Tuesday, November 26, 2024

కావ్యమాత – ఉశన

మాతా మాతామహ గుర్వీపితృమాతృష్వస్రాదయ:
శ్వశ్రూ: పితామహ జ్యేష్ఠాజ్ఞాతవ్యా గురప:స్త్రియ:(ఉశన: 1-26)

తల్లి, మాతామహ, గురుభార్య, తలిదండ్రుల యక్క చెల్లెండ్రు, అత్తగారు, నాయనమ్మ, అక్క- అను స్త్రీలు గురువులు. గురుభార్య గురువు వలెనే పూజ్యురాలు.

గురువత్ప్రతిపూజ్యాశ్చ సవర్ణాగురుయోషిత:
అసవర్ణాస్తు సంపూజ్యా: ప్రత్యుత్థానాభివాదనై:(ఉశన: 2- 27)

సవర్ణలైన గురుభార్యలు గురువు వలెనే పూజింప తగినవారు. అనవర్ణలన్ననో యెదురేగుట నమస్కరించుట మున్నగు వానిచే పూజింప తగినవారు.
గురువునకు వలెనే గురుపత్నులకు గూడ పాదములను బట్టి నమస్కరింప వలెను. కాని ¸°వనములో నున్న గురుపత్ని యొక్క పాదములను తాకకుండా భూ మి మీదనే యభివాదము చేయవలెను. అని ఉశన స్మృతి చెబుతుంది.
శుక్ల యజుస్సంహతలు దర్శించిన వారిలో బ్రహ్మవాదినులయిన స్త్రీలు కూడా ఉన్నారు. ఇది స్త్రీలకు వేదాలలో గల ఉన్నత స్థానానికి గుర్తుగా చెప్పవచ్చు. వారిలో ఒకరు ఉశన. ఉశన భృగువు భార్య. ఈమెని కావ్యమాత అని కూడా పిలుస్తారు.
కావ్యమాత రాక్షస గురువైన శుక్రాచార్యుడు తల్లి. ఈమెకు అద్భుతమైన శక్తులు న్నాయి. ఒకసారి దేవాసురులకు యుద్ధం జరుగగా అసురులు ఓడిపోయి శుక్రాచా ర్యుని సహాయం కోరతారు. వారి హతము కోరి అతడు హమాలయాలకు వెళ్లి తలను నేలపై నిలిపి అధోముఖంగా తపస్సు చేస్తుండగా, అదే సమయంలో దేవతలు రాక్షసు లపై మరల దండెత్తగా వారు కావ్యమాతను ఆశ్రయించారు.
ఆవిడ అభయం ఇచ్చింది. భయపడకండి, నా సన్నిధిలో అస్సలు భయపడకం డి అంది. రాక్షసులు హమ్మయ్య అనుకున్నారు. తరుముతూ వెన్నంటి వచ్చిన దేవత లు ఆశ్రమం అనైనా చూడకుండా, కావ్యమాత భృగు పత్ని వారిస్తున్నా వినకుండా రాక్షసులను వెంటపడి పొడిచి చాలా మందిని చంపారు. ఈ దారుణాన్ని ఎలా ఆపాలి అని ఆలోచించిన కావ్యమాత తన తపశ్శక్తితో ఇంద్రుడితో సహా ఆ దేవతలనందరిని నిద్రా వివశుల్ని చేసింది. క్షణంలో అందరూ చేష్టలుడిగి నిద్రపోయారు.
ఇంద్రుడు కూడా దీనుడై నిద్రాధీనుడు కాబోతున్న తరుణంలో విష్ణుమూర్తి వచ్చి అతడిని తనలో ప్రవేశింపచేసుకుని రక్షించాడు. ఇది చూసి భృగు పత్నికి కోపం వచ్చింది. చూడండి నా తపశ్శకి ్త అంటూ ఇద్దరినీ కలిపి నిద్రావశుల్ని చేసింది. ఇద్దరూ స్తబ్దులయ్యారు. ఆకాశంలో నిలబడి అన్నీ చూస్తున్న దేవతలు హాహాకారాలు చేశారు.
మహావిష్ణూ! ఏమిటి ఆలోచన? ఎందుకు ఇంకా ఆలస్యం? స్త్రీ అని శంకించకు. ఈ దురహంకారిని సంహరించు. లేదంటే మనలనే సంహరిస్తుంది. అని దేవేంద్రుడు ప్రేరేపించాడు. విష్ణుమూర్తి చక్రాయుధాన్ని స్మరించాడు. ప్రయోగించాడు. భృగు ప త్ని శిరస్సు తెగిపడింది. దేవతలు జయజయ ధ్వానాలు చేశారు. అందరూ నిద్ర నుం చి విముక్తులయ్యారు. ఇంద్రా విష్ణువులకు సంబరంగానే వుంది కానీ, భృగు మహర్షి వచ్చి శపిస్తాడనే శంక కూడా వుంది.
భార్య మరణించిన వార్త భృగువుకి తెలిసింది. సత్వగుణ సంపన్నుడైన విష్ణువుకు ఇంతటి తామసం. ఇంతటి అకృత్యం ఎలా చెయ్యగలిగాడా అని ఆశ్చర్యపోయాడు. స్రీ ్తఅని చూడకుండా, బ్రాహ్మణ వంశంలో పుట్టింది అని గమనించకుండా, నిరపరా ధిని అని గమనించకుండా, నా భార్యను సంహరించాడు కనక, నన్ను విధురుణ్ణి చేశా డు కనుక విష్ణుమూర్తిని శపించాలని అనుకున్నాడు. ప్రేరేపణ ఇంద్రుడిదే అయినా పాపం చేసినవాడు విష్ణువే కనుక అతడినే శపించాలని నిర్ణయించుకున్నాడు.
మధుసూదనా! నువ్వు మోసగాడివి. నా ఇల్లాలిని అకారణంగా సంహరించి నా కు గుండెలలో చిచ్చుని రగిల్చావు కనక నువ్వు మర్త్యలోకంలో పదే పదే జన్మిస్తూ గర్బ éవాస దు:ఖాన్ని అనుభవింతువు గాక! అని శపించాడు. ఆవిధంగా భృగువు ఇచ్చిన శాపం కారణంగా విష్ణుమూర్తి అనేకావతారాలు ఎత్తవలసి వచ్చిం ది. భూలోకంలో ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా హరి అవతరించి అధ ర్మాన్ని తొలగించి ధర్మాన్ని పున:ప్రతిష్ఠితం చేస్తూ వుంటాడు.
భృగు మహర్షి విష్ణుమూర్తిని అలా శపించి తన భార్య శిరస్సును త్వ రగా తచ్చి మొండేనికి అతికించాడు. ”దేవీ! విష్ణువు నిన్ను నేను బతి కించుకుంటాను. ఇది నా ప్రతిజ్ఞ. నేను ధర్మం తప్పనివాడినైతే, శీలసం పన్నుడినైతే, ఆడి తప్పనివాడినైతే నా భార్య జీవించుగాక! నాతేజశ్శక్తిని దేవతలంతా గ్రహంతురు గాక! అంటూ శీతలోదకాలను చిలకరించాడు. మరుక్షణంలో ఆ తపస్విని నిద్ర నుంచి లేచినట్లు చిరునవ్వులతో నిలబడిం ది. సృష్టి అంతా సంతోషించింది. సాధు సాధు నినాదానాలతో దంపతులను అభినందించింది, భార్య పట్ల భృగు మహర్షికి వున్న ప్రేమకూ, తపశ్శక్తికి అందరూ ఆనందాశ్చర్యాలను ప్రకటించారు.
ఈ కథ సంతాన ధర్మానికి చెందిన స్త్రీల ఆధ్యాత్మిక శక్తి స్థాయికి సూచన. స్త్రీల శకి ్తఎంత ఉందో, విష్ణువు తల్లి మాటలను పట్టించుకోలేదు. అతను భూమిపై అనేక అవతారాలను తీసుకున్నాడు. కావ్యమాత కథ దేవీ భాగవతం, 4వ స్కంధంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement