Tuesday, November 19, 2024

కనకదుర్గమ్మ నేటి అలంకారంశ్రీగాయత్రీదేవి

ముక్తా విద్రుడు హేమ నీల
ధవళచ్ఛాయై ర్ముఖై ప్రేక్షణౖ:
యుక్తా మిందునిబద్ధరత్న మకుటాం తత్వార్ధ వర్ణాత్మికామ్‌,
గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మదారవింద యుగళం హసైర్వహంతీంభజే

శరన్నవరాత్రి మహోత్సవములలో మూడవరోజు శ్రీ కనక దుర్గమ్మవారు శ్రీగాయత్రీదేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్తా, విద్రుమ, హేమనీల, దవళవర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుచున్న ది. సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రీ మంత్రంతో అనుబంధం వుంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదన చేయబడతాయి. గాయత్రీమాతను పూజించడంవల్ల ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతను వేదమాతగా కొలుస్తూ, గాయత్రీ మాతను దర్శించడంవలన సకల మంత్రసిద్ధి ఫలాన్ని పొందు తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement