Wednesday, November 20, 2024

కాలం కలసిరాకపోవడమంటే…

మ నం మన భవిష్యత్‌ గురించి ,పిల్లల భవిష్యత్‌ గురించి ఎన్నో కలలు కంటుం టాము. కాని మున్ముందు ఏం జరుగుతుందో? ఎవరికీ తెలియదు.
ఒక్కొక్క సారి మనం అనుకొన్నట్లు జరిగితే సంతోషిస్తాము. ప్రతికూలంగా జరి గితే దైవాన్ని నిందిస్తాము. మరికొంత మంది ” మన కర్మ ఇలా రాసి పెట్టి ఉంది.” అని విచారిస్తాము. ఏది ఏమైనా ”మనగతి (భవిష్యత్‌) మనచేతుల్లో లేదు. మరి ఎవరి చేతుల్లో ఉంది? దైవమా? మనం చేసుకున్న పూర్వజన్మ కర్మల ఫలమా? కాలం కలసి రాకా? మన.ఇతిహాసాలులో, చరిత్రలో, కాలానికి లొంగిపోయి ,కష్టాలు పాలైన వారు
ఉన్నారు. కాలం కలిసొచ్చి ,దైవం అనుకూలించి, ఉత్తమ గతులు పొందిన వారూ ఉన్నారు.
నలుడు (నలమహారాజు) రాజవంశానికి చెందినవాడు. జూదం అంటే మహా ప్రీతి. విదర్బ éదేశ రాజైన భీముడు కుమార్తె దమయంతి అందచందాలు, సౌశీల్యం గురించి విన్నాడు.అలాగే దమయంతి కూడా నలుని సాహసం గురించి, అతని గుణగణాలు
గురించి వింది. వారిరువురు వివాహం చేసుకోవాలని తలచారు. దమయంతి స్వయంవరంలో నలుని వరించి , వివాహం చేసుకొంది.వచ్చిన అష్టదిక్పాలురు , దేవేం ద్రుడు వంటివారందరూ వెనుతిరిగి వెళ్ళిపోతున్న సమయం లో ,’కలి’ స్వయంవరానికి వస్తూ, విషయం వారిద్వారా తెలుసుకొని , దమయంతి తనకు దక్కలేదని కోపంతో ”దమయంతి నలమహారాజు ఎలా రాజవైభోగంతో ఉంటారో నేను చూస్తాను. వారిద్దరికీ వియోగం కలిగించి ,కష్టాలపాలుచేస్తానని ప్రతిజ్ఞ
చేసాడు.కలి ప్రభావం వల్ల ఎన్నో అష్టకష్టాలు పడ్డారు
వియోగం కూడా అనుభవించారు. ఆఖరికి వాయుదేవు డు, దేవతల అనుగ్రహంతో పోయిన రాజ్యాన్ని, భార్య దమ యంతిని పొందగలిగాడు. తెల్లవారితే శ్రీ రామునికి పట్టాభి షేకం. ఆ సందర్భంలో కైకేయి కోరిక ప్రకారం అరణ్యాలబాట పట్టవ లసి వచ్చిం ది. అయితే ఆ అరణ్యవాసంలో ఎప్పుడూ చింతించ లేదు.మునుల ఆశ్రమ సందర్శన చేస్తూ ఎన్నో
ఉపయుక్తమైన విషయ సంపత్తిని పొందా డు. మళ్ళీ అయోధ్య రాజుగా ఉండగా భార్యా వియోగం ఏర్పడినా తనలోతాను కుంగిపో యాడు తప్ప బయట పడలేదు.అందుకే రాముడు ఆదర్శమూర్తి. అవతార రహస్యం ఇందులో ఇమిడి ఉన్నా, మానవశరీరంతో ఉన్న శ్రీరాముడు విధిని తప్పించుకోలేదు. రావణుడు సీతను అపహరణకు కారణం శూర్పణక. ఆమె చెప్పుడు మాటలు విని సీతను అపహరించాడు. పేర్లు నిషాదుడు. ప్రాచేతనుడు. బోయ కులస్థుడు.పక్షులను ,జంతువులు ను వేటాడి జీవనంసాగించే వాడు. ఒకసారి నారద మహర్షి ఇతనిని సమీపించి, అహంస వృత్తిని విడనాడమని బోధించి రామనామ జపం చేయమన్నాడు. రామ శబ్దం నోరు తిరగకపోతే ”మరా” అని గబగబా చెప్పమని ,అలవాటు చేస్తే ,తపస్సులోకి వెళ్లిపో యాడు. క్రమక్రమంగా ఆయన చుట్టూ పుట్ట అల్లుకు పోయింది పుట్టలో నుండి వచ్చినందుకు ” వాల్మీకి ” అయ్యాడు. తర్వాత కాలంలో రామాయణ ఆదికావ్యాన్ని లోకానికి అందించారు. బోయ కులస్థుడు, ఏమీ చదువుకోనివాడు, తను ఇలా ప్రసిద్ధి పొందుతాడని ఎవరు ఊహించగలరు.
రాజు కావలసిన సిద్దార్థుడు, యువరాజుగా ఒకసారి రాజధానిలో సంచరిస్తూ అనారోగ్యంతో, దీర్ఘ రోగాలతో బాధపడుతున్న ప్రజల్ని, పేద వారిని , మృతదేహం పక్కనే కూర్చొని రోధిస్తున్న కొంతమంది ని చూసి, మనసు వ్యాకులత చెందింది. తండ్రి, మంత్రులు, భా ర్య ఎంత చెప్పినా మనసును మరల్చుకోలేక, జీవిత సత్యాన్వేషణకు రాజ సౌభా గ్యాలన్నింటిని త్యజించి, ఒకరోజు అర్థరాత్రి భార్య యశోధర, పసికందును వదలివెళ్ళి సన్యసించిన మహ నీయుడు. ఆయన సిద్ధాంతాలతో కూడినదే బౌద్ధమతం. మత్స్యకారుల వంశంలో పుట్టినప్పటికి వ్యాసుడు పంచమవేద మనే మహాభార తంను ఈజగత్తుకు అందిం చాడు.ఇలా పురాణాలలో, చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. అందుకే రాబోయే కా లం ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టే, భగవన్నామాన్ని పట్టుకొంటే , రాబోయే కష్టాలు స్వల్పరీతిలో ఉంటాయి.
– ఎ.జనార్థనరావు
9491554414

Advertisement

తాజా వార్తలు

Advertisement