలకు, పూజలకు విచ్చేసిన భక్తులు కోవిడ్‌ నిబంధనలు అతిక్రమించకుండా చాలా పద్ధతిగా నిలిచారు. భక్తిశ్రద్ధ లతో భక్తులు పూజ లకు తమ వంతు వచ్చేంతవరకు వేచి వుం డి, నియమ బద్ధత పాటించిన తీరు ఎంతో శ్లాఘ నీయమైంది. మందిరంలో శివ, పార్వతి, సాయి బాబా మూర్తులకు అభిషేకం జరిగింది. ఈ కార్య క్రమంలో నాలుగు వందల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహుకులు శ్రీమతి లలిత, శైలేష్‌ చాలామంది వాలంటీర్లతో ఈ కార్య క్రమాన్ని ఎంతో శ్రద్ధగా నిర్వహించారు. ఆలయ నిర్వహణకు ఎంతో మంది విరాళాలు సమర్పిం చారు. లలితగారు మాట్లాడుతూ- ఏదేశ మేగినా ఎందు కాలిడినా మన హైందవ సాంప్రదాయ పటుత్వాన్ని నెలకొల్పాలని హిందూ రక్షణలో భాగం కావాలని కోరారు. శ్రీ అనఘా దత్త సొసైటీ అఫ్‌ ఒక హిందూరక్షణ సమి తి. హైందవ సంస్కృతి పరిరక్షణకి ఆయువు పట్టు.

Advertisement

తాజా వార్తలు

Advertisement