Friday, September 13, 2024

Injured – జూనియ‌ర్ ఎన్టీఆర్ కు గాయం….

జూనియర్ ఎన్టీఆర్ కి స్వ‌ల్ప‌ గాయం అయింది . రెండు రోజుల క్రితం ఆయన జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ఎడమ చేయి మణికట్టు బెణికింది.. దీంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఆయ‌న మ‌ణిక‌ట్టు వద్ద క‌ట్టు వేశారు.. ఇదే విష‌యాన్ని ఆయ‌న టీమ్ కూడా దృవీక‌రించింది.. ఇది చాలా స్వ‌ల్ప గాయ‌మేన‌ని, అభిమానులు ఆదుర్ధాప‌డాల్సిన పెద్ద‌ది కాద‌ని ఒక ప్ర‌క‌ట‌నలో తెలిపింది.

ఇలా గాయపడినప్పటికీ ఎన్టీఆర్ గత రాత్రి దేవర షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు కోలుకుంటున్నార‌ని, కట్టిన కట్టును రెండు వారాల్లో తొలగిస్తారని త్వరలో తిరిగి బిజీ కానున్నారు అని పేర్కొంది. ఈలోగా ఈ చిన్న గాయానికి సంబంధించి ఎక్కువ ఊహాగానాలు వైరల్ చేయవద్దని తాము అభ్యర్థిస్తున్నామ‌ని టీమ్ కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement