Thursday, November 21, 2024

కర్మక్షాళన కారకమ్‌-జ్ఞానమ్‌..

మానవుడు కర్మజీవి. అంటే కర్మలను ఆచరిస్తూ జీవించేవాడు. భగ వద్గీతలో చెప్పబడినట్లు ”నహ కశ్చిత్‌ క్షణ మపి జాతు తిష్ఠత్య కర్మకృత్‌” (భ. 3వ అధ్యా.5వ శ్లోకం). ఈ లోకంలో ఎవ్వరూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండరు కదా! కర్మ అంటే పని. శ్వాస తీసుకొ ని వదలటం, నడవడం, భుజించడం, మాట్లాడటం… అన్నీ కర్మలే. ఇవి చేయకుండా ఎవ్వరూ జీవించలేరు కదా! వీటిని నిత్య కర్మలు లేక అనివార్య కర్మలు అంటాం. ఆయా కర్మలు గుణాన్నిబట్టి సత్కర్మలు, దుష్కర్మలు అని రెండు రకాలు. సత్కర్మలను పుణ్యకర్మలు అనీ, దుష్కర్మలనే పాపకర్మలని కూడా అంటారు. ఏ పనుల వలన అందరికీ మేలు కలుగు తుందో అవి సత్క ర్మలు. వేటివలన జనులకు కీడు కలు గుతుందో అవి దుష్కర్మలు. చేసుకొన్న ఆయా కర్మల కు తగిన ఫలితం కూడా అనుభవించి తీరవలసి ఉంది. ఫలితం లభించే సమ యాన్నిబట్టి అవి మూడు రకాలు. ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మ లు.కొన్ని కర్మలకు వెంటనే ఫలితం లభిస్తుంది. భోజనంచేశాక ఆకలి, నీరు త్రాగాక దాహం తీరినట్లు అన్నమాట. ఇలా తక్షణ ఫలం ఇచ్చే కర్మలను ఆగా మి కర్మలంటారు. కొన్ని కర్మలు ఫలితా లను వెంటనే ఇవ్వవు. ఒక పండ్ల మొ క్కను నాటడం, దానధర్మాలు చేయ డం వంటివి. ఇవి ఈ జన్మలోనో, ఆత ర్వాత జన్మలోనో తమ ఫలితాన్ని ఇస్తా యి. వీటిని సంచిత కర్మలంటారు. పక్వానికి వచ్చిన సంచిత కర్మలను ప్రా రబ్ధ కర్మలు అంటారు. ప్రారబ్ధ కర్మ లను అను భవించడం కోసం మళ్ళీ మళ్ళీ జన్మించవలసి ఉంటుంది. కొం దరు తాము చేసుకొన్న కర్మల ఫలంగా తాము పడుతున్న కష్టాలనుండి తప్పించుకోడానికి ఆత్మ హత్యలకు పాల్పడుతుంటారు. అది అవివేకం. ఎం దుకంటే వేలాది ఆవులు ఉన్న ఆలమందలో కూడా లేగదూడ తన తల్లిని గుర్తించి అనుసరించినట్లు, మనం చేసుకొన్న పుణ్య, పాప కర్మలు మనలను తర్వాతి జన్మలలో కూడా వెంటాడు తుంటాయని మహనీయులంటారు. కనుక ఈ జన్మలోనే ఆయా కర్మఫలాలను అనుభవించడం ద్వారా వాటినుండి ముక్తులము కాగలము.
మనుషుల ప్రవర్తన చిత్రమైనది. ”పుణ్యస్య ఫలమిచ్ఛంతి, పుణ్యంనేచ్ఛంతి మానవా:/ నపాప ఫలమిచ్ఛంతి, పాపం కుర్వంతి యత్న త:”. పుణ్యఫలం కోరుకొంటారే కానీ, మానవులు పుణ్యకార్యాలు చేయడాని కి ఇష్టపడరు. పాపఫలాన్ని కోరరు,కానీ ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తుంటారు. ఎంత విచిత్రం కదా!
మహాభారతంలో దుర్యోధనుడు చెప్పినట్లు ” జానామి ధర్మం నచమే ప్రవృత్తి:/ జానామ్యధర్మం నచమే నివత్తి:”. మీరు చెబుతున్న ధ ర్మం నాకు తెలుసును, కానీ దానిని పాటించడం నా ప్రవృత్తికాదు. నేను చేస్తున్నది అధర్మం అని తెలుసును. కానీ చేయకుండా ఉండలేను. ఇలాంటి ప్రవృత్తి వినాశ కారణం. వారినే కాదు. వారిని నమ్ముకొని అనుసరించే వారి ని కూడా వినాశనం వైపు నడిపించే ధోరణి అది. అంతే కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా పాపకర్మ ఫలితం మనలను విడువదు. కానీ ఇక్కడొక ధర్మసూక్ష్మం ఉంది.
” అజ్ఞానేన కతం పాపం / యత్తత్‌ జ్ఞానేన ముచ్యతే
జ్ఞానేన యత్కతం పాపం / తదత్ర కేన ముచ్యతే?” తెలియక చేసిన పాపకర్మల ఫలితం జ్ఞాన ప్రబోధముతో తొలగుతుంది. తెలిసి చేసిన దుష్కర్మల ఫలం ఏ విధంగానూ తొలగదని పెద్దల మాట. కర్మలను చేయడం వల్లనే కదా పాపమో,పుణ్యమో కలిగేది. అసలు కర్మలనే మానేసి సోమరిగా కూర్చుంటే సరిపోతుంది కదా అని అనుకోవ డం కూడా తప్పే అంటుంది భగవద్గీత. ”కర్మ సన్న్యాసాత్కర్మయోగో విశి ష్యతే” అంటూ కర్మలుచేయడం మానివేయడం కన్నా కర్మలు చేయడమే శ్రేష్ఠమని చెబుతుంది గీత. సరియైన కర్మలను ఆచరించడం ద్వారా మాత్ర మే కైవల్యం లభిస్తుంది అంటుంది. అంతేకాదు. కర్మేంద్రియాలను బిగబ ట్టి ఒక మూలన కూర్చొని తాము పర మ వైరాగ్య స్థితిలో ఉన్నామనీ, సకల మూ త్యజించామని చెప్పుకొంటూ, మానసికంగా అన్ని భోగాల పట్లా ఆస క్తిని చంపుకోలేని వారిని మిథ్యాచారు లని చెప్పింది భగవద్గీత. ”కర్మేంద్రి యాణి సంయమ్యయ అస్తే మనసా స్మరన్‌/ ఇంద్రియార్థాన్వి మూఢాత్మా మిథ్యాచార: స ఉచ్యతే” (భ. 3వ అధ్యా. 6వ శ్లోకం).
ఈ విషయం తెలుసుకోలేని సో మరులతో ఆధ్యాత్మిక రంగం నిండిపో తోందని తిలక్‌, మహాత్మా గాంధీలు బాధపడ్డారు. అనాసక్త కర్మయోగమే గీతా శయమని వారు వెల్లడించారు.
విద్యుక్తమైన సత్‌ కర్మలు చేయా ల్సిందే! కానీ వాటిపట్ల ఆసక్తి, మనం చేశాము అనే కర్తత్వ భావన, అహంకా రము ఉండకూడదు. దీనినే అనాసక్త కర్మయోగము అంటారు. ”తస్మాదస క్తస్సతతం కార్యం కర్మ సమాచర / అసక్తోహ్యాచరన్‌ కర్మ పరమాప్నోతి పూరుష:” (భ.గీ. 3వ అధ్యా. 19వ శ్లో.) ఫలాపేక్ష లేకుండా విధ్యుక్త కర్మలను ఎప్పుడూ చేసే మానవునికి మోక్షప్రాప్తి కలుగుతుందని పై శ్లోకం వివరి స్తోంది. ఆ విధంగా అనాసక్త కర్మలు చేస్తూ జనకుడు మొదలైన వారు ముక్తి పొందిన ఉదా#హరణలు కూ డా గీతాచార్యుడు వివరించాడు.
ఈ కర్మబంధం నుండి తప్పించుకోడానికి అనాసక్త కర్మయోగం పాటిస్తూ కర్మక్షాళనంకూడా చేసుకోవాలి. ఇంతకు ముందు చెప్పుకొన్నట్లు సంచిత, ప్రారబ్ధ కర్మలు నెమ్మదిగా పేరుకొని, కొండంతగా పెరుగుతూ పోతూఉంటాయి. వెంటవెంటనే కర్మక్షాళనం జరుగకపోతే ఆ కర్మరాశులు పర్వతశ్రేణులవలె తయారై మనలను భయకంపితులను చేస్తాయి. కర్మ క్షాళనకు కావలసిన ఆయుధం జ్ఞానం. గీతాచార్యుని మాటలలో ”యథా యాంసి సమిద్ధోగ్ని: భస్మాత్కురుతేర్జున! జ్ఞానాగ్నిస్సర్వ కర్మాణి భస్మా త్కురుతే తథా”. (4వ అ. 37వ శ్లో.) బాగా ప్రజ్వరిలింప చేయ బడిన అగ్ని కట్టెలను/సమిధలను ఏ విధంగా బూడిద చేయగలదో, అలాగే జ్ఞానమనే అగ్ని సమస్త కర్మలను భస్మం చేసి వేస్తుంది. సంచితప్రారబ్ధకర్మ లు అనేకము లున్నప్పటికీ వాటిని జ్ఞానాగ్ని దహించివేస్తుంది. పాపకర్మల ఫలము అనే సముద్రాన్ని జ్ఞానమనే తెప్ప దాటిస్తుంది. మరి ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి? సద్గురువుల బోధలవలన, కాలక్రమంగా చిత్తం పరిపక్వ మైనప్పుడు మన కు జ్ఞానం లభిస్తుంది. దాన్ని పొందడానికి శ్రద్ధ అవసరం. గురువుల పట్ల, శాస్త్రవచనము ల పట్ల శ్రద్ధ వహించి, తదేక నిష్ఠతో, జితేంద్రియుడైన వానికి జ్ఞానము తేలికగా లభిస్తుంది. జ్ఞానమువలన కర్మక్షాళనమై మోక్షం సిద్ధిస్తుంది.

  • డా.గొల్లాపిన్ని సీ తారామశాస్త్రి 9440781236
Advertisement

తాజా వార్తలు

Advertisement