త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతప్తో నిరాశ్రయ:
కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించత్ కరోతి స:
(భగవద్గీత 4 వ అధ్యాయం, 20 వ శ్లోకం)
ఉత్తమ సాధకులు తమ కర్మ ఫలములపై ఆసక్తి మరియు మమకారం త్యజించిన పిద ప, ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు. బాహ్య వస్తు- విషయములపై ఆధారపడరు. వారి ఇం ద్రియాలను ఐహక భోగ వాంచల వెనుక పరుగులు తీయనివ్వక నిగ్రహంతో నియంత్రిం చుకుంటారు. వారు ఎటువంటి కర్మలలో నిమగ్నమై ఉన్నా, వారు ఏమి చేయనట్టే లెక్క.
బాహ్యంగా కనిపించే దానిబట్టి కర్మలు ఎలాంటివో నిర్ణయించలేము. మనస్సు యొక్క స్థితి మాత్ర మే ఆ పని కర్మనా లేదా ఆ కర్మనా అని నిర్ణయిస్తుంది. జ్ఞానోదయమైన వారి మన స్సు ఎప్పుడూ భగవత్ ధ్యాసలోనే నిమగ్నమై ఉంటుంది. భక్తితో భగవత్ సం యోగంలో సంపూర్ణ తృప్తితో ఉండి, భగవం తుడినే వారు ఆశ్రయించి ఉంటారు బాహ్య మైన వాటిపై ఆధారపడరు. ఈ మానసిక స్థితి లో వారి అన్ని పనులు అకర్మగా పరిగ ణించ బడతాయి అన్న ది పై శ్లోకం భావం.
సాధకుడు ప్రతి కర్మ పరమాత్మ ప్రీతి కోసమే ఆచరించినప్పుడు ఆ భావన కర్మబం ధం నుండి విడుదల చేస్తుంది. పరమాత్మ యందు ప్రేమ భావన కర్మ ఫలాల పట్ల ఆకర్ష ణను సైతం తొలగిస్తుంది. సర్వశ్య శరణాగతి భావం వలన స్వీయ పోషణ కోసం ఎలాంటి చింత మనసులో వుండదు. ఇచ్చేది, పుచ్చుకునేది అంతా పరమాత్మయే అన్న దృఢ భావం వలన పూర్ణ సంతృప్తితో జీవిస్తూ లేనివి పొందాలన్న ఆరాటం కాని, ఉన్న వాటిని రక్షించు కోవాలన్న ఆరాటం కాని వుండవు. తన స్వధర్మాలను చిత్తశుద్ధితో తన శక్త్యానుసారం నిర్వ హస్తూ ఫలితాలను పరమాత్మ పాదాలకే అర్పణం చేస్తాడు. ఇటువంటి స్థితే అకర్మకు లేదా విషయ ఫలరహతమైన కర్మకు చిహ్నంగా వుంటుందని శ్రీకృష్ణప రమాత్మ పై శ్లోకం ద్వారా మానవాళికి తెలియజేసారు.