నేడు కాలభైరవాష్టమి
త్రిగుణాత్మకమైన ఈ సృష్టిలో అహంకారము అనునది ఒక భాగము. త్రిమూర్తులను కూడా లోబరుచుకొను నది. ఒకానొక సమయమున దేవగణమంతా సృష్టికర్త బ్రహ్మ ను సమీపించి పరబ్రహ్మ తత్త్వమును గురించి మరింత వివ రించవలసినదని కోరారు. అదే సమయమున శివమాయ ఆవహించిన బ్రహ్మ ”నేనే పరమాత్మను” అని అహంకారపూ రితముగా తన వచనములు మొదలుపెట్టసాగాడు. అక్కడ విష్ణువు కూడా నిలిచియున్నాడు. బ్రహ్మ పల్కిన పల్కులు వింటూ అహంకారపూరితుడైన బ్రహ్మను చూసి ”ఓ! పద్మ నాభ జనితుడా! నీ జనకుడనైన నేను ఇక్కడ ఉన్నానన్న సంగ తి మరచి మాట్లాడుతున్నావు” అంటూ ఇరువురూ వాదులాడ సాగారు. ”అసలు సృష్టి కార్యమునకు నిన్ను పురికొల్పినది నేను కాదా! అందువలన నేనే పరబ్రహ్మమును, పరమాత్మను నీవు నీ పరిధిని దాటి మాటలాడుచున్నావు” అంటూ ఈవిధంగా దైవాత్మక ఘర్షణ మొదలయినది. దేవగణమంతా అత్యంత ఆసక్తిగా వీక్షించసాగారు. వారి మధ్యనుం డి శబ్దజ్యోతి మయమైన ఒక జ్యోతికిరణ పుంజము మహోజ్వలంగా వెలువడి బ్రహ్మాండమంతా వ్యా పించసాగింది.
ఆ జ్వాలాపూరిత ఆవరణ నుండి త్రిశూలధారి యైన శివపరమాత్మ రుద్రుడై ఆవిర్భవించాడు. ఆ రూపమును చూచి బ్రహ్మ అపహాస్యం చేస్తూ ”ఎవ రివి నువ్వు అని భావిస్తున్నావా? నా భృటి భాగము నుండి ఇప్పుడే జనించిన నీవు ఎందుకు అంత శబ్దము చేస్తావు. పితృసమానుడైన నన్ను ధ్యానిం చుకొని ప్రార్థన చేయి నీ బాగోగులు నేను చూసుకుం టాను” అని గర్వంగా సెలవిచ్చాడు. బ్రహ్మ యొక్క అహంకారిక వచనాలకు రుద్రుడు కోపముగా ఒక మహాపురుషుణ్ణి సృష్టించాడు. ఆ రూపమే ”భైరవు డు”. తమ ఆజ్ఞ అంటూ అతి భయంకారాకారంతో ప్రకంపనలు సృష్టించసాగాడు. అంత శివదేవుడు ”ఓ కాల పురుషా! నీవు ఇకనుండి కాలభైరవునిగా నిలుస్తావు. అహంకార పూరితులను మర్థిస్తావు. ముందు ఈ బ్రహ్మను శిక్షించు, చెడు పట్ల నీవు ఏ మాత్రము అపేక్ష చూపించవద్దు, అమర్ధకుడవై బ్రహ్మను మర్థించు. పాపాత్ములను భక్షించి పాపాభ క్షకుడవై నిలువు” అంటూ రుద్రుడు ఆజ్ఞాపించాడు. వెంటనే అహంకార పూరితమైన పల్కులు పలికిన బ్రహ్మ యొక్క శిరస్సును తన వ్రేలిగోటితో ఖండించాడు కాలభైరవు డు. అంత రుద్రుడు ”ఓ పాప భక్షకా! సృష్టికర్త దైవస్వరూపు డైనా దోషకారకుడే! మంచిపని చేసావు! ఇకనుంచి పాపపరి హార్థమై వారణాశికి వచ్చు దేవతలు, మానవులు, యక్షకిన్నెర కింపురుషాదులు ఎవరైనా సరే పాపపరిహారము చేసుకొని తిరిగి పశ్చాతాపమునొందక నుందురో వారిని తగిన రీతిన శిక్షించుమని” రుద్రుడు కాలభైరవుని ఆజ్ఞాపించాడు.
ఎప్పుడైతే అహంకార పూరితమైన శిరస్సును ఖండించా డో పద్మగర్భుడికి కనువిప్పు కలిగింది. తన స్థితి ఏమిటో తెలిసివచ్చింది. తన విద్యుక్త ధర్మమైన సృష్టికార్యము జ్ఞప్తికి వచ్చినది. అహంకారం తొలగిపోయింది. విష్ణుపాదములకు నమస్కరించి తన తప్పు మన్నించమని కన్నులతోనే అర్చిం చాడు. ఇరువురు కలసి పరమశివుని, పశుపతిని, పార్వతీపతి ని, రుద్రమూర్తిని తమను కరుణించి తమ ప్రక్కన నిలబడి త్రిమూర్తి పీఠమును పరిపూర్ణము చేయుమని ప్రార్థించారు. భోళాశంకరుడు తన రుద్రములోని రౌద్రమును ఉపసంహ రించి అపరిమిత దయతో ద్విమూర్తులైన బ్రహ్మ, విష్ణువుల ప్రక్కన నిలబడి త్రిమూర్తులైనారు. వెంటనే కాలభైరవుడు కూ డా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు మ్రొక్కి స్తుతించాడు. అప్ప టికే బ్రహ్మ ఐదవ తల కపాల రూపమై కాలభైరవుని హస్తము నకు అలంకారమైనది. కపాలధారియైన అమర్ధకుడు లోక సంచారం చేస్తూ బ్రహ్మ హత్యా పాతకాన్ని తొలగించు కపాల వ్రతాన్ని బోధించసాగాడు. రుద్రుడు ”బ్రహ్మహత్య” అను కన్యను సృష్టించి వారణాశి అయిన కాశీకి క్షేత్రపాలకునిగా కాలభైరవుని నియమించి ఇరువురుని కాశీకి పంపించాడు.
బ్రహ్మ కపాలాన్ని కాలభైరవుడు లోకాలు సంచరిస్తూ కాశీకి పయనమయ్యాడు. అతని వెంట ”బ్రహ్మహత్య” కన్య గా వెంబడించ సాగింది. ముందు వైకుంఠమునకు వెళ్ళగా విష్ణువు తన వైష్ణవ మండలితో స్వాగత సత్కారాలు అందిం చాడు. అద్వితీయమైన అతిధి మర్యాదలు చేసాడు. శ్రీ మహాల క్ష్మి రత్నమయ భూషిత సువర్ణ ఖచితమైన మనోరథపతి అను ఉన్నత భిక్ష తెచ్చి బ్రహ్మ కపాల భిక్ష పాత్రలో వేసింది. అంత కాలభైరవుడు విష్ణుమూర్తికి వరమునిచ్చాడు. అంత విష్ణు మూర్తి కాలభైరవుని యందు భక్తి చెదరక యుండునట్లు వరం కోరాడు. తథాస్తు పలికిన భైరవుడు సర్వులకు నీవు వరదాన ము చేయుదవని పలికి అచట నుండి ముందుకు కదిలాడు. ఆ విధంగా లోకములన్నీ పర్యటించి కాశీకి చేరాడు కాలభైరవుడు. పరమ పవిత్రమైన కాశీక్షేత్రములో అడుగిడగానే వెన్నంటి వస్తున్న బ్రహ్మహత్య తన కన్యారూపములో హాహాకార ములు చేస్తూ తన దోషమును ఇక ఏ మాత్రము కాలభైరవునిపై మోపలేక పాతాళానికి పారిపో యింది. కాలభైరవుని చేతిలోని బ్రహ్మకపాలం క్రిందపడి కపాల తీర్థంగా కాశీక్షేత్రములో స్థిర పడిపోయింది. ఎవరైతే ఆ తీర్థాన్ని దర్శించి స్నా నమాచరిస్తారో వారి హృదయం పశ్చాత్తాపం తో నిండిపోయి పాపాలు తొలగిపోయి పునీతమ వుతున్నారు.
కాలభైరవునికి మార్గశిర శుద్ధ అష్టమీ తిథి నాడు పరమశివుడు రుద్రుడై జన్మనిచ్చాడు. ప్రతి సంవత్సరం ఎవరైతే ఆరోజు ఉపవసించి కాలభైరవ తీర్థంలో సభక్తి పూర్వకంగా జాగరణ చేస్తారో వారి పాపాలన్నీ పరిహరించి ముక్తిని ప్రసాదిస్తాడు కాలభైరవుడు. కాశీలో నివసించు అదృష్టవంతులు మాత్రం నిత్యం కాలభైరవుని దర్శనం చేసుకుంటే బ్రహ్మలోక ప్రాప్తి కలుగు తుందని వేదవాక్యం. అష్టమి, చతుర్దశి, మంగళ వారం మొదలగు దినములలో దర్శనం చేసు కొనుట పరమ పావనమైనది.
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం
నారదాది యోగివృంద వందితం దిగంబరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే
ఇంద్రాది సర్వదేవతలచే సేవించబడే ఓ కాలభైరవా! నీకి దే అంజలి. సకల యజ్ఞయాగాదులకు రక్షణ కల్పించుమని కోరిన వారికి ఎల్లవేళలా నీ కృపను చూపించు. నారదుడు మొదలైన దేవ ఋషులందరూ కొలిచే ఓ! దిగంబరా! కాశికా పురిని క్షేత్ర పాలన చేయుచున్న నీకిదే మా భజనలు అందించు చున్నాము.
భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం
కాశివాస లోక పుణ్యపాపశోధకం విభుం
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే
కాశీపురమును పాలించుచున్న ఓ! కాలభైరవా! రుద్రగ ణములకు నాయకుడవై కాశీవాసము చేయువారిని, దర్శిం చిన వారి పుణ్యపాపములను నిరంతరం ప్రక్షాలన చేయుచూ క్షేత్రములోని విశ్వేశ్వరుని దర్శించి గంగాస్నానము చేసినవా రికి సన్మార్గమును బోధించుచున్న ఓ సనాతన కాలభైరవా! నా భజన చేసి పావనులమగుచున్నాము. జైజై శంకర.
కాలస్వరూపుడు భైరవుడు
Advertisement
తాజా వార్తలు
Advertisement