పల్లవి : జయలక్ష్మి | వరలక్ష్మి | సంగ్రామ | వీరలక్ష్మి
ప్రియురాలవై హరికి బెరసితివమ్మ || అమ్మా
చరణం : పాలజలనిధిలోని పసనైన మీగడ ||
మేలిమి తామెరలోని మించు వాసన
నీలవర్ణు నురముపై నిండిన నిధానమవై
ఏలేవులోకములు మమ్మేలవమ్మ || అమ్మా
చరణం : పదియారు వన్నెలతో బంగారు పతిమ
చెదరని వేదములా చిగురుబోడి||
ఎదుట శ్రీ వేంకటేశు నిల్లాలవై నీవు||
నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ || అమ్మా
పల్లవి : జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి
ప్రియురాలవై హరికి బెరసితి వమ్మా ||
సంగ్రామ వీరలక్ష్మి
అన్నమాచార్య కీర్తన
రాగం – లలిత
తాళం – రూపక తాళం
గానం – లంకే రాంగోపాల్