Monday, November 4, 2024

మహారుద్ర శబ్దాలతో పురాణపండ జయ జయ శంకర !

సికింద్రాబాద్, (ఆంధ్రప్రభ) : అనాది క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కపిలతీర్థం వంటి మహాక్షేత్రాల్లో కార్తీక మాసపు మహాలింగార్చనల్లో పాల్గొనే పుణ్యదంపతులకు మంత్ర బిల్వదళంగా జయజయ శంకర అక్షర పరిమళ గ్రంథాన్ని పరమ సౌందర్యంతో ఆత్మ సమర్పణాభావంతో అందించిన బీఎస్.సీపీఎల్ గ్రూప్ చైర్మన్, కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యపై భక్త బృందాలు అభినందనలు వర్షిస్తున్నాయి.

ప్రముఖ రచయిత, శ్రీశైల మహాక్షేత్ర పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ పరమ సౌందర్యంతో, ఎంతో విలువైన మంత్రరాజంగా, మహారుద్రాభిషేక ఫలంగా అందించిన ఈ మంత్రపేటిక గొప్ప ఆకర్షణతో పాటు పవిత్రతను నిర్మలంగా దర్శింప చేస్తోందని నాటి భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పై మహానేత గ్రంథాన్ని అద్భుతంగా రూపొందించి జాతీయస్థాయి మేధో సమాజాన్ని ఆకట్టుకున్న కళారాధన సంస్థాపకులు సంజయ్ కిషోర్ పేర్కొన్నారు.

బొల్లినేని కృష్ణయ్య వంటి రాజకీయ సాంస్కృతిక వైద్యరంగాల యోధుడు మహాశైవక్షేత్రాలు కొన్నింటికి ఈ అపూర్వ జయజయ శంకర గ్రంథాన్ని ఉచితంగా అందించే మంగళ సంకల్పం కలగడం శివానుగ్రహంగా పేర్కొన్నారు. పరమాత్మకోసం నిత్యం సత్యాన్వేషణ చేసే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఒక శివానుభూతితో ఈ నిర్మాణాత్మక పవిత్ర కార్యాన్ని భుజాన వేసుకుని అతిఅరుదైన శైవచిత్రాలతో, అక్కడక్కడ అందమైన వ్యాఖ్యానాలతో జయజయ శంకర గ్రంథాన్ని ఒక దివ్యానుభవంగా అందించడం పూర్వ జన్మ సుకృతంగా సంజయ్ కిషోర్ చెప్పారు.

ఆదివారం ఉదయం జయజయ శంకర ఉత్తమ ప్రతిని కృష్ణయ్య సంజయ్ కిషోర్ కి అందజేశారు. ఇప్పటికే మహోత్కృష్టమైన కవిత్వం కర్పూరంలా అక్షరాల మధ్య చక్కగా చల్లుతూ దుర్గా, వేంకటేశ్వర, ఆంజనేయ, శ్రీకృష్ణతత్వాల అమోఘ గ్రంథాలతో లక్షల భక్త పాఠకుల మనసుల్ని ఆకట్టుకున్న పురాణపండ శ్రీనివాస్, జయజయ శంకర గ్రంథాన్ని రుద్రశబ్దాలతో, శైవక్షేత్ర మంగళ స్పర్శగా తీర్చిదిద్దడం తనకి ఎంతో సంతృప్తిని కలిగించిందని గ్రంథ సమర్పకులు బొల్లినేని కృష్ణయ్య చెప్పడం గమనార్హం.

గత దేవీ నవరాత్రోత్సవాల్లో బెజవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, తిరుమల బ్రహ్మోత్సవాల్లో పురాణపండ గ్రంథాలకు ఎంతో చక్కని స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, దేవాదాయ శాఖామంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ కేఎస్.రామారావులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పుణ్యగ్రంథాన్ని బొల్లినేని కృష్ణయ్య భక్త పాఠకులకు వేల సంఖ్యలో సమర్పించడం విశేషంగా చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement