Saturday, November 23, 2024

కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం

60 కేజీల వెండితో మకరతోరణం ఆవిష్కరణ
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాల సమర్పణ

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: విశాఖనగరంలోని బురుజుపేటలో కొలువున్న సిరిలొలి కించే శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. కార్యక్ర మాలకు విశాఖశార దాపీఠం ఉత్తరా ధికారి స్వాత్మానం దేంద్రస్వా మి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణష్‌కుమార్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను ప్రారం భించారు. ఇక ప్రతీరోజు ఉదయం వేద పారాయణం, సప్తశతీ పారా యణ, లక్ష్మీహోమం, త్రికాలా ర్చన నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా సిఎంఆర్‌ గ్రూప్‌ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ, ఇతర దాతలు సమకూర్చిన సుమారు 60 కేజీల వెండి మకరతోరణాన్ని అమ్మవారికి విశాఖ శారదాపీ ఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి చేతులు మీదుగా ఆవిష్క రించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్‌కు వెండి మకర తోరణాన్ని అమర్చి దాతలకు, భక్తులకు అమ్మ వారి దర్శనభాగ్యం కల్పించారు. మార్గశిర మాసోత్స వాలు ప్రారంభం సందర్భంగా తిరు మల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. అక్కడ నుంచి వచ్చిన తితిదే ప్రతినిధులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఇవో జ్యోతి మాధవి, ఏఇఓలు వి.రాంబాబు, పి.రామా రావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సిహెచ్‌ వెంకటరమణ, సహాయ ఇంజనీరు కె.ఎస్‌.ఎన్‌.మూర్తి, పర్యవేక్షకులు రాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement