Thursday, November 21, 2024

కలి ప్రవేశం-ప్రభావం-పరిష్కారం!

కలియుగంలో కలి పురుషుడు ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. కలియు గంలో కలి పురుషుని ప్రభావంవల్ల దేవతలకు హవిస్సులందవు. వేదము అవ మానింపబడుతుంది. పితృదేవతలకు శ్రాద్ధం పెట్టరు. ధర్మం, భూమాత, గోమాత అవమానింపబడతాయి. అసలు ఈ కలి పురుషుడు ఎలా వచ్చాడు? అంటే- ద్వాపరయు గంలో అన్న చెల్లెళ్లకు పుట్టినవాడే కలిపురుషుడు. ఇతని కాలాన్నే కలియుగం అం టాము. ప్రస్తుతం మనం నివసించేది కలియుగం. ఈ యుగం మిగతా యుగాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ యుగం అయిపోయాక సృష్టి అంతమైపోయి తిరిగి యుగాలు ప్రారంభమవుతాయి. కలి ప్రభావంవల్ల మనుషులలో నీతి నిజాయితీ ఉండదు. దాన ధర్మాలు ఉండవు. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్కాచెల్లెళ్లు, అనే అనుబంధాలు తగ్గిపోతాయి. చివరికి కలి వైపరీత్యంతో ఆకలి చావులు వచ్చి యుగం అంతమైపోతుంది.

పరీక్షిత్తు మహారాజు -ఎద్దు (ధర్మ దేవత)

ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్తు మహారాజు దేశంలో ఒకరోజు గోమాత ఏడుపు వినిపించింది. ఆయన పాలనలో బాధతో ఉండేవారు ఎవరూ వుండరు. అందు కని మహారాజు ఆ గోమాత దగ్గరకి వెళ్ళాడు. ఆ గోమాత.. ఎద్దుకు మూడు కాళ్ళు విరిగి పోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయమ చెప్పింది. ఎద్దు (ధర్మ దేవత)కు ఏమైందని రాజు అడుగగా, ఎద్దు కాలి ద్వారా కలి ఈ యుగంలోకి ప్రవేశించాడని, అతను తన కాళ్ళను నిర్దాక్షిణ్యంగా విరిచేడని చెప్పింది.అప్పుడు పరీక్షిత్‌ మహారాజు ఎద్దుతో, ”ఎవరికీ అవస రంలేని గడ్డి తిని, మనుషులు తాగలేని నీటిని తాగే నిన్ను ఎవరు హంసించారు. ఎవరికీ అపకారం చేయని నీ కాళ్లు ఎవరు విరగ్గొట్టారు” అని అంటాడు. ఎద్దు కాలు విరగొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు పరీక్షిత్‌ మహారాజు.
”కాలక్రోధావేశుడై, రాజులా కనిపించే కఠినాత్ముడు, కర్ర పట్టుకుని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొడుతున్నాడు. నా కాళ్లు అతడే విరగ్గొట్టాడు” అని జవాబిచ్చిం ది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్‌ రాజుకు తెలిసింది.దాంతో పరీక్షిత్‌ మహారాజు కలికి శిక్ష విధిస్తాడు. అప్పుడు కలి ”ఇది కలియుగం కాబట్టి నేను కచ్చితంగా భూమిపైకి రావాల్సిందే. ఇది వదిలి నేనెక్కడుండాలి? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపు తానంటే ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటాన”న్నాడు కలి. జూదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహంస జరిగే చోటు అనే నాలుగు స్థానాలను ఇస్తానన్నాడు పరీక్షిత్తు. తన పాలనలో ఉన్న ప్రజలు ఈ నాలుగు చోట్లకి వెళ్లరనే గట్టి నమ్మ కంతో అలా అనుగ్రహంచాడాయన.
పరీక్షిత్‌ మహారాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామము, హం స నుంచి కోపం, క్రౌర్యం.. ఇలా మరో నాలుగు స్థానాలను కూడా ఆక్రమించాడు కలి. ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని బంగారం ఉన్న చోటు కూడా నీదేనన్నాడు. అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూ డా తనది చేసుకున్నాడు కలి పురుషుడు. మొత్తానికి తొమ్మిది స్థానాల్లో కలి ఉంటాడు.
పరీక్షిత్తు మహారాజుపై కలి ప్రభావం

పరీక్షిత్‌ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి, బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు. పరీక్షిత్‌ మహారాజు ఒంటినిండా బంగారం ఉండడంతో ఆయనలోకే ప్రవేశించగలిగాడు. ఆ ప్రభావంతో క్రూరమృగాల బాధ తప్పించడానికి మాత్రమే వేటాడే రాజు హంసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలనిపించింది. జీవహంస కూడా ఉండడంతో కలి ప్రభావం మరింత పెరిగింది. అప్పుడే దాహంతో శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్లడం, తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగ తాళి చేయడం జరుగుతుంది. శమీక మహర్షి కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు. ఇంటికి వెళ్లి కిరీటం, ఆభరణాలు తీసి పక్క న పెట్టగానే కలి ప్రభావం నశించి పశ్చాత్తాపం కలుగుతుంది. అలా కలిని నియంత్రిం చగలిగిన పరీక్షిత్తు కూడా తానే అతడి ప్రభావానికిలోనై మరణాన్ని కొనితెచ్చుకుంటాడు.

నల దమయంతులపై కలి ప్రభావం

- Advertisement -

నల- దమయంతుల స్వయంవరం. దమయంతి స్వయంవరం ముగిసి, నల మహా రాజును ఆమె వరించిన తరువాత అదే స్వయంవరానికి వచ్చిన అష్టదిక్పాలకులు తిరిగి వెళ్లేప్పుడు కలి పురుషుడు ఎదురవుతాడు. దమయంతిని వివాహమాడడానికి వెళ్తున్నా నంటాడు. ఇంకెక్కడి వివాహం. స్వయంవరం ముగిసింది. ఆమె నలుని వరించిందని చెబుతారు దిక్పాలకులు. ఇది తెలిసి కలిపురుషుడు నలమహారాజుపై క్రోధంతో వాళ్లెలా సుఖంగా ఉంటారో చూస్తానని ప్రతినబూనుతాడు. కాని ధర్మబద్ధుడై, నిరంతరం దైవ చింతన కలిగి, అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకునే నలమహారాజు దగ్గరికి కలి పురు షుడు వెళ్లలేకపోతాడు. కాని ఒకరోజు దురదృష్టవశాత్తు మూత్ర విసర్జన అనంతరం కాళ్లు సరిగా కడుక్కోక హడావుడిగా వెళ్లిన నలుడిలోకి ప్రవేశించగలుగుతాడు కలి. దాంతో అంతటి నలమహారాజు కూడా ధర్మం తప్పుతాడు. మనసుపై నియంత్రణ కోల్పోతా డు. దాయాదులతో జూదమాడి రాజ్యం, సర్వ సంపదలన్నీ కోల్పోతాడు. భా ర్య దమ యంతి ఎంత చెప్పినా వినిపించుకోడు. వెంటనే ఆమె సారథిని పిల్చి, పిల్లలిద్ద రినీ పుట్టింటికి పంపించివేస్తుంది. రాజ్యం దాయాదులకు అప్పగించి, నలదమయంతు లిద్దరూ అరణ్యాలకు బయల్దేరుతారు. ఆకలిదప్పులతో బాధపడతారు.తను లేకుంటే భార్య సుఖ పడుతుందని భావించిన నలుడు ఆమెను అక్కడే వదిలి వెళ్లిపోతాడు.

కలి నుండి ఎలా తప్పించుకోగలం?

కలి కాలంలో కలి ఎలాగైనా వెంటాడి తీరతాడు. ఈ యుగంలో ధర్మ అడుగంటి ఉంటుంది కావున ఎవరికైనా చిన్న సాయం చేసిన కలి నుండి కొంత తప్పుతుంది. మన స్ఫూర్తిగా రోజుకు ఒక్కసారైనా దైవ స్మరణ, దాన ధర్మాలు చేయడం. పెద్దల శ్రాద్ధ కర్మ లు మర్చిపోకుండా చేయడం, నోరు లేని జీవాలను ఆదరించడం. కాశీకి వెళ్లినట్టు మన సులో తలచుకొన్న చాలు కలి నుండి మనం కొంత తప్పించుకుంటాం. దైవ సంబంధ మైన చర్చల్లో భజనలలో, పాల్గొన్నా చాలు. కలి పురుషునికి దూరంగా ఉండవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement