Saturday, November 23, 2024

కర్తవ్య దీక్షాపరుడు గణపయ్య

తొలిపూజలందుకునే దైవం బొజ్జ గణపయ్య. అనుకున్న పని నిర్విఘ్నంగా సాగాలంటే…. ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం ఉండా లని కోరుకుంటాం. ఆ స్వామి నుండి ముఖ్యంగా మనం నేర్చుకోవా ల్సిన అంశాలు
చెక్కుచెదరని కర్తవ్య దీక్ష
పుట్టీపుట్టగానే మహత్తరమైన కార్యభారం వినాయకుడి మీద పడింది. శివయ్య రాక్షస సంహారం చేసి విజయుడై వస్తుంటే… గణపయ్యను గుమ్మం వద్ద కాపలా ఉంచి, మంగళ హారతివ్వడం కోసం తయారవడానికి తల్లి పార్వతి ఇంట్లోకెళ్ళింది.
తల్లి ఆజ్ఞ శిరసావహించి వాకిలి వద్ద కాపలా కాస్తున్న వినాయ కుని ప్రక్కకు జరిపి శివయ్య ఇంట్లో ప్రవేశించబోయాడు. నా ఆజ్ఞ లేకుండా లోపలికి వెళ్తున్నావు నీవు ఎవరంటూ అడ్డగించాడు. వచ్చినవాడు తన తండ్రి అని తెలియదు బాల గణపయ్యకు. బాలగణపయ్యకు తెలిసిందల్లా అమ్మ ఆజ్ఞ పాటించ డమే… పాపం శివయ్యకు తన బిడ్డేనని తెలియదు. తన ఇంట్లోకి తననే వెల్లవద్దంటున్నాడనే కోపం లో… బాలుడి శిరస్సు ఖండించాడు శివయ్య. కర్త వ్య నిర్వహణలో ప్రాణాలకు తెగిం చయినాసరేవిధినిర్వహణ చేయా లనే సందేశాన్ని గణపయ్య ఈ విధంగా మనకందించారు.
మాతృవాక్య పరిపాలన ఎలా చేయాలో తల్లి పట్ల ఎలా విధే యత కలిగి ఉండాలో ఆచరిం చి చూపించాడు గణపయ్య స్వామి. ఎన్ని కష్టాలొచ్చినా తన కర్తవ్యాన్ని మర్చిపోకూడదన్న మనకిచ్చిన మొదటి సందేశ మిది.
తల్లిదండ్రులపై భక్తి
గణాధిపత్యం కోసం అన్నదమ్ముల మధ్య పోటీ ప్రారంభమైంది. నెమ లి వాహనమెక్కి అమిత వేగంతో స్కందుడు ముక్కోటి తీర్థాలో పుణ్య స్నానం చేయడానికి బయల్దేరాడు.
అన్న గణపయ్య పరిస్థితి ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరి’ తనేమో భారీకాయం కలవాడు కావడంవల్ల వేగంగా కద ల్లేడు… పోనీ తన వాహనం మీదైనా వెళ్లొచ్చుకదా అంటే… అదే మో చిన్న మూషికం. ఇంత చిన్న వాహనమెక్కి ముల్లోకాలను తిరిగి రావడమెలా…? వెంటనే తన సూక్ష్మ బుద్ధితో ఆలోచించి

తన తల్లిదండ్రులే సకలదేవతా స్వరూపమని తన సూక్ష్మ బుద్ధితో గ్రహించి వెంటనే చెక్కుచెదరని భక్తిప్రపత్తులతో… తల్లిదండ్రు లను సేవించి నమస్కరిస్తూ…ప్రదక్షిణం చేశాడు. ఈ ఘట్టం… అద్భుతమైన సందేశం మనకందిస్తుంది. అమ్మానాన్నలంటే… మన కంటికి కనిపించే… కదలాడే దైవాలనే సంగతి మనమేనాడూ మరువొద్దు. త్రికరణశుద్ధిగా తల్లిదండ్రులను సేవిస్తే ఎంత గొప్ప విజయం లభిస్తుందో ఆచరించి చూపించాడు గణపయ్య. అంతే కాదు కష్టాల్లో కూడా మన ఆలోచనా సరళి ఎలా ఉండాలో… ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. నేర్పరితనం ఆలోచనల్లో వైవిధ్యం వైదుష్యం సమయస్ఫూర్తి ఇవన్నీ గణపయ్య నేర్పే మరో సందేశం.
ఆత్మసౌందర్యం – క్షమాగుణం
గణాధిపత్యం లభించాక భక్తులు సమర్పించిన ప్రసాదాలారగిం చి.. సంధ్యా సమయంలో తల్లిదండ్రులకు నమస్కరించడానికి ఆయాసపడుతూ ఉండగా చూసి శివయ్య తలపై ఉన్న చంద్రుడు పకపకా నవ్వేశాడు. ఫలితంగా.. తనని చూసిన వారికి నీలాప నిందలు వస్తాయని శాపం పొంది… క్షమించాలని వేడుకున్నాడు..
తనను అపహాస్యం చేసిన చంద్రుని ఒక్కమాట కూడా తిట్టకుండా క్షమించి… సమున్నతమైన క్షమాగుణం ప్రదర్శించి… మన భౌతిక రూపానికి నిండుదనం చేకూర్చేది ఆత్మ సౌందర్యం మాత్రమే… అన్న నానుడిని అక్షరసత్యం చేసి నిరూపించాడు మన గణపయ్య స్వామి. మనకు ఆదరణ గౌరవ మర్యాదలు లభించేవి మన వ్యక్తి త్వం వల్ల మాత్రమేనని… భౌతిక సౌందర్యంవల్ల కావనే నీతి సూత్రం అందించారు గణపయ్య.
దీక్షాదక్షతలు
వ్యాసమహర్షి మహాభారతాన్ని రచించాలని సంకల్పించి… తాను చెప్పే శ్లోకం వేగాన్ని అందుకుని రాయగలిగినవారు కావాలని ఆలో చించి… గణపయ్య స్వామితో చెప్పగా… సరేనని ఒప్పుకొని రాశా డు. మహాభారతం పూర్తయ్యే వరకూ… మనమిద్దరం ఆపకూడ దనే (వ్యాసమహర్షి చెప్పడం గణపయ్య రాయడం) షరతు పెట్టు కున్నారు. ఆ విధంగా పంచమ వేదమైన మహాభారతం అవత రించి భరతజాతికి మహోపకారం జరిగింది. తనువు మనసు బుద్ధి ఏకకాలంలో ఏకీకృతంగా పనిచేయాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. దృఢదీక్షా కంకణదారులమవ్వాలి.
వినయ విధేయతలు
గణాధిపత్యంతో ముల్లోకాలనూ శాసించే అధికారం లభించి నా… ఏమాత్రం పొంగిపోలేదు. పదవి గర్వానికి వ్యామోహానికి పట్టుబడకుండా… తన తండ్రి ఆజ్ఞకు బద్ధుడై నిలిచి… ఎంత ఎదిగి నా ఒదిగి ఉండాలనే సందేశాన్ని ఆచరణాత్మకంగా… మనకం దించారు గణపయ్య స్వామి. ఈలోకంలో శాంతి నెలకొనాలనీ… మనకు సద్గుణ సంపద, సకల శుభాలను ప్రసాదించాలనీ మనమందరమూ గణపయ్యను వేడుకుందాం.

  • చేగూరి భోజిరెడ్డి 94403 87979
Advertisement

తాజా వార్తలు

Advertisement