Friday, November 22, 2024

కర్మ ఫలాలను పంచుకునేది ఎవరు

ఎవరు చేసిన పాపఫలితాన్నైనా, పుణ్యఫలితాన్నైనా వారే ఒంటరిగానే అనుభవించవలసి ఉంటుంది. ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడికి ఒకానొక సందర్భంలో అక్రూరుడు చెప్పాడు.అయితే కొన్ని సందర్భాలలో ఒకరు చేసిన కర్మల వల్ల కలిగే ఫలాలను ఇతరులు కూడా అనుభవించవలసి వస్తుందని పురాణాలు, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.

”ఏక: ప్రసూయతే జన్తురేక ఏవ ప్రలీయతేలి
ఏకోనుభుంక్తే సుకృతమేక ఏవ చ దుష్కృతమ్‌.”
– మహాభారతం దశమస్కంధం

భావం: జీవుడు ఒంటరిగానే పుడతాడు. ఒంటరిగానే మరణిస్తాడు. తన కర్మల యొక్క ఫలాలని కూడా ఒంటరిగానే అనుభవిస్తాడు.”
ఇది సత్యమే. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొందరు చేసిన కర్మని ఇతరులు కూడా పంచుకుని అనుభవించాల్సి ఉంటుందని మన పురాణాలు, ఇతి హాసాలు, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆ సందర్భా లు ఏమిటో తెలుసుకుందాం.
దేశాన్ని పరిపాలించే రాజు తన ప్రజలంతా చేసే అన్ని రకాల కర్మల్లోంచి కొంత భాగాన్ని అనుభవిం చాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశ ప్రజలు ధర్మం గానో, అధర్మంగానో ప్రవర్తించడానికి రాజుగారి ప్రవర్తనా ప్రభావం ప్రజల మీద అధికంగా ఉంటుంది.
అందువల్లనే ‘యథా రాజా తథా ప్రజా’ అంటారు. రాజు గుణవంతుడైతే ప్రజలూ గుణవంతులవుతా రు. అప్పుడు వారు చేసే పుణ్యాన్ని లేదా రాజు అధర్మ పరుడైతే ప్రజలూ అధర్మపరులవడం వల్ల వారు చేసే పాపాన్ని రాజు పంచుకుంటాడన్నమాట.
”రాజా రాష్ట్ర కతం పాపం రాజ పాపం పురోహతమ్‌
లిభర్తారాం స్త్రీ కత పాపం శిష్య పాపం గురు వ్రజేత్‌”
అని కూడా చెప్పారు.
అంటే రాజ్యంలో చేయబడే పాపాల ఫలం రాజుకి చెందుతుంది. అలాగే రాజు చేసే పాపాల ఫలం అతని కి సలహాలని ఇచ్చే పురోహతుడికి, ఇంకా భార్య చేసిన పాపం భర్తకి, శిష్యుడు చేసిన పాపం గురువుకి పోతుం ది. ”పుత్ర పాపం ప్పితుశ్చైవ” అని కొడుకు చేసిన పాపం తండ్రికీ పోతుంది.
సామాన్య ప్రజల పాపపుణ్యాలనే కాక ప్రభుత్వో ద్యోగులు తమ విధి నిర్వహణలో చేసే సుకర్మల తాలూకు పుణ్య ఫల భాగాన్ని, అలాగే దుష్కర్మల తాలూకు పాపఫల భాగాన్ని రాజు అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే, వారు సుకర్మలని చేయడా నికి ప్రోత్సహంచాల్సిన బాధ్యత, అలాగే దుష్కర్మలు చేయకుండా చూడాల్సిన బాధ్యత రాజుదే.”
అందుకే ‘రాజ్యాంతే నరకం ధృవం’ అనే నానుడి చలామణిలోకి వచ్చింది. రాజు సిబ్బందిలో దుష్క ర్మలు చేసేవారే అధికంగా ఉంటారు కాబట్టి రాజు మరణించాక నరకానికి వెళ్తాడు అని అర్ధం.”
రాజులకాలం పోయి, ఇప్పుడు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకి, ఇంకా ప్రజల చేత ఎన్నుకోబడ్డ పంచాయితీ ప్రెసిడెంటుల్లాంటి అందరి కీ ఈ నియమం వర్తిస్తుంది. ఎందుకంటే వారంతా తమ ఏలుబడిలోని ఉద్యోగస్థులకి బాధ్యతని వహం చక తప్పదు.
తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకి విధిగా సంక్ర మిస్తుందన్నది లోకాభిప్రాయం. కాని ఇందులో పూర్తి నిజం లేదు. ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా, స్వంతంగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితం. అయితే పిల్లలకు పన్నెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు వారు చేసే పాప కార్యాల ఫలాలను తల్లి దండ్రులు అనుభవించాల్సి వస్తుంది. అని కూడా అం టారు. అందుకే చిన్న వయసు నుండే పిల్లలు తప్పు లు చేయకుండా పెద్దలు అందుపు ఆజ్ఞలలో పెట్టాలి.
అయితే ఆ పిల్లలకి కూడా తమ పెద్దల సుకర్మల లేదా దుష్కర్మల్లో భాగం ఉంటే, దాంట్లో పిల్లలు తమ భాగాన్ని అనుభవించక తప్పదు.
దుష్కర్మ ద్వారా డబ్బు సంపాదించడానికి పిల్లలు తండ్రిని ప్రోత్సహంచినా లేదా అలా తండ్రి సంపా దించిన సొమ్ముని పిల్లలు అనుభవించినా అప్పుడు మాత్రమే పిల్లలు ఆ పాపఫలంలో భాగం పంచుకుని అనుభవించాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రమేయం లేకుండా ఊరికే తల్లితండ్రుల కర్మ పిల్లలకి వచ్చి చుట్టుకోదు.
”యది నాత్మని పుత్రేషు నచేత్‌ పౌత్రేషు న పిత్రుషు
న#హ పాపమ్‌ కతమ్‌ కర్మసద్య:ఫలతి గౌరివ”
– శాంతి పర్వం 92-20
భావం: ఓ వ్యక్తి చేసిన కర్మ ఫలం ఆ కర్త అనుభవం లోకి రాకపోతే అది అతని సంతానానికి (కొడుకులు, మనవలు, వారసులు) అనుభవంలోకి రావడం తథ్యం. అని తెలియజేస్తున్నాయి పురాణాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement