Saturday, November 23, 2024

కమనీయం… అప్పన్న నిత్యకళ్యాణం

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో; సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీ నృసిం హస్వామి ఆలయంలో సోమవారం సింహాద్రినాధుడి నిత్యకళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహిం చారు. స్వామి ఆర్జిత సేవలో భాగం గా తెల్లవారు జామునే సింహాద్రినా ధుడిని సుప్రభాతసే వతో మేల్కొలిపి ఆరాధన గావిం చారు. అనం తరం గంగధార నుంచి తీసుకువ చ్చిన పవిత్ర జలాలుతో అభిషేకం నిర్వహించారు. తదుపరి భక్తులు గోత్ర నామాలుతో సంకల్పం చెప్పి పాంచ రాత్రాగమశాస్త్రం ప్రకారం విశ్వక్షేనారాధన, పుణ్యహవచనా లుతో కార్యక్రమా నికి శ్రీకారం చుట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను సర్వాభరణాలతో అందంగా అలంకరించి మాంగళ్యదారణ, తలంబ్రాల ప్రక్రియను వైభవోపేతంగా జరిపించారు. అ సింహాద్రినాధుడి ఆలయంలో ప్రస్తుతం 8 రకాల ఆర్జిత సేవలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యక్షంగా భక్తులు పాల్గొనడంతో పాటు పరోక్ష పద్దతిలోనూ భక్తులు ఆయా పూజాది కార్యక్రమాల్లో భాగస్వాములు కావచ్చని ఆలయ వర్గాలు తెలిపాయి. ఇటీవల కాలంలో సింహాద్రినాధుడి ఆలయానికి భక్తులు తాకిడి భారీగా పెరిగింది. అందుకు తగ్గట్లుగానే ఆయా విభాగాల నుంచి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement