Sunday, November 10, 2024

జీవన విలువల బంగరు పూత భగవద్గీత

ప్రపంచ ప్రసిద్ధ రచనల్లో భగవద్గ³ీతకు ఓ ప్రముఖమైన స్థానం ఉంది. భగ వద్గీత ఓ మహోద్గ్రంథం. నిజానికి భగవద్గీతలో ఉన్నది ఏమిటి? భగవద్గీ త చెబుతున్నది ఏమిటి? చాంధసవాదులు భావిస్తున్నట్టు, భగవద్గీత సనాతన మార్గ సంస్కృతీ సంప్రదాయాలను ఉటంకిస్తూ, ఆధ్యాత్మిక పరిపూర్ణ తను అం దించే మకుటాయమానమైన ఆధ్యాత్మిక మహా గ్రంథమా? అభ్యుదయవాదులు భావిస్తున్నట్టు సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించే మూఢ విశ్వాసాల గ్రంథ మా? లాంటి అనేకమైన ప్రశ్నలు తలెత్తుతాయి.
ఈ విషయాల మీద ఎన్నో రకాలైన వాదోపవాదాలు, చర్చోపచర్చలు జరి గాయి. జరుగుతూనే ఉన్నాయి. భగవద్గీత జన జీవన విలువల బంగరు పూత. భగవద్గీత హందూ సంస్కృతీ సంపత్తుల ఊట. భక్తినీ ముక్తినీ మోక్షాన్నీ అందించే మార్గం. భవ రోగ పీడితుల పాలిట మహా ఔషధం. అహం, మోహం, మమకారాల ను దునుమాడే దివ్య సాధనం.
అలాగే వ్యక్తిత్వ వికాసాన్ని అందిం చే మహా విధానం భగవద్గీత. కాబట్టి విస్తృత పరిధిలో మానవ వికాసా న్ని మనందరిలో, అణువణువునా ఆవిష్కరింపజేసే వ్యక్తిత్వ వికాస గ్రంథం భగవద్గీత అని చెప్పడం అతిశయోక్తి కాదు.
వ్యక్తిత్వ వికాసంలో అయిదు ”వి” లు ఉంటాయి. వినయం, వివే కం, వందనం, విజ్ఞత, విజ్ఞానం అనే వి ఆ అయిదు ‘వి’ లు. ఈ అయిదు ‘వి’ లను విస్తృతంగా అన్యాప దేశం గా అందిస్తుంది భగవద్గీత.
అదేవిధంగా వ్యక్తిత్వ వికాసం లో, ఆంగ్లంలో ఉం డే ఆరు ‘డి’ లు ఉం టాయని ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణు లు చెబుతున్నారు. అవి డిసిప్లిన్‌ (క్రమశిక్షణ), డివినిటి (దివ్యత్వం), డివోషన్‌ (భక్తి భావం), డిటెర్మి నేషన్‌ (పట్టుదల), డిస్క్రిమినేషన్‌ (విచక్షణ), డెడికేషన్‌ (అంకిత భావం) ఈ ఆరు ‘డి’ లను వినూత్న పద్ధతిన చర్చించి అందిస్తుంది భగవద్గీత. అంతేకాకుండా మూడు ‘పి’ లు, ప్యూరిటీ (స్వచ్ఛత), పెర్ఫెక్షన్‌ (పరి పూ ర్ణత), పయస్‌ నెస్‌ (పవిత్రత) గురించి ఎన్నో విధాలుగా భగవద్గీత విపులీ కరిస్తుంది. తత్ఫలితంగా సంపూర్ణత్వాన్ని మనలో ఆవిష్కరింప చేస్తుంది. అందువల్ల భగవద్గీతను వ్యక్తిత్వ పోషణాత్మక గ్రంథమని చెప్పక తప్పదు.
భగవద్గీతలో మత చాంధసం ఉందా?

భగవద్గీతలో మత చాంధసం కనపడదు. మత సంబంధమైన మకిలితనం భగవద్గీతలో కనిపించదు. మత బంధత, మత బంధనం, అజ్ఞానం, చాంధస త్వం ఏ కోణంలోనూ భగవద్గీతలో కానరావు. సంస్కృతీ, సంప్రదాయం, సనాత నత్వపు జ్ఞానం, ప్రజ్ఞానం, సుజ్ఞానం ప్రతి పదంలోనూ ద్యోతకమవుతాయి.
ఇంతటి విశిష్టత, విలక్షణతలతో కూడుకున్న మహా భాష్యాన్ని, మరణ సమ యంలో పార్థివ దేహం ముందూ, అంతిమ యాత్రలోనూ వినిపించే శోక గీతం గా, వ్యాఖ్యానంగా భగవద్గీతను పరిగణించటం, మార్చడం అజ్ఞానానికి చిహ్నం గా భావించాలి. మనకి మనమే చేసుకుంటున్న దౌర్భాగ్యంగా నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. భగవద్గీతలో ఆత్మ గురించి, వైరాగ్య భావం గురించి సవిస్తరం గా చర్చించటం జరుగుతుంది. ఆ విషయాలను తెలుసుకోవడం మంచిదే. కానీ మరణ సమయంలో భగవద్గీతను చదవాలనే నియమం ఎక్కడా లేదు. ఇది తెలి యనితనం వలన కొత్తగా వచ్చిన పోకడ. ఈ ఆలోచనలో, పోకడలో మార్పు రావాలి. భగవద్గీత ఏమిటో పేర్కొనడం, ఒక్క మాటలో చెప్పడం ఏ ఒక్కరికీ సా ధ్యంకాదు. భగవద్గీత జీవితానికి శాంతిని, ప్రశాంతతను అందించే ఊరట. పర మాత్మ శ్రీకృష్ణుడు చూపే త్రోవ. జీవుడు భావించుకుంటున్నట్లుగా పరమాత్ము నికి చేసుకునే సేవ. వ్యవహారిక మార్గానికి అర్ధాన్ని, పరమార్ధాన్ని, పారమార్ధిక తత్త్వాన్ని అందించే వరిష్ట గ్రంథం భగవద్గీత. అమరత్వాన్ని అమృత తత్త్వాన్ని ఆవిష్కరింపచేసే బంధం భగవద్గీత. వ్యక్తిత్వ వికాస పరిపుష్టతను అందించే అద్భుతాల మూట. ఆత్మ సౌందర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పరిపు ష్టం చేసే ఉద్గ్రంధం భగవద్గీత. బంధాలను, భవ బంధనాలను తగ్గించే మహోధృ త తరంగాల వాడి భగవద్గీత.
మానవాళికి జీవనాడి భగవద్గీత. జీవిత పధాన్ని, విధానా న్ని, నిర్దేశించే మహావ్రాత భగవద్గీత. మన తలరాతను మార్చే మహా మంత్రం. దివ్యత్వాల మానవత్వాల మధ్య మధ్య వర్తిత్వ దూత భగవద్గీత.
అర్జునుడిని నిమిత్తమాత్రునిగా చేసు కుని, సర్వులకు ప్రతినిధిగా భావించి, సకల మానవాళికి, కురుక్షేత్ర సంగ్రా మంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి మార్గ శిర ఏకాదశి రోజున చెప్పిన బోధనల ఊట భగవద్గీత. గురువులను, బంధు వులను, స్నేహతులను, సన్నిహతుల ను చూసి మమకారంతో జావగారి నీరు గారిపో యిన అర్జునుడికి కర్తవ్య బోధ చేసిన శ్రీకృష్ణుడు చెప్పిన బలీయమైన మాటల మూట భగవద్గీత.
జీవితమనే యుద్ధంలో జయా లు, అపజయాలు, కష్టాలు, కన్నీళ్ళు, మోదం, ఖేదం తప్పవనీ, అన్నింటినీ ఓర్పుతో నేర్పుతో ధైర్యంగా ధీయుతం గా ఎదుర్కోవాల్సిందే అనే జీవిత పాఠా న్ని నేర్పే ”మేనేజ్మెంట్‌ గ్రంథం భగవద్గీత. స్థిత ప్రజ్ఞతను, స్థిర విజ్ఞతను నేర్పించే మహోపదేశ సారం భగవద్గీత.ఘన భవిత కు పట్టంకట్టే సాధనా సంపత్తుల ఊత.
ఆ దేవదేవుడు మానవాళికి యిచ్చిన అభయం. సాధకుని దివ్యత్వం అంచులకు తీసుకునిపోయే మహమాన్విత త్రోవ.
గాలీ, నీరూ, నిప్పూ, చెట్టూ, గుట్టా, పుట్టా, రాయీ, రప్పా, రెమ్మా, కొమ్మా, అన్నీ… అంతా… ఆ పరంధాముని మయమే అని చెప్పే వేదాంత సంగ్రహం. రూపం మారిన స్వరూపం, స్వరూపంలో ఉన్న సమస్తం భగవద్గీత.
‘అన్నీ నేనే’, ‘నువ్వు నిమిత్త మాత్రుడివి’ అనే ఆధ్యాత్మిక రహస్యాన్ని ఉదా హరణలు, సోదాహరణలతో వివరిస్తూనే, సోమరితనం, కర్మ అనాసక్తతను ప్రోత్సహంచకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా, చేయాల్సిన పనిచేసి తీరాల్సిం దే అనే పరమ సత్యాన్ని నొక్కిచెప్పే అసమాన అభివ్యక్తీకరణ భగవద్గీత.
స్వ హతాన్ని, పర హతాన్ని బోధించి జీవితాలను పండించే వెలుగు భగవ ద్గీత. సంపూర్ణ సమగ్ర జీవన తత్వాన్ని, జీవ తత్త్వాన్ని, జీవిత తత్త్వాన్ని, తాత్త్విక తను అందించే, పరిపూర్ణ ఆధ్యాత్మిక అనుభవాల ఆధునికత కలబోతల జ్ఞానా గ్నుల జిలుగు భగవద్గీత.
అందుకే భగవద్గీత (గీత) గీతామాత అయ్యింది. పూజ్యనీయురాలైంది. పూజలు అందుకుంటోంది. గీతా పారాయణాన్ని ఓ యజ్ఞంగా నిర్వహద్దాం. గీత ను అర్ధం చేసుకుందాం. యజ్ఞ ప్రసాదాన్ని ఆరగిద్దాం. యజ్ఞ ఫలాన్ని అనుభ విద్దాం.
(గీతాజయంతి (డిసెంబర్‌ 4) పురస్కరించుకుని)

Advertisement

తాజా వార్తలు

Advertisement