Saturday, November 23, 2024

ధర్మం – మర్మం (ఆడియోతో..)

గంగా జలము మర ్త్యలోకమునకు చేరు విధానం – బ్రహ్మ కడిగిన పాదం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

శ్రీమహావిష్ణువు త్రివిక్రమ రూపం పెంచి తన రెండో పాదాన్ని పై లోకాలకు పంపగా బ్రహ్మ సంతసించి శంకరుడు ఇచ్చిన కమండల జలంతో తన తండ్రి పాదాన్ని కడిగెను. వరేణ్యుడు, వరదుడు, శాంతుడు, శుభస్వరూపుడు, భుక్తిముక్తిప్రదాయకులు లోకాలకు మాతాపితృరూపుడు, ఔషధ రూపుడు, పవిత్రుడు, పావనడు అయిన పరమాత్మను స్మరిస్తేనే సకల పాపాలు తొలగుతాయని, తనకు దర్శన భాగ్యం లభించునందు వలన కమండల జలంతో బ్రహ్మ అర్ఘ్యము ఇచ్చి పాదములను కడిగెను. పరమాత్మ పాదములు కడిగిన ఆ జలము పరమపావనమని తలచి భక్తితో శంకరుడు శిరమున ధరించెను. శిరమున ధరించిన జలమును సకల లోక వాసులకు పాపమును తొలగించి పవిత్రత చేకూర్చుటకు శంకరుడు మేరు పర్వతమునందు ఆ జలమును విడిచెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement