Saturday, November 23, 2024

ధర్మం – మర్మం (ఆడియోతో..)

గంగాజలము మర్త్యలోకమునకు చేరు విధానం – బలిచక్రవర్తి యజ్ఞానికి వామనుడు విచ్చేసిన సంద ర్భమున జరిగిన వృత్తాంతం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

బలి చక్రవర్తి కనివిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్న యజ్ఞమునకు సామగానము చేస్తూ, ఛత్రము, కుండలములు, దండము, పాదుకలు, కృష్ణాజినము (జింకచర్మము) ధరించి కొత్త వటువుగా పరిపూర్ణ బ్రహ్మచారిగా వామనుడు యజ్ఞప్రాంగణానికి వేంచేసెను. జరుగుతున్న యజ్ఞమును ప్రశంసిస్తున్న వామనుడిని చూసిన శుక్రాచార్యుడు తన దివ్యదృష్టితో వచ్చినవాడు దైత్యాంతకుడు, యజ్ఞమును, తపస్సును ప్రసాదించువాడు, రాక్షసులను వధించువాడని గ్రహించెను. శుక్రాచార్యుడు బలితో మహాబలశాలుడవు, క్షాత్రధర్మంతో మూడు లోకాలను గెలిచినవాడవు, యజ్ఞపురుషుడిని ధ్యానం చేస్తూ హవిస్సును అర్పిస్తున్నవాడవు, ఇప్పుడు ఆ యజ్ఞపురుషుడే వామన రూపంలో బ్రాహ్మణుడిగా వచ్చెను. సాక్షాత్తు యజ్ఞేశుడు, యజ్ఞభావనుడు, పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువు రూపమైన వామనుడు అడిగినదేదైనా ఇస్తానని తొందరపడి ప్రమాణం చేయవద్దని బోధించెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement