Friday, November 8, 2024

మంత్ర ప్రసాదానికి శ్రీకారం చుట్టిన పురాణపండకు జయహోలు

విజయవాడ (ఆంధ్రప్రభ) : తెలుగు రాష్ట్రాల ఆలయాల చరిత్రలో ఒక మహత్కార్యాన్ని గత తొమ్మిది నెలలుగా భుజాలకెత్తుకున్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్‌ కేఎస్‌.రామారావుపై రాజకీయ నాయకులు, మేధావులు, అర్చక పండిత సమాజం ప్రశంసలు వర్షిస్తోంది.

నిస్వార్ధత, పవిత్రత, అంకితభావం, అసాధారణ రచనా ప్రతిభ జీవన సౌందర్యాలుగా గత రెండు దశాబ్దాలుగా దేశదేశాల తెలుగుభక్త పాఠకులను ఆకట్టుకుని ఎన్నో సమాజాల్ని ఆకర్షించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌, రచనా సంకలనాల మనోహర లావణ్య గ్రంథాలు ఏడింటిని వరుసగా అమ్మవారి సన్నిధానంలో ఆవిష్కరింపచేసి వేలకొలది భక్తులకు ఉచితంగా అమ్మవారి మంత్ర ప్రసాదంగా అందించడంతో నానాటికీ పవిత్రస్పందన పొంగులెత్తి ఇతర రాష్ట్రాల వరకూ రామారావు కొత్త పవిత్రఅంశం శ్రీమయంగా సంచలనం సృష్టించి, పురాణపండ శ్రీనివాస్ విశిష్ట రచనల సామర్థ్యానికి జయహోలు పలుకుతున్నారు.

దుర్గమ్మ సన్నిధిలో గతంలో ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీసహస్ర గ్రంథాన్ని ఆవిష్కరించగా, విఖ్యాత ప్రవచనకర్త, మహాసరస్వతీపుత్రులు చాగంటి కోటేశ్వరరావు పురాణపండ శ్రీనివాస్‌ దివ్యమైన రచన ఉగ్రం.. వీరంను ఆవిష్కరించి ప్రాణస్వరూపమైన పవిత్ర వేవేలుగుల్ని పురాణపండ శ్రీనివాస్‌ అద్భుతంగా అందించారని ఆశీర్వదిస్తూ మంగళశాసనాలు చేశారు.

మరొక గ్రంథం జయ జయోస్తుని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్‌ కేఎస్‌.రామారావు ఆవిష్కరిస్తూ, తన ఆలయ జీవనవైభవంలో ఇలాంటి అపురూప విలువలున్న గ్రంథాలను ఇన్ని వేలు పంచి పెట్టడం ఎంతో భాగ్యంగా భావిస్తున్నానని, పురాణపండ శ్రీనివాస్‌ అమోఘ తపశ్శక్తి వల్లనే ఇలాంటి తేజోమయ గ్రంథాలను అందించగలుగుతున్నారని, మామూలుగా ఇది సాధ్యం కాదని, ఎన్నో ప్రశస్తమైన గ్రంథాలను ఇంత అందంగా అందించడం వెనుక పురాణపండకు నిస్సందేహంగా కనకదుర్గమ్మ అనుగ్రహం ఉందని చెప్పారు.

వరుసగా దుర్గే ప్రసీద, దేవీం స్మరామి, సౌభాగ్య, శ్రీనిధి, హరే హరే ఇలా అనేక దివ్యరచనల్ని ఆవిష్కరింపచేసి ఆలయంలోని అర్చన టికెట్ల కౌంటర్లు, డొనేషన్‌ స్కీం కౌంటర్‌, ప్రత్యేక పూజల కౌంటర్ల ద్వారా ఈ అమోఘ గ్రంథాలను పంచి పెట్టించడంతో అమ్మవారి సన్నిధిలో నాణ్యతా ప్రమాణాల ముద్రణల గ్రంథాల్ని తీసుకున్న భక్తబృందాలు కొందరు వెనక్కి వచ్చి మరీ కార్యనిర్వహణాధికారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి వెళ్లడం కనిపిస్తోంది.

- Advertisement -

ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి అత్యంత ప్రత్యక్ష పర్యవేక్షణలో, దేవాదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ అధికారిక సూచనల మేరకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్‌ కేఎస్‌.రామారావు దసరా ఉత్సవాల్లో ప్రతీరోజు తాను సిబ్బందితో కలిసిపోయి నిర్వహించిన శ్రీకార్యక్రమాల్లో పురాణపండ శ్రీనివాస్‌ బుక్స్‌ రెండు గ్రంథావిష్కరణలు విశేషంగా ఆకట్టుకోవడం ఒక ఎత్తయితే, ఉత్సవాల ముగింపుదశలో ఏర్పాటు చేసిన సలక్షణ ఘనాపాఠీలు, క్రమపాఠీలు, వేద పండితులతో జరిపించిన వేద పఠనం మహాద్భుత కార్యక్రమంలో ఆనం రామనారాయణరెడ్డి ఆవిష్కరించిన దేవీం స్మరామి గ్రంథాన్ని వందలమంది వేద పండితులకు బహూకరించడంతో పండిత బృందాలు రామారావును, పురాణపండను అభివాదపూర్వకంగా ఆశీర్వదించడం ప్రత్యేకంగా పేర్కొనాలి.

ఏదేమైనా తెలుగు రాష్ట్రాల చరిత్రలో అద్భుత గ్రంథాల్ని వేలకొలది భక్తులకు వేలాది దివ్యగ్రంథాలను మంత్ర ప్రసాదంగా అందించిన ఘనత నిస్సందేహంగా దుర్గమ్మ ఆలయానికి దక్కిందని దేవాదాయశాఖ సాక్షిగా చెప్పాల్సిందే. ఈ పవిత్ర శ్రీకార్యంలో కీలక భూమిక వహించిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్‌ కేఎస్‌.రామారావును దుర్గమ్మ అనుగ్రహంతో అభినందించాల్సిందే. రచన సౌందర్యంలో పవిత్ర ఆకర్షణలు మహత్తరంగా ఆవిష్కరించే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌కి జయహోలు పలకాలని విజ్ఞులు చెప్పడం పరమసత్యంగా అంగీకరించాలని దేవస్థాన సిబ్బంది, భక్తగణాలు ముక్తకంఠంతో చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement