వశిష్ఠ మహర్షి శాపం వలన సుదాసుడు రాక్షస రూపాన్ని పొందాడు. వశిష్ఠుని కూడా శపించాలని సుదాసుడు దోసిట నీరు తీసు కొనగా సుదాసుడి భార్య మదయంతి భర్త ను వారించింది. అప్పుడు సుదాసుడు ఆ నీటిని తన పాదాలపై జల్లుకుంటాడు. అందువలన సుదా సుడు ‘కల్మషపాదుడు’ అని పిలువబడ్డాడు. రాక్షస రూపం ధరించిన కల్మషపాదుడు అడవిలో తిరుగుతూ ఆకలి బాధతో ఒక బ్రాహ్మణుని పట్టి భక్షించాడు. ఆ బ్రాహ్మణుని భార్య కోపించి నీవు స్త్రీ సాం గత్యానికి సిద్ధపడ్డప్పుడు మరణిస్తావు అని శపించి, భర్తతో కలిసి అగ్నిలో ప్రవేశించింది. ఒకసారి కల్మషపాదుడు భార్య సంగమాన్ని కోరగా ఆమె శాపా న్ని గుర్తుచేస్తుంది. అందువల్ల సంతానం కలగలేదు. వశిష్ఠుని దయ తో, సుదాసుని కోరిక మేరకు మదయంతికి గర్భం ప్రసాదించా డు. అయితే ఆమె గర్భాన్ని ఏడు సంవత్సరాలు ధరించి ప్రస వించటానికి కష్టపడుచుండగా మహర్షి ఆమె గర్భాన్ని ఒక పదునైన రాజితో చీల్చాడు. ఆమెకు ‘అశ్మకుడు’ అ నే ఒక కొడుకు పుట్టాడు. (అశ్మకము అంటే రా యి) అశ్మకుని కొడుకు ‘మూలకుడు’ అనేవాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement