కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు ఒక రోజు శ్రీకృ ష్ణుడు ఉదయమే కర్ణుని భవనానికి వెళతాడు. ఆ సమ యంలో కర్ణుడు అభ్యంగన స్నానం చేయడానికి సిద్ధ మవుతూ వుంటాడు. తలకు నూనె రాసుకుంటున్నాడు. అత ను కూర్చున్న ఆసనానికి ఎడమ వైపున రత్నాలు పొదిగిన అత్యంత విలువైన గిన్నెలో నూనె వుంది. అకస్మాత్తుగా తన భవనానికి విచ్చేసిన శ్రీకృష్ణుని చూసి కర్ణుడు ఆసనంపై నుంచి లేచి నిలబడి నమస్కరించి సాదరంగా ఆహ్వానిస్తాడు. ఆసనం చూపించి కూ ర్చోమని మర్యాద చేస్తాడు. శ్రీకృష్ణుడు కూర్చున్న తర్వాత తాను కూడా ఆసనంపై కూర్చుంటాడు కర్ణుడు. ఉభయుల మధ్య కొంత సంభాషణ సాగుతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుని దృష్టి కర్ణునికి ఎడమవైపున వున్న నూనె గిన్నెపై పడుతుంది. వెంటనే ”కర్ణా! ఆ గిన్నె చాలా బాగున్నది నాకు ఇస్తావా?” అని అడుగు తాడు. వెనువెంటనే కర్ణుడు ”తీసుకో కృష్ణా!” అంటూ తనకు ఎడమ వైపున వున్న ఆ వజ్రాల గిన్నెను ఎడమ చేత్తో తీసి శ్రీకృష్ణుడికి ఇవ్వబోయాడు.
శ్రీకృష్ణుడు ”అదేమిటి? కర్ణా! అన్నీ తెలిసిన యోధుడవు. ఎడమ చేతితో ఇవ్వకూడదని తెలియదా! ఆ పాత్రను అలా ఎడమ చేతితో ఇస్తున్నావు. కుడిచేత్తో ఇవ్వవచ్చుగా” అంటాడు.
శ్రీకృష్ణుని ప్రశ్నకు వినమ్రంగా ఈ కిందివిధంగా సమా ధానం చెప్పాడు కర్ణుడు.
”క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మావయో:
యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతి:” అంటాడు.
”కృష్ణా! ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతిలోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు.
లక్ష్మి చంచలమైనది. యముడా దయలేనివాడు. మనస్సా మరుక్షణంలో ఎలా మారుతుందో తెలియదు. కనుక గిన్నె ఎడ మ చేతినుంచి కుడి చేతికి మారే లోపలే ఏ మార్పు అయినా రావచ్చు. అందుకే ధర్మ కార్యాన్ని ఆ క్షణమే చెయ్యాలనే హతోక్తి ననుసరించి యిలా చేశాను.” అని పై శ్లోకానికి అర్థము.
అది విన్న శ్రీకృష్ణుడు కర్ణుని వివేచనానికి ముగ్ధుడవుతాడు. ”ఏదైనా వరం కోరుకో కర్ణా!” అంటాడు.
శ్రీకృష్ణుని అభిమానానికి సంతసించిన కర్ణుడు-
”దేహతి వచనం కష్టం నాస్తీతి వచనం తదా
దేహ నాస్తీతి మద్వాక్యం మా భూజ్జన్మ జన్మనీ” అంటాడు.
”కృష్ణా! యాచించడం ఎంత కష్టమో, లేదని చెప్పడం కూడా అంతే కష్టం. అంతేకాదు నీచం కూడా కనుక ఏ జన్మలొ నూ దేహ (యాచించడం), నాస్తి (లేదు) అనే మాటలు నా నోటి వెంట రాకుండునట్లుగా అనుగ్రహంచు” అని కోరతాడు.
ఈ సంఘటనను బట్టి కర్ణుడి వ్యక్తిత్వం ఎంతటి మహోన్నతమైనదో అర్థమ వుతుంది. దానం విషయంలో సదా సాత్వికమే ప్రధానం. చెయ్యాలనే సంకల్పం కలుగగానే ఆదరణతో భగవదర్పణ బుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి. అంతేకానీ పది రూపా యలు దానం చేసి పదిసార్లు అనుకోకూడదు. ప్రచారం చేసుకోకూడదు. నేడు తాము చేసిన ఏ కార్యాన్ని అయినా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం పరి పాటి అయింది. నేను ఇన్ని దానాలు చేసాను, చేస్తాను అని అనుకోకూడదు. దానం చేసి నేను చేశాననే అహం ప్రదర్శించకూడదు. మనం చేసే పాప పుణ్యాలను బట్టే జీవి తంలో దు:ఖ- ఆనందం- ప్రశాంతత నెలకొంటాయి.
అలాగే ఏదైనా మంచి పని చెయ్యాలని అనిపించిన వెంటనే చేసెయ్యాలి. ”ఆల స్యం అమృతం విషం” అంటారు జ్ఞానులు. మనము కర్ణుడిలాగా వ్యవహరించలేక పోయినా మన శక్త్యానుసారం ”సత్పాత్ర” దానం చేయడం అలవరుచుకోవాలి.