Tuesday, November 26, 2024

అతిశయం సర్వత్ర అనర్థమే!

మహాభారతంలో శాంతి పర్వంలో ధర్మరాజు సందే
హా లను భీష్ముడు ఒక్కొక్కటిగా తీరుస్తూ ఉంటాడు. ఒకసారి ధర్మరాజు భీష్మునితో ”ఒక్కోసారి వ్రతాలు ఆచరించేవారు భోజనాలు చేస్తుంటారు గదా! అలా చేయడం వలన వారి వ్రతం చెడిపోతుందా?” అని ప్రశ్నించాడు. తిక్కన కవి ఈ విషయాన్ని ఒక చక్కని సీస పద్యం ద్వారా తెలిపాడు.
సీ,, ఇరు ప్రొద్దుగుడుచుచు- నెడ నెడ గడువక
యుండు- నాతండు ”సదోపవాసి”
రుతుకాలమున- నాత్మ సతియంద రతి సల్పు
భవ్యశీలుడు- సదా బ్రహ్మచారి
దేవపిత్ర తిథి పూజా విధులందిది
మఱినంజు పురుషుడు మా సంభోజి
దననట్లు పంక్తి వారును భుజింప భుజించు
సంచి తాత్ముడు ‘విఘ సాశనుండు’
గీ,, భృత్యవర్గంబుగుడిచిన పిదప గుడుచు
నాత ‘డమృతాశి’, దివ సంబునందునిదుర
వోని పుణ్య స్వప్న, డిప్పొల ములగుమ
హధి కవ్రతములు- దేహ బాధకములు”
అంటూ వ్రతం అంటే ఒక మంచి సంకల్పంతో దేవతలను ద్దేశించి, కొన్ని నియమాలతో చేసే పూజావిధానం. లేదా మహా ఫలాన్ని కోరుతూ, దేహేంద్రియాలను ఎండగట్టటంతో పాటుగా చేసే ఒక ప్రక్రియ. ఇక్కడ భోజనం అంటే కేవలం ఆహారాన్ని కడు పులో వేయడం మాత్రమే కాదు. ఏ ఇంద్రియానికి ఏది ఆహారమో దానిని అందించడం.రోజుకు రెండు పర్యాయాలు నియమితమైన కాలాల్లో భోజనం చేస్తూ మధ్యలో ఏమీ తిననివాడు ఎప్పుడూ ఉపవాసం ఉం డే వ్యక్తి. రుతుకాలంలో మాత్రమే తన భార్య యందు శరీరం సుఖం పొందేవాడు నిరంతర బ్రహ్మచారిగా పరిగ ణించబడతాడు. దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, భోజ నం పెట్టి మిగిలిన పదార్థాలను తీసుకొనేవాడు. ‘విఘ సాశి’ తనమీద ఆధారపడి బ్రతికేవారందరూ భుజించిన పిదప భోజ నం చేసేవాడు ‘అమృతాశి’, పగటి నిద్రపోనివాడు ‘అస్వప్నుడు’ ఈ హద్దులను మించి ఆయా పనులను చేసే నిష్టలు, అనగా మహా ధిక వ్రతములు శరీరాన్ని బాధించేవి మాత్రమేనని తెలిపాడు కవి. భీష్ముడు ధర్మరాజుకు సదోపవాసి, బ్రహ్మచారి, అమాంసభోజి, విఘసాశి, అమృతాశి, అస్వప్నుడు అనే విషయాలను వివ రించాడు.
రాజా! ఎప్పుడూ ఏమి తిననివాడు, స్త్రీయందు కామ బుద్ధిలేని వాడు, మాంసం ముట్టని వాడు. విఘసం అంటే అతిథు లు- అభ్యాగతులు భుజింపగా మిగిలిన ఆహార పదార్థములను ఉపయోగించేవాడు. యజ్ఞంలో ఉపయోగింపగా మిగిలిన పదా ర్థం తినేవాడు. నిద్రపోనివాడు అనేవి పద్యంలోని పదాలకు స్థూల మైన అర్ధాలు. భీష్ముడు ఈ పద్యంలోని ఆరు పదములకు సూక్ష్మా ర్ధాలను వివరిస్తూ ”రాజా! ఉపవాసం ఏదో ఒక ప్రత్యేక సందర్భా నికి చెందినదికాదు. అది ప్రతి దినమునకు సంబంధిం చిన చర్య. దాని విధానం రెండు పూటలు మాత్రమే భోజనం చేయడం. భోజనం విషయంలో నియమాన్ని పాటించే వ్యక్తి ఎల్లప్పుడూ ఉపవాసం చేసే వ్యక్తిగా ఉంటాడు. తగనివేళల్లో భుజించడం దోషం. దీనినే సదోపవాసి అనే భావన కల్గిస్తుంది.
బ్రహ్మ చర్యం అంటే బ్రహ్మమునందు త్రికరణాలతో అనగా మనోవాక్కాయ కర్మలతో మెలగడం. రుతు కాలాలలో మాత్రమే అగ్ని సాక్షిగా చేపట్టిన స్త్రీయందు రతిక్రియను
ఒక పవిత్రమైన కార్యంగా నిర్వహించేవాడు. ఇత నే భవ్యశీలి. రేతస్సును సద్వినియోగం చేసేవాడు సదా బ్రహ్మచారి.
మనం తినే ఆహారం విఘసం అనీ, అమృ తం అనీ రెండు రకాలు అని ధర్మ శాస్త్రం సందేశం. యజ్ఞంలో ఉపయోగింపగా మిగిలిన ఆహారం అన్నం అమృతం. అతిథులు మొదలైనవారికి పెట్టగా మిగిలిన ఆహారం ‘విఘసం’ వారు తృప్తి గా భుజించిన పిదప మంచి మనస్సుతో శుభ పరంపరలను కోరుకుంటారు. అవి కామధేను వుల వంటివి. తనతో సమానంగా యితరులకు
కూడ పెట్టడం అంచితాత్ముని అనగా గొప్ప మన స్సుగల వాని లక్ష ణాలు. అట్టివానినే ‘విఘ సాశి’ అంటారు.
నిద్ర శరీరానికి విశ్రాంతినిస్తుంది. దేహేంద్రియాలకు ఒక విధ మైన ప్రశాంతి నిచ్చేది నిద్రయే. దానికొక నిర్ణీతమైన కాలం పరిధీ ఉన్నాయి ఈ విషయాలను తత్వదృష్టితో తెలుసుకోవాలి. కావున ధర్మరాజా! మహాధిక వ్రతములు దేహబాధకాలు అని తెలుసుకో” అని భీష్ముడు ధర్మ బోధన చేశాడు. ఎంతో శ్రద్ధగా ఆలకించిన ధర్మరాజు ఆనందంగా తాతకు వందనం చేశాడు.
– పి.వి. సీతారామమూర్తి
9490386015

Advertisement

తాజా వార్తలు

Advertisement