అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా శ్రీరామలక్ష్మణులను ఉదహరిం చడం పరిపాటి. అసలు లక్ష్మణ శతృఘ్నులు కవలలు. అయితే భరత శతృఘ్నులు ఒకటిగా కలసిమెలసి కాలం గడిపారు. శ్రీ రామాయణంలో శతృఘ్నుని చరిత్ర స్వల్పమైనా ఘనమైనది. భరతుని ఆజ్ఞలను శిరసావహిం చాడు. అసురసంహారానికి అవతరించిన శ్రీమహావిఫ్ణువు పాంచజన్య శంఖము అంశ అని కూడా అంటారు. ఆవేశము ఎక్కువ గల శతృఘ్నుడు శ్రీరాముని వనవా సమునకు అసలు కారణము మంథర అని తెలుసుకొని ఆమెను వధించుటకు ఈడ్చుకు వచ్చాడు. చివరకు భరతుని మాటలతో శాంతపడి విడిచిపెట్టాడు. శ్రీరామచంద్రుని వనవాసము నుండి తీసుకువచ్చుటకు భరతుని కూడి చిత్రకూ టమునకు వెళ్ళాడు. కవలలైనందున లక్ష్మణునికి ఆవేశము, ఆగ్రహము శతృఘ్ను నకు వచ్చినదని గమనించవచ్చు.
పాదుకలను పూజిస్తూ నందిగ్రామమున భరతుడు ఉన్నంతకాలము అయో ధ్య శతృఘ్నుని రక్షణలో ఉంది. భరతుని ఆజ్ఞానుసారము విషములను చక్కబరి చేవాడు. శృతకీర్తిని వివాహం చేసుకున్న శతృఘ్నునకు సుబాహు, శత్రుఘాతి అను కుమారులు కలరు.
శ్రీరామచంద్రుడు సీతా పరివార సమేతంగా వచ్చుచున్నాడని హనుమ ద్వారా తెలుసుకున్న భరతుడు అయోధ్యలోనున్న శతృఘ్నుని ఘనమైన స్వాగత ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించెను. రావణ సంహారము గావించి పుష్పక విమా నములో వచ్చుచున్న శ్రీరామచంద్రుని ఆగమన వార్త శతృఘ్నుని పరమానంద భరితుణ్ణి చేసింది. వెంటనే అయోధ్యను సర్వసుందరంగా అలంకరింపచేసాడు. రాజమార్గములు, చిన్నచిన్న త్రోవలు కూడా సరిచేయించాడు. సప్తవర్ణమయం గా అయోధ్య నగరాన్ని క్షణాలలో తీర్చిదిద్దాడు. మితభాషి అయిన శతృఘ్నుడు కార్యరంగమున మాత్రం విశేషమైన ప్రతిభను చూపించడం గమనించవచ్చు.
శ్రీరాముని వెంట లక్ష్మణుడు నడచినట్లు భరతుని వెంట శతృఘ్నుడు సేవా భావముతో మెలగినట్లు చూడవచ్చు. శ్రీరామునికి మాత్రము ముగ్గురు తమ్ము లపై ఎనలేని వాత్సల్యము ఉండేడిది.
శ్రీరామచంద్రుని వనవాసమునకు పంపునపుడు లక్ష్మణుడు ఎందుకు వారించలేదని భరతుని ప్రశించడాన్ని పరిశీలిస్తే అన్నగారి పైనున్న అవ్యాజ ప్రేమ ప్రతిబింబిస్తుంది. లక్ష్మణుడు తండ్రిని ఎందుకు ఎదిరించలేదని అడిగాడు. ఇది శతృఘ్నుని ప్రతిఘటన మనస్తత్వాన్ని తెలియచేస్తుంది.
శ్రీరామచంద్రుడు పదకొండువేల సంవత్సరాలు కోసల రాజ్యాన్ని పరిపా లించాడు. రామరాజ్యం ఒక అపురూపమైన కాలము యుగయుగాలకు అది ఆద ర్శమై నిలిచింది. శ్రీరామచంద్రుడు, భరతునితో కూడి అనేక సేవాకార్యక్రమాలను నిర్వహించేవాడు శతృఘ్నుడు. రామరాజ్యం అద్భుతంగా కొనసాగుతున్న కాలం లో కూడా అసుర బాధలు తప్పలేదు. లవణాసురుడను వాడు బుషులను, ప్రజల ను అనేక బాధలు పెడుతూ వుండేవాడు. ఒకనాడు ఋషులందరూ రామచంద్రు ని సభకు వచ్చి తమ ఇక్కట్లను విన్నవించుకున్నారు. వాడిని వధించడానికి ఎవరిని పంపుదామని సభలో సభికులను ప్రశ్నించాడు శ్రీరామచంద్రుడు. అంత భరతుడు సన్నద్ధుడవ్వగా శతృఘ్నుడు తాను లవణాసురుని అంతమొందించెద నని రాజారామునితో విన్నవించుకున్నాడు. భరతుడు ఇంతవరకు రాజ్యభారము ను మిమ్ములను స్మరించుకొనుచూ భరించి అలసిపోయినాడు. దు:ఖభరితమైన మనసుతో ఇంతకాలము పరిపాలన చేసినాడు. కందమూలములు భుజించుచూ మీరు అయోధ్యకు వచ్చునంతవరకూ సంతోషమునకు దూరమైనాడు. కావున భరతునికి కొంతకాలము విశ్రాంతినివ్వవలెను. లవణాసుర వధకు నేను పోయెద నని శతృఘ్నుడు సభాసదుల సమక్షంలో విన్నవించుకొన్నాడు.
శత్రుఘ్నుని మాట విన్న శ్రీరాముడు ఎంతగానో సంతసించి, సమయోచిత ఆలోచనకు మెచ్చుకున్నాడు. లవణాసురుని అంతమొందించుటకు సిద్ధపడమని ఆదేశించాడు. అలాగే సర్వసమర్థుడవైన నీకు లవణాసురుని అనంతరము అతని మధురా రాజ్యమునకు రాజుగా పట్టాభిషిక్తుని చేయుదునని ప్రకటించాడు. కాని ఆ ప్రకటన విని ”రాజా మీ ఆజ్ఞను తప్పక ఆచరిస్తాను. అన్న భరతుడు లవణా సురుని సంహరించుటకు ప్రతిజ్ఞ చేయగా నేను తొందరపడి మధ్యలో కల్పిం
చుకొనుట దోషము. నా పలుకుల వలన మధురారాజ్యమునకు రాజుగా వెళ్ళుట ఒక దుర్గతి. పెద్దవారైన మీరందరూ ఉండగా నాకు పట్టము కట్టి పంపుట ధర్మము కాదు. కావున అన్న భరతుని లవణాసురుని పైకి యుద్ధమునకు పంపి మధురారాజ్యమునకు రాజుగా చేయుమని” పలికినాడు. ఇది శతృఘ్నుని త్యాగ మునకు ఉదాహరణ. శ్రీరామునికి దూరమై రాజ్యము పొందుట ఒక దుర్గతిగా భావించినాడు. చివరకు రామసభ శతృఘ్నుని సమరమునకు పంపుటకు తీర్మానించినది. శ్రీరాముడు లవణాసురుని చంపుటకు తగిన ఉపాయమును తెలిపెను. అపారమైన సైన్యమును, ధనమును చేకూర్చి శతృఘ్నుని విజయుడవై రమ్మని దీవించి పంపెను.
సైన్యముతో బయలుదేరిన శతృఘ్నుడు మార్గమధ్యమున ఒక రాత్రి వాల్మీకి మహర్షి ఆశ్రమమున బస చేసినాడు. అదేరాత్రి సీతామాతా లవకుశులకు జన్మ నిచ్చింది. తరువాత ఏడు దినములు సైన్యముతో ప్రయాణించి యము నానది తీరమునున్న చ్యవన మహర్షి ఆశ్రమమున బసచేసెను. లవణాసురుని గమన మును, దినచర్యలను మహర్షిని అడిగి తెలుసుకొన్నాడు. అంత చ్యవన మహర్షి అతని దుర్మార్గపు పనులను, ప్రజలు, ఋషులు పడే బాధలను వివరించెను. రావ ణుడి సోదరి కుంభిని కుమారుడు లవణాసురుడు. అతని తండ్రి మధు గొప్ప శివ భక్తుడు. అతని భక్తికి మెచ్చి ఒక మహిమాన్విత త్రిశూలాన్ని ప్రసాదించాడు. అది ప్రస్థుతం లవణాసురుని వద్ద కలదు. అదిచేతిలో ఉండగా లవణాసురుని ఎవరూ జయించలేరు. శతృఘ్నుడు మధురానగరము నుండి వేటకు వెళ్ళి తిరిగి వస్తుం డగా ద్వారము కడ లవణాసురుని అడ్డగించి , రెచ్చగొట్టి అతనితో యుద్ధము చేసి రాముని స్మరించి ఒక దివ్యాస్త్రముతో అతని గుండెలు చీల్చి చంపివేసెను. ఆ సమ యములో త్రిశూలము కోటలోపల ఉండిపోయినది. తరువాత మధురానగర మును పునర్నిర్మించాడు. ఋషులు, ప్రజలకు శాంతిని చేకూర్చి పండ్రెండు సంవ త్సరాలు అచ్చటనే ఉన్నాడు. తిరిగి శ్రీరామచంద్రుని దర్శించుటకు అయోధ్య వస్తూ, వాల్మీకి ఆశ్రమమున బస చేసెను. అదే సమయ ములో లవకుశులు గాన ము చేసిన శ్రీరామ చరితమును విని పులకించి పోయాడు. అయోధ్యను చేరి శ్రీరా మచంద్రుని ఆదేశముతో తిరిగి మధురాజ్యమునకు పోయి పరిపాలన చేసినాడు.
శ్రీరామచంద్రుడు అవతారము పరిసమాప్తము గావించుకొని సరయూనది ద్వారా పరంధామమును చేరునపుడు శతృఘ్నుడు తన కుమారులైన సుబాహుని మధురారాజ్యమునకు, శత్రుఘాతిని విదిశానగరమునకు పట్టాభిషిక్తులను గావించి అయోధ్య చేరెను. శ్రీరామచంద్రుని అనుమతి తో ఆయన వెంట పరంధా మము చేరెను.
కార్యదక్షుడు శతృఘ్నుడు
Advertisement
తాజా వార్తలు
Advertisement