Saturday, November 23, 2024

దర్పణ ముఖావలోకన న్యాయము

దర్పణము అంటే అద్దం. ము ఖము అంటే మొహం. అవలోకనం అంటే ఒక విషయాన్ని గూర్చి సమగ్రంగా పరిశీ లించి దాని లోని మం చి చెడులను ఎత్తి చూపే క్రియ. అంటే గుణ దోషాలు లేదా తప్పొప్పులను కనిపెట్టుట అనే అర్థం కూడా ఉంది. బయట ముఖం ఎలా ఉంటుందో అట్లే అద్దంలో కనిపిస్తుంది. ఉన్నదున్నట్లు గా ఏ విషయమైనా ముఖం మీద ప్రతిఫలించడాన్ని, ఈ దర్పణ ముఖావ లోకన న్యా యముతో పోలుస్తారు.
అద్దంమన ప్రవర్తనకు గీటు రాయి. అది మన శారీరక సంబంధ
మైన విషయాలనే కాకుండా మానసిక సంబంధమైన వాటిని కూడా నిశితంగా పరిశీలించి చూపిస్తుంది. ఎవరి ముందైనా అబ ద్ధాలు అడి బయట పడొచ్చేమో కానీ అద్దం ముందుకాదు. అది ఒక నిఘా నేత్రం లాంటిది.
”కొండ అద్దమందు కొంచమై ఉండదా?” అని వేమన చెప్పినప్పటికీ అద్దానిది ముక్కు సూటి వ్యవహారమే. ఉన్నదున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చూపిస్తుంది.
అద్దానికి రంగులు మార్చే కుళ్ళు కుత్సితం లేదు. అద్దం ముందు ఎవరు నిలబడినా అందరి నీ ఒకేలా చూస్తుంది. చూపుతుంది. అలాంటి అద్దమంటి మనసును మసకబారి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. మసకబారిన అద్దంలో మనమేంటో స్పష్టంగా కనబడం. అద్దాన్ని తుడిస్తేనే అందులో మనం చక్కగా ఎలా కనబడతామో, మనసు అద్దాన్ని కూడా ఎలాంటి దోషాల మరకలు అంటకుని, మసకబారి పోకుండా తప్పకుండా తుడుచుకోవా లి. అప్పుడే మనమేంటో స్పష్టంగా బోధపడతాం. అద్దమంటి స్వచ్ఛమైన మనసు ఉన్న వారికి లోకమంతా స్వచ్ఛంగా తనలాగే కనిపిస్తుందట. అందుకే ధర్మరాజుకు లోకమంతా మంచివాళ్ళే కనిపించారట. కారణం అతని మనో దర్పణం అలాంటిది. ఇక దుర్యోధనునికి లోకమంతా దుర్మా ర్గంగానే కనిపించిందట. కారణం అతని గుణ దర్పణం అలాంటిది మరి.
నరకాసురుని వధించడానికి సత్యభామ శ్రీకృష్ణుడితోపాటు యుద్ధరంగానికి వెళుతుంది. తనే రాక్షసులతో యుద్ధం చేస్తుంది కదా! యుద్ధం చేసే సమయంలో రాక్షసవీరుల కళ్ళకు సత్య భామ ముఖం మధ్యాహ్నం పూట వెలుగులు చిమ్మే మార్తాండుని వలె తీక్షణమైన రూపంలో కనిపించిందట. అదే సమయంలో శ్రీకృష్ణుడికి తన ప్రియసఖి సత్యభామ రూపం ‘రాకేందు బిం బం’ అంటే చందమామ వలె కనిపించిందట. ఈ వర్ణన పోతన రచించిన భాగవతంలోని దశమ స్కంధములోనిది.
”రాకేందు బింబమై రవి బింబమై యొప్పు నీరజాతే క్షణ నెమ్మొగంబు/ కందర్ప కేతువై ఘన ధూమ కేతువై యలరు బూబోడి చేలాంచలంబు/ భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెఱయు నాకృష్టమై మెలత చాప/మమృత ప్రవాహమై యనల సందోహమై తనరారు నింతి సందర్శనంబు/ హర్షదాయియై మహారోషదాయియై, పరగు ముద్దరాలి బాణ వృష్టి/ హరికి నరికి జూడ నందంద శృం గార వీరరసము లోలి విస్తరిల్ల” దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఎవరెవరి మనో భావా లను బట్టి ఎదుటి వారలా కనిపిస్తారనీ, తద్వారా వారి వ్యక్తిత్వాలు మనోభావాల దర్పణాలై చూపి స్తాయనీ. ఇలా హృదయ లోతులను సమగ్రంగా అధ్యయనం చేసి ఉన్నదున్న ట్లుగా చెప్పడాన్నే ”దర్పణ ముఖావలోకన న్యాయము నకు” ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement